Tuesday, April 12, 2011

కమ్మవారి చాటుపద్య రత్నావళి



కమ్మవారి చాటుపద్యరత్నావళి
 మొదటిభాగము
 గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామవాసియు,కమ్మవారి చరిత్ర,
బ్రాహ్మణేతర విజయము మొదలయిన గ్రంధముల
 రచించినవారును, బ్రాహ్మణేతర సంఘాభిమానులు నగు
 శ్రీయుత
సూర్యదేవర రాఘవయ్య చౌదరి
గారిచే సంపాదింపబడినది.
 ----------------------------
బెజవాడ:
ఆంధ్రగ్రంధాలయ ప్రెస్,(లిమిటెడ్)యందు
క. కోదండరామయ్య గారిచే
ముద్రింపబడియె.
 1926
కాపీరైటు రిజిష్టర్డు)  (వెల రు ౦-౮-౦
-----------------------------
ఈ ప్రాచీన గ్రంధమును సేకరించి, ప్రస్తుత ఈ రూపమిచ్చినది:
కొత్త కమలాకరము
కొత్త రాజేష్
 .........................................

పీఠిక
  సీ.సువివేకశాలురై * కవివతంసుల జేర్చి
             పోషించినట్టి స*ద్భూమిపతుల
వేడుక నపుడప్డు * విరచించి జనులకు
             వినిపించి చనిన క*వీశ్వరులను
వినినపద్దెము భువి* మనియుండు నొరులకు
             నేర్పిగతించిన*నేర్పరులను
నేర్చినవారల* నెరిగి కష్టంబుల
             కోరిచి కూర్చిన*ధీరవరుల
గీ.గూర్చిన సుపద్యములనెల్ల* గోర్కి మీర
ధనమొసంగి ముద్రింపించు* ధార్మికులను
నిరవధిక జగదుపకార* సరణిదలచి
యనుపమానకృతజ్ఞత* నభినుతింతు.

చాటువులు కేవలాతిశయోక్తిమయంబులును నస్వాభావిక వర్ణనాలంకృతంబులును ననృతకధాత్మకంబులునుంగాక యీయాంధ్రప్రపంచమం దప్పుడప్పు డెన్నియో జనించి కాలప్రవాహంబునంబడి నశించినవి నశింపగా నింక నెన్నియో నేటికిని జీవించియున్నవి. ఇయ్యవి యొక్కక్కపట్టున గావ్యప్రబంధముల ఫక్కినధఃకరించి కవుల కధికసహాయ్య మొనరించుచు శాసనములమించి చరిత్రకారులకు జేయూతనొసంగుచు మహోపకారులై మహదానందదాయకములై యలరాలుచు నయ్యైకాలపరిస్థితుల నామూలాగ్రముగ నెరింగించుచుండును.
 ఇట్టి చాటువుల ననేకకష్టములకోర్చి సేకరించి సంపుటీకరించి గ్రంధములుగా దొలుత ప్రకటించిన మహామహులు వరుసగా బ్ర. వేటూరి ప్రభాకర శాస్త్ర్రి, దీపాల పిచ్చియ్య శాస్త్ర్రిగారలు; వీరొనర్చిన సత్కృత్యమున కెంతయు నాంధ్రప్రపంచము కృతజ్ఞమైయుండుగాక!
 సంఘసేవాపరాయణులగు నీగ్రంధసంపాదకులు శ్రీయుత సూర్యదేవర రాఘవయ్యచౌదరిగా రీపద్యముల సంపాదించి యచ్చొత్తింప ననువగురీతి సవరింపుడని నాకడకు పంపిరి. పద్యములనెల్ల సాంతముగా దిలకించి తొలుత సవరింపనెంచి పిదప "జాటువుల సవరింపనెంచుట సమంజసముగా" దనుట దలంచి చాలవరకు జాటుపద్యమణిమంజరి, చాటుపద్య రత్నాకరములందున్న పద్యములకు సరిపోల్చి చూచి యారీతిగనే యుండునట్లు చేసితిని. శేషించినవానిని మాత్ర మంశములు లోపింపకుండునట్లుగా యతి గణప్ర్తాసాదులు మాత్రము సవరించితిని. ఇందులకు బ్రాజ్ఞులు మన్నింతురుగాత! మరియు నేయేవంశములను గూర్చిన వారిపద్యముల నాయావంశముల క్రిందజేర్చి వంశవిభాగమేర్పరించి చూపితిని. మిక్కిలి ప్రకటింప ననర్హములైన కొన్నింటిని ద్రోసివైచి నేసంపాదించిన పద్యములైదింటి నిందు జేర్చితిని.
 ఇట్టి ప్రత్యేకసాంఘిక చాటుపద్యసంపాదనోద్యుక్తులయిన శ్రీయుత సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారికి సాంఘికులెల్లరును గృతజ్ఞులయ్యెదరుగాత.

యనమలకుదురు,                                       ఇట్లు,
ది10-8-1926.                                 వెలగపూడి దానయ్య చౌదరి.

....................................................

విజ్ఞప్తి
  చ.మనియును నిష్కళంకమగు* మానవధర్మము వీడకేరు జీ
వనపు టెడారిదాటి జన*వందితులై పరలోకమేగిరో
యనుకరణీయముల్ జగము*నందు సుకీర్తిని గోరునట్టి స
జ్జనులకు నమ్మహామహుల*సద్కధరూపక పాదచిన్హముల్.
             -శ్రీకృష్ణజీవితచారిత్రము
 మహాత్ముల జీవితచారిత్రము లమూల్యవిజ్ఞానరత్నములు.సాధారణముగా మనుష్యునిజీవితము దారి తెన్ను గానరాని యొక యిసుకయెడారివంటిది. మానవుడు తనజీవితముయొక్క పరమార్ధమును దెలిసికొనుటకు దనకంటె ముందుగా జీవితయాత్రను సాంతముగ గడపి తమ పవిత్రక్షాద్రాదులచే యశఃకాంతను నజరామరముగా నొనర్చిన మహామహుల జీవితచారిత్రములు కరదీపికలై కరము మెరయుచుండును.
 కమ్మవారు దమపూర్వమహామహుల జీవితచారిత్రకకరదీపికల నరయుట కయ్యవి శాసనరూపములుగను జాటుపద్యరూపములుగను అమావాస్యనాటి చంద్రునిపగిది నుండియు గానరాకుండెను. అయ్యది శోచనీయమగుటచే తమయావజ్జీవితసర్వస్వములను దృణప్రాయములుగ దేశమునకర్పించిన కమ్మకులజులగు మహానుభావులజీవితముల తత్సంఘీయులహృదయక్షేత్రములందు వెదజల్లు శ్రేయోదాయకమని తలంచి నాయశక్తతను గమనింపక నీచాటుపద్య్ములను గ్రంధరూపమున బ్రచురింప నుద్యమించి యస్మచ్ఛ్రేయోభిలాషుల
సాహాయ్యమున నీపద్యరత్నముల సంపాదించి తప్పొప్పుల సవరింప నసమర్ధుడనై శ్రీయుత వెలగపూడి దానయ్య చౌదరి కవిగారి కంపుకొనిన వా రతిదయతో బద్యములసవరించి యింకగొన్నిపద్యములను జేర్చి సలక్షణముగ నచ్చువేయించిరి. అందుల కా కవిగారికెంతయు గృతజ్ఞుడనైయుండి వందన శతంబులు సమర్పించుకొనుచుంటిని.
 చాటుపద్యములంపిన శ్రీయుత కాజ వేంకట్రామయ్య చౌదరిగారికిని శ్రీయుత పరుచూరి కోటయ్య చౌదరిగారికిని యితరమాననీయు లందరికిని నాకృతజ్ఞతాసూచకవందనములు. స్వకులాభిమానమూని ముద్రణకగు ధనవ్యయమును భరించిన శ్రీయుత గుమ్మడి తాతయ్య చౌదరిగారి దత్తపుత్రులగువేంకట్రామయ్య చౌదరిగారికి గృతజ్ఞతావందనములు.

కొల్లూరు.                                     ఇట్లు సంపాదకుడు,
8-8-26                                   సూర్యదేవర రాఘవయ్య చౌదరి


----కమ్మవారి------
చాటుపద్యరత్నావళి
.       ...............
 కులము
 సీ.రాజనీతిజ్ఞులై * రాష్ట్రముల్ పాలించి
           గడియించిరి యశంబు * గమ్మవారు
వీరాధివీరులై * పోరుల జయమంది
          గడియించిరి యశంబు * గమ్మవారు
శరణాగతత్రాణ * సరణి నాత్మ నెఱింగి
          గడియించిరి యశంబు * గమ్మవారు
సత్యవాక్పాలనా * శక్తిచే బొగడొంది
         గడియించిరి యశంబు * గమ్మవారు

గీ.అర్ధిజనకల్పతరువులై * యలరి మిగుల
గడనజేసిరి యశమును * గమ్మవారు
మించు ధర్మంబు నెఱిగి చ*రించి మిగుల
గడనజేసిరి యశమును * గమ్మవారు.         1
  
సీ.రణరంగమందున *రాకొట్టిశత్రుల
        గ్రుమ్మిచంపెడివారు * కమ్మవారు
రండురండంచు న*ర్ధార్ధులబిలిచి య
        ర్ధమ్ముఇచ్చెడువారు * కమ్మవారు
పలికినపలుకుల * బాఱువోనీయక
        యిమ్మునిల్పెడివారు * కమ్మవారు
ప్రాణంబు గోల్పోవు * పట్టులందైన మా
        నమ్ము గోల్పోవరు * కమ్మవారు

గీ.అమితదారిద్ర్యదశయందు * నైన నొకని
నిమ్మని కరమ్ము జాపరు * కమ్మవారు
ఎట్టిసమయమ్మునందైన * నెందుకైన
గడగి ధృతివీడబోవరు * కమ్మవారు                         2
  
సీ.పోటుమానిసితన * మున  బెట్టినదిపేరు
        విశ్వాసమునకెల్ల * బిరుదుగొమ్మ
దైవభక్తియు దలదాచికొన్న గృహంబు
        రాబత్తిగలవారి * ప్రాణదాత
డంబంబు మొదలంట * దాచు చీకటికొట్టు
        మొక్కలంబున గన్న * ముక్కుద్రాడు
కసిదీర్చుకొనుటకు * బుసగొట్టు నెఱద్రాచు
        కాపట్యము హరింప * గండుబిల్లి

ఆ.పిఱికితనమునకును * బురిటింటివెన్నెమ్మ
వూతకార్యములకు * జేతియూత
సతతభరితహలము * సాంద్రకీర్తిఫలంబు
దొమ్మివెల్లికలము * కమ్మకులము                        3
  
సీ.ఎవ్వారి వంగసం * బెల్ల నోరంగల్లు
             విభునిపుట్టువుచే బ*విత్రమయ్యె
నెవ్వారి బాహువి*జృంభణమహిమచే
            నెలగోలు మృగరాజు * సీల్చె నరుల
నెవ్వారియాటోప*మే  విజయపురికి
            బెట్టనికోటయై * పెంపుగాంచె
నెవ్వారి శౌర్య వి*స్తృతిధృతివీర్యముల్
            తురకగుండెలకెల్ల * దుడుకుగొల్పె

గీ.వారు సంస్తవనీయతా * భాసమాన
కీర్తివల్లీసమాక్రాంత* కిరికరి కమ
ఠ ప్రముఖభూరి సత్వకాం*డ భరితక్ష
మాతలులు కమ్మవారలు * మహితమతులు.      4
  
సీ.శ్రీ కటక్కర్నాట* సింహాసనంబున
          నెల్లగా రావెళ్ళ * మల్లఘనుడు
త్యాగద్వయంబొప్ప * దగనర్ధులకు నిచ్చె
        నెలమి సాయపనేని * వేంకటాద్రి
ఆదిగర్భేశ్వరుం* డతి కృపాభరితుండు
        పెమ్మసానికులుండు * తిమ్మఘనుడు
కొండపల్లీ దుర్గ *కువలయ దేశాహి
       విభవుండు  యట్లూరి * వేంగిళన్న
అమితాశ్రితావళి * కమర భూజపుగుంపు
       మించు యారలగడ్డ * కంచినీడు
దరికొండ వీటికి * దక్షుడై విలసిల్లు
        నలవాసిరెడ్డి మ*ల్లప్రభుండు
రాజిత పల్లకి * రమణతోడుత నందె
        స్థిరమొప్పగా కాజ *తిమ్మనీడు
రామచంద్రునిరీతి * రహి నాశ్రితుల బ్రోచు
       బరికింప నెలమంచి* పర్వతాలు
దిగ్దేశములయందు * స్థిర నిజకీర్తిచే
       విలసిల్లు కోనేరు * వేంకటాద్రి
శత్రువైనను వచ్చి * శరణువేడిన గాచు
      నధికుండు రేగుల* యంకినీడు
కోటాన కోట్లలో* మాటనిల్కడ గల్గె
      నౌర ! పిన్నమనేన*నంతవిభుడు
సరసవైభవభోగ* సామగ్రి వేడ్కతో
      సాటిసేయగ జాష్టి*జగ్గఘనుడు
పరగ ధర్మాత్ముండు * పటుశౌర్య సింహంబు
       జగతి పర్వతనేని * జగ్గనీడు
ధనధాన్యవస్తుసం*తతులచే వర్ధిల్లె
       బొంకాస కొమ్మినే*న్వెంకటాద్రి
రాజాధిరాజులు* రమ్మని మన్నింప
      పెంపొందెను కొడాలి *పేరినీడు
భూరిప్రతాపవి*స్ఫూర్తిచే జెన్నొందె
      గణుతింప మండవ* గంగినీడు
దానధర్మవివేక * తారతమ్యము నెంచ
      దాసర వేంగన్న* ధర్మశాలి
బాంధవ పోషణ* భాగ్యరేఖారూఢి
      భాషింప వెల్లంకి*బసివినీడు
పౌరుషవంతుడై* ప్రాభవోన్నతి గాంచె
      నెలమితో కర్లపూ*డెఱ్ఱవిభుడు
సజ్జనుల్ నుడిజేయ * చారుకీర్తి గడించె
      ముదముతో ముల్లంకి*మూర్తినీడు
పేదసాదలనెల్ల* నాదరంబున బ్రోచు
      నరయ దమ్మారెడ్డి* యంకినీడు
కాకుళేశ్వరస్వామి *కన్నంబు వెట్టించె
      సుగుణుండు చలసాని * సోమనీడు
తప్పనాడడు మాట* తగులక్షలకునైన
      బొప్పనహరినీడు*బుధులువొగడ
బంగాళ నేపాళ* పాండ్యభూములయందు
     బొగడందె లింగమ*పుల్లఘనుడు
కవిపుంగవులచేత*గణితంపు కృతిగాంచె
    వేడ్క వీరపనేని* వేంకటాద్రి
కామినేని కులాగ్ర* గణ్యుడై విలసిల్లె
     చినభోగినీడతి*దానపరుడు
సత్యధర్మంబున*నత్యంత గుణదాత
     నయశాలి మాగంటి *నాయడమ్మ
వర్ణింపగా కార్య*వంతుడై విలసిల్లు
     కలగర నరసన్న * ఘనయశుండు
నరపతి,గజపతి,* తురగపతుల మూడు
     సింహాసనంబులు * చెలువుమీఱ
బాలకీ లశ్వముల్ * పరగ నందియు భువి
     బాలించి ధర్మముల్ * లీలనిల్పి
  
గీ.నెరయగా రాజ్యభారంబు*నిర్వహించి
శత్రుల జయించి పణ్యంబు* సంతరించి
హితుల బోషించి వైభవో*న్నతినిగాంచి
యందలంబుల బాలకీ* లందినారు
కమ్మచౌదరు లత్యంత * ఘనులుమీరు         5

  *   *   *   *   *
కమ్మవారి చాటుపద్యాత్నావళి

  వాసిరెడ్డివారు
             -*-
 వెంకటాద్రినాయడు.
సీ.శ్రీకృష్ణవేణికి*జెలువొప్ప బడమర
         సిరిదేజరిల్లు ల*క్ష్మీపురంబు
ఆయూరికుత్తరం*బతిరమ్యమైనట్టి
     కుదురైన భైరవ*గుట్ట కలదు
పశ్చిమభాగాన*బరభయంకరమైన
     సౌరొప్పు మేదర*సాల కలదు
దక్షిణమ్మున నీదు*తల్లిపేరిట నొప్పు
    ప్రేముడి యచ్చమ్మ*పేట గలదు

గీ.మేటిరాజులు మన్నీలు * మిమ్ము గొలువ
గజతురంగంబు లిరుగడ * గదిసి నిలువ
వసుధ బెంపొందితివి భళీ!* వాసిరెడ్డి
వేంకటాద్రీంద్ర!మన్నెహం*వీరచంద్ర!         6
  
సీ.ఏరాజు కట్టించె *నెలమితో నమరావ
        తీపురప్రాకార* గోపురములు
ఏరాజు ఘటియించె* హితభద్రగిరికేళీ
        కుంభధ్వజస్తంభ* గోపురములు
ఏరాజు రచియించె * భూరివైకుంఠపు
     రస్తంభవర గోపు*రాలయములు
ఏరాజు నిలిపె బొ*న్నూరుపట్టణధర్మ
    కూటధ్వజస్తంభ*గోపురములు
 
గీ.మేటి బాపట్ల గుంటూరు*మోటుపల్లి
చింతపల్యాది కుండిన*సీమ గొన్ని
యూళ్ళ నేతత్ప్రతిష్ఠల* నొసరజేసె
నతడు శ్రీవేంకటాద్రీంద్రు* డతులయశుడు.         7
సీ.విభుధేంద్రసేవ్యమై * వెలయు క్రౌంచనగంబు
సలలిత వేంకటాచలముగాగ
నాశ్వజశుద్ధ మ*హానవమ్యాగతుల్
బ్రహ్మోత్సవాగత*ప్రజలుగాగ
బారమార్ధిక హోమ* పాత్రోన్నభోక్తంబు
తనర దీర్ధప్రసాదంబుగాగ
శ్రుతగజస్యందనా*రూఢోత్సవోన్నతుల్
దివ్యరధోత్సవ*స్థితులుగాగ

గీ.విశ్వ సర్వంసహాస్థలా*విర్భవంబు
తిరుపతిస్థల మమరావ*తీస్థలంబు
వన్నెజెలువొంద విలసిల్లె*వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రనామ పృ౮ధ్వీవరుండ! 8
సీ.ఏరాజు వాకిట * నేప్రొద్దు గృష్ణాన
దీదివ్యతిలకంబు*తిరుగిచుండు
నేరాజు హృదయమం*దింద్రప్రతిష్ఠితుం
డమరేశ్వరేశ్వరుం*డమరితుండు
నేరాజు కెదుటగా* నీప్సితార్ధము లీయ
వైకుంఠపురిశౌరి* వరుసనుండు
నేరాజు నెడబాయ* కేవేళ గేళికై
రాజ్యలక్ష్మియు హృష్టి౮గ్రాలుచుండు

గీ.నట్టిరాజును వినుతింప*వలవియగునె?
రాజమాత్రుం డటం చన*రాదుగాని
వేంకటాద్రీంద్రు డనుచును*వినుతిసేయ
వలయు శ్రీవాసిరెడ్డి స*త్కులజమణిని. 9

సీ."సర్వబుధ శ్రేణి* సంతరింప దలంచి
గగనావతీర్ణమౌ* కల్పకంబు"
"కల్పకం బదికాదు* కవిచేతనావళి
బ్రేమతో బ్రోవ గా*న్పించు ఘనుడు"
"ఘనుడు గా డితడు స*జ్జన చకోరావళి
గరుణింప వచ్చు రా*కావిధుండు"
"విధుడు గా డితడు కో*విదజనాధారుడై
సిరు లీయవచ్చు ని*క్షేపమూర్తి"


గీ.యనగ విలసిల్లితౌర! జ*గ్గావనీంద్ర
లక్ష్మమాంబాతనూజ! స*ద్రాజతేజ!
వాసిరెడ్డన్వవాయ స*ద్వార్ధిచంద్ర!
ధీరగుణసాంద్ర! వేంకటా*ద్రిక్షితీంద్ర! 10

సీ.ధరణి నేవిభు డద్య*తన భోజరాజంచు
విద్వద్గణంబుచే* వినుతి గాంచె
నెఱయ నే ఘనుడు దా*నంతన రాధేయు
డని రాజసభల బ్రఖ్యాతి గాంచె
నేనృపుం డైదంయు*గీ యార్జునుండని
శూరులచేత బ్ర*స్తుతి వహించె
నేమహాప్రభువర్యు * డిల నధునాతన
రుక్మాంగదుండని* రూఢిమించె
గీ.నఖిలవిద్యా పరిశ్రమా*ద్యంత దాన
శౌర్య హరివాసరవ్రత * చర్యలందు
నట్టి శ్రీవాసిరెడ్డి వం*శాబ్ధిపూర్ణ
చంద్రుడగు వెంకటాద్రి ధా*త్రీంద్రు డలరు. 11


సీ.సురసరిద్ధరణ రు*గ్ద్విరదభిద్ధరకు భృ

ద్దర శర చ్చరదర * స్ఫురితకీర్తి

హరిసఖస్వరు హరి*ద్ధరికరోద్ధుర భయం

కర శరోత్కరముఖ*క్షరద రాతి

సురభి కిన్నరకులే*శ్వరసుత స్మరమరు

ద్వర జనుస్సురుచి సుందరతనుండు

తరణి భూశరద ని*ర్జర కురుట్సురగవీ

హర సఖామరమణీ* వరవితీర్ణి




గీ.నృపతిమాత్రుండె యాశ్రిత*నివహ పద్మ

భానుడై భూరి ధీరతా*సూనరత్న

సానుడగు వాసిరెడ్డి వం*శ ప్రసిద్ధ

వేంకటాద్రిప్రభుండు ర*విప్రభుండు. 12



సీ.భములతో సురపాద*పములతో గంగోద

కములతో నీహార*కములతోడ

హేతితో నమరేంద్ర* వీతితో నైలింప

భూతితో పరమేష్ఠి* సూతితోడ

నవ్వుతో విరమల్లె * పువ్వుతో జేజేల

బువ్వతో బలుకుల* యవ్వతోడ

శూలితో గూఢపా* త్పాలితో మౌక్తిక

పాళితో సారంగ* పాళితోడ



గీ.మొల్లమున నల్లిబిల్లియై * యెల్లజగము

నల్లుకొని నీ యశోవల్లి * యుల్లసిల్లు

శ్రీవిభాసిత జగ్గభూ*భృత్తనూజ

వేంకటాద్రీంద్ర నృపచంద్ర! * విజయసాంద్ర! 13



సీ.లోకప్రసిద్ధ వ*ల్లుట్లనామకగోత్ర

పద్మపంకేరుహ * బాంద్గవుండు

వాసిరెడ్డ్యాఖ్యాన్వవాయ పారావార

శారద రాకాని*శాకరుండు

రణరంగఫల్గున*రాజ జగన్నాధ

భూజాని సింహత*నూజవిభుడు

లక్ష్మీసతీతుల్య * లక్ష్మీసతీగర్భ

శుక్తికానర్ఘోరు*మౌక్తికంబు



గీ. కొండవీ డాది వినుకొండ*కొండపల్లి

బందరు నిజాముపట్టణ *ప్రముఖ రాజ్య

విభుడు జగదేకవీరుడు * వేంకటాద్రి

నాయడు బహద్దరు ధనాధి*నాయకుండు. 14


సీ. ధాత్రీసురప్రీతి * ధనతులాభారంబు

దూగ నేభూతి* తూగగలడు?

నవరత్న కీలిత * నవ్యద్కిరీటంబు

మించి యేరాజు ధ౮రించగలడు?

పదినూర్లశిరముల * ఫణిరాజుపై శౌరి

లీల నేపతి పవ్వళింపగలడు?

చతురిభరాజిత * స్యందనారూధత

జక్కగా నిక నేరు * సల్పగలరు?




గీ. అతడు రాజశిఖామణి * ధృతిసురాద్రి

కనుకనే తత్ప్రకార ప్ర*కాశుడగుచు

వసుధ బెంపొందె నౌరౌర * వాసిరెడ్డి

వేంకటాద్రీంద్రు డతుల పృధ్వీవరుండు. 15


నీనప్రతిమానమూర్తినని వ*క్కాణింతు నిన్ధాత్రి గీ
ర్వాణస్తోమములెన్నబ్రత్యహము సా*లగ్రామగోదానభూ

దానాన్న ప్రతిపాదనార్ధులిడి శీ*తక్షోణిభృత్సేతు మ

ధ్యానూనాంబుధిమేఖలాస్థలి సమా*ఖ్యంజెందితీవేగదా

భూనాధావళి, వేంకటాద్రినృపతీ! పూర్ణప్రభావాక్పతీ! 16



మ. వరహాల్కాసులభంగి సేవలు కం*బళ్ళట్ల రూపాయలు

న్మఱిగవ్వల్బలెగంకణంబులు తృణప్రాయంబుగానిచ్చిబం

గరుపళ్ళెంబుల బాయసాన్నమును ల*క్షబ్రాహ్మణాపోశనం

బరలేకిత్తువు వాసిరెడ్డి కులదీ*పా! వేంకటాద్రీశ్వరా! 17


శా. ఏరీ నీవలెగీర్తిగాంచిన ధరి*త్రీశు ల్జమీందార్ల గా
శీ రామేశ్వరమధ్యభూమిని నర*శ్రేణి న్విచారింపగా

సారాచారత గాంచిరో ప్రజల కి*ష్టాన్నంబు బెట్టించిరో?

ధీరాగ్రేసర! వేంకటాద్రినృపతీ! దేవేంద్రభాగ్యోన్నతీ! 18




ఉ. అర్ధికి నీవొసంగిన పదార్ధ*ము భోజన వస్త్ర ధర్మ కా

మ్యార్ధములౌ త్వదన్యవసు*ధాధిపులిచ్చు పదార్ధముల్నిశా

తీర్ధ మరీచి కామ్లరస* దివ్యసుఖాదులునౌనొ? కావొ? స

త్పార్ధివ! వేంకటాద్రివసుధాపతి! నూతనమన్మధాకృతీ! 19




చ. గుణనిధి! వేంకటాద్రినృప*కుంజర!వైభవధీ! భవత్సుధీ

జనకరవంశ జాతముల * శత్రుమదేభనికాయ సద్వధూ

గణనయనాండజాతముల * గారణజన్ముడ నౌటచేత గం

కణములునిల్వగా నొకట * గల్పనజేసితి వెంతచిత్రమో? 20






క. అమరావతి యమరావతి

యమరగ నింద్రుడు వేంకటాద్రీంద్రుండే

యమరులు గోత్రామరులే

కమనీయము నందనంబు * ఘననందనమే. 21



మ. మురుగుల్ గొల్సులు చంద్రహారములు స*మ్మోదోక్తి

నిద్దంపుటుంగరముల్ పోగులు పల్లకీలు హయసం*ఘం బగ్ర

హారంబుల్ మెఱయంజాలిననేలుపుల్ ధనము నె*మ్మిన్

వేంకటాద్రీంద్రుచే దరచున్ గొన్న బహుస్థితుల్ గలిగి వి

ద్వాంసుల్ సుఖం బందరే? 22




శా. తేజఃకాంతి వితీర్ణిభోగకరుణా * ధీసారతన్ బద్మినీ

రాజున్ రాజును రాజరాజు సుమనో*రాజున్ నదీరాజు వా

గ్రాజున్ బర్వతరాజు మీరితివి నీ*కాసాటి భూరాజులో

రాజశ్రీయుత వాసిరెడ్డి కులచం*ద్రా! వేంకటాద్రీశ్వరా! 23





మ. సురభూమీరుహపంచకంబున, రమా*సూనుండు నొక్కొ

క్క శాఖ రహిన్ గైకొని వాసిరెడ్డికులరా * కాచంద్రుడౌ

వేంకటాద్రిరసాధీశుని పంచశాఖముగ గూ*ర్చెన్నేడు

మాకున్మహేశ్వరపూజాతిశయంబటంచుసురభూ*జంబుల్

ముదంబండెడిన్. 24




క. ఇలగల నృపతులు నీతో

దులదూగకయున్న నీవు * తులదూగితివౌ

బళి బళి బంగారముతో

బలసాంద్రా! వేంకటాద్రి * పార్ధివచంద్రా! 25




గీ. వైభవోపేంద్రుడైనట్టి * వాసిరెడ్డి

వేంకటాద్రీంద్రు డొకపెండ్లి * వేళయందు

చిన్నదొరలకు నత్తరు * కొన్న కర్చు

పృధ్విగల రాచవారికి * బెండ్లికర్చు. 26







క. వెన్నెలవలె గప్పురపుం

దిన్నెలవలె నీదుకీర్తి* దిగ్దేశములం

దౌన్నత్యంబున వెలసెను

విన్నావా? వాసిరెడ్డి * వేంకటనృపతీ! 27







చ. హితమతి వేంకటాద్రి విభు*డేలెడు నయ్యమరావతీపురిన్

గ్రతుభుజులన్నవస్త్రములు * గాంచరొకప్పుడు బూర్వదేవతా

హితమతి; వేంకటాద్రి నృపు*డేలెడు నీయమరావతీపురిన్

సతత సమస్తవర్ణులును * జక్కగ గాంచుదురన్న వస్త్రముల్ 28







మ. సుమబాణాకృతి! వేంకటాద్రినృపతీ! *శుంభత్ప్రతాపాఢ్య!నీ

యమరావత్వమరేశ్వరోన్నత సువ*ర్ణాంచన్మణీగోపురో

ద్గమమెన్నన్ద్విజరాట్శశశ ప్రధమదృక్ప్రా*ప్త స్థితింగాంచికా

ర్యముకాదంచును నిల్చెగాక గగనం*బంతంతకున్మించదే? 29







మ. క్షయసంవత్సర మాఘశుద్ధ శుభచం*చద్వాదశీ జీవవా

రయుతశ్రేష్ఠ పునర్వసు ప్రఝష స*ద్రాశిం దులాభారమే

నయశీలుం డమరావతీపురములో*నన్దూగి నానార్ధిసం

చయహర్షాప్తి ధనంబొసంగె గవులెం*చన్వేంకటాద్రీంద్రు రీ

తియనంగాదగి వాసిరెడ్డి కులము*న్దేజంబు జెన్నొందగన్. 30







ఉ.ఎన్ని వనంబు లెన్ని కృతు*లెన్ని సురార్చన లెన్ని దేవళా

లెన్ని సువర్ణ గోపురము*లెన్ని తటాకములెన్ని బావులె

న్నెన్నిపురంబులెన్ని కల*వెన్నిక ధర్మములెన్న ధాత్రిపై

బన్నిన వేంకటాద్రివిభు*పాటినృపాలుడు లేడు చూడగన్. 31







క.శ్రీ వాసిరెడ్డి కులభవ

పావనుడై వేంకటాద్రి*పతి భాసిల్లెన్

గేవల వాగ్దీపశిఖా

వ్యావృత కలధౌత కుంభి*తాహిమకరుడై. 32







ఉ.తద్దియు వాసిరెడ్డి కుల*ధన్యుడు వేంకటనాయ డర్ధికిన్

గొద్దిగ నిచ్చెనేని నృప*కుంజరు కొక్కని పెండ్లికౌనహో

గద్దరి మేదినీశ్వరులు * కద్దని యిచ్చినయీవి పూటకుం

జద్దికి జాలదాయె నృప*సందడి దాతలనెన్న దోసమే? 33







క. భూపతిమతి జగతీ భృ

ధ్బూపతి శ్రీవేంకటాద్రి *భూపతి క్రౌంచ

ద్వీపాకృతి దగు శిఖర

స్థాపిత హరినీలఘటిత* తారాపధయై. 34







చ. కమలజుడుర్విపై గవుల* గాయకులన్సృజియించికల్పభూ

జమునుసృజింపనైతిని * చక్కగ జక్కని వాసిరెడ్డి జ

గ్గమహిమవేంకటాద్రినృపు * గారణజన్ముసృజించెగానిచో

నమితవిహాయితాత్మమతి*యైచెలువొందునె? చిత్రవైఖరిన్. 35







శా. సద్వర్ణాంచిత హేమపాత్రతతితో * సత్రంబులోన న్విశి

ష్టాద్వైతప్రముఖద్విజావళికి మృ*ష్టాన్న ప్రదోక్తిన్వివే

కద్వైపాయను లిందువచ్చిరనగా * గాన్పించు తన్మధ్యతి

ష్ఠధ్వైచిత్ర్యగుణక్రమప్రతతి భా*స్వచ్చంద్రికాశోభక్రౌం

చద్వీపం బమరావతీపురము వీ*క్షాసక్తి జూడంగన్. 36







సీ. అంజనాచలమీన * గంజోద్భవాండంబు

నిండారు రానడ*గొండలనగ

భానుబింబంబుపై * బగలు సాధింపగా

గోరాడుచీకటి * గుంపులనగ

కవిదర్శనాపేక్ష * గదలివచ్చిన గజా

సురగోత్ర దానవ * స్తోమమనగ

వింధ్యశైలస్థలి * వెడలి కృష్ణాస్నాన

వాంచాగతేభరా*డ్వర్గమనగ







గీ. వెలయు నమరావతీపురి * వేంకటాద్రి

విభుమనోభీష్టసంచార * వీధి దలచి

తీర్ధవాసంబు గావున * దిరుగులాడు

తత్పదావళి మత్త దం*తావళములు. 37







గీ. వైభవోద్దాము డైనట్టి * వాసిరెడ్డి

వేంకటాద్రీంద్రు డర్ధార్ధి * వితతి కొసగు

నొక్కపూటవ్యయంబు లీ*తక్కినట్టి

రాజకోటికి నొకయేటి * భోజనంబు.







ఉ. అక్కడ వేంకటాద్రివిభు * నద్భుతచర్యలు సూచివచ్చి తా

నిక్కడ గూర్చె బండితుల * నిద్దరిలోపల వాసి రెడ్డి వా

రెక్కడ...................యుప్పలపాటి జోగిరా

జెక్కడ నక్కయెక్కడ న*దెక్కడ నిర్జరలోకమెక్కడో? 38










సీ. దీపాల మిసిదనల్ * దాపినబంగారు

టోపీశిరంబందు * నేపుసూప

రంగైన నీసమస్త * రంగీజరీచెట్ల

లుంగీ హోయల్ మీఱి * చెంగలింప

గుజరాతికెంపుల * కూర్పుతిన్ననయొప్పు

పలువర్సపై నవ్వు * చెలువుదనర

మేచారమున బచ్చ * పోచీకరంబందు

మేల్మిజీఱల ముద్దు * లల్ముకొనగ







గీ. నరసి చిగురాకు దరవారు * వరువజీరు

......................... 39







క. జలజారికళలయందును

గలశాంబుధియందు బ*న్నగప్రభునందున్

నెలయై యలయై తలయై

యలరెన్ నీకీర్తి వేంక*టాద్రిమహేశా! 40






ఇంకా ఉన్నాయి..త్వరలో..


------------------------------------------------------------------------

‘కొత్త’ వారి
వంశానుక్రమణిక చరిత్ర


కం శ్రీలలరసంగమేశ్వర
శైలేంద్రకుమారి హృదయజాలనచతురా
శూలధరలోకనాయక
పాలింపుము వృషభవాహప్రమదాధిపతీ ౧

ఉ శ్రీకరకొండవీటియను సీమధరన్ బరగెన్ మహోన్నతిన్
ప్రాకటమొప్పగాను మహిభాసిలు సంగమచామరల్ పురిన్
వీకమరంగ నందుతగ వేట్కలకెల్లను నాటపట్టుగన్
జోకుగ సంతతంబు కడుశోభితమై సరసాళిమెచ్చగన్ ౨

సీ శిరులచేచామలన్ పురవరంబున నుత్త
రపుదిశవెలయు రమ్యముగను
ప్రాగ్భాగమున తుంగభద్ర మహానది
కడుపటమట కృష్ణ
తేగీ. వెలశె కడునత్రిమునిచేత యిల బ్రతిష్ట
దక్షిణామూతిన్ యంత్రవిధానమునను
ధరనుచామలన్ పురజనవరులబ్రోవ
బ్రమదమలరార వరముల నమరనొసగ ౩


2

సీ సంగమేశ్వరు కటాక్షమున ధరాస్థలి
మహితవేట్కలను చామలన్ పురము
సంగమేశ్వరుకటాక్షమున మహానంద
మహిమచేనొప్పు చామర్లపురము
సంగమేశ్వరుకటాక్షమున సంపదలచే
మానుగా వెలసె చామర్లపురము
సంగమేశ్వరుకటాక్షమున శ్రీశుభముల
మరెవైభవమున చామరలపురము

తే.గీ దురితజాలములణచు చామరలపురము
బరగెసద్గుణములకు చామరలపురము
బరహితమునకాస్పదము చామరలపురము
గరుణ కామూలకమును చామరలపురము ౪

సీ కాంచనమణి చిత్ర ఖచిత హర్మ్యంబులు
వికసితరంగ వల్లికలుకలిగి
బహిద్వార బంధకవాటవర్గములచే
పచ్చలతోరణాలచ్చుపడగ
మహిదేవతా రామమందిరంబుల చేత
బహువస్తు సముదాయప్రభను వెలసి
కమలాదిలతల సంకలిత వారిజముల
విలసిల్లు మహిమలవివరముగను

తే.గీ ప్రాకటంబుగ విద్యలకాకరంబు
ప్రాపు బహువస్తుతతులకుదాపురంబు
వీకనఘములకెల్ల నిరాకరంబు
ఆపురంబున శ్రీసతికాపురంబు ౫

3


సీ కాలత్రయముల శంకరపదధ్యానుడౌ
కమలాసనుమహిమగరిమయెంత
ఏకవింశతిసాలున్ బోధకుండ వధియించు
జామదగ్ని ప్రతాపజాలమెంత
ధన వృధ్ధియందున ధాటిగల్గి వహించు
ఘనునికుబేరుని ధనమదెంత
ఏరువ్రయ్యలుచేసి ఎసగిప్రకాశించు
బలశాలి బలరాము బలిమియెంత

తే.గీ అలపితామహపరశురా మలకరాజ
శీరవరుల సుజ్ఞానవిశేషద్రవ్య
కృషివితతులం దగింపరుగొనబుమీర
సరసులప్పురి బ్రాహ్మణక్షత్రవరులు
వైశ్యజనములు శూరులు వరలు వీట ౬

తె.గీ అట్టిశూరులలో నలరాలుచుండు
ధర్మపరులయ్యు మిగుల సత్కరుణ గాంచి
వనరయీశ్వర పదభక్తవరులునగుచు
కలుములను యిల్లువెళ్ళని కమ్మవారు


ఉ సమ్మతి మీర నెమ్మదిని సంతతమున్ భగవార్చనమ్ములన్
నిమ్ముగ భక్తినిల్పుకొని యేర్పడగొల్చుచు జ్ఞానవంతులై
నిమ్మహిమాన్యతన్ దగ నటింపుచు దాస్వకులోభితంబుగా
కమ్మకులంబునొప్పె శితికంఠవర ప్రదదత్తచిత్తులై


సీ శ్రీమించుప్రాగ్దిశ భూమినివాసంబు
కొత్తకులాంబుధి కువలయేశు
డగు వేంకటాద్రి నుద్దండ విక్రమునమా
నిత రాజసన్మాన నీతములను
పొంది ఐశ్వర్య సంభోగాదులందుచు
నిరంతరంబుపురహరస్మరణుడగుచు
యుర్విని భూమిదేవోత్తములకు వేడ్క
వేడలేదనకిచ్చు వితరణుండు

తే.గీ నౌర యీతనిసాటి రార వనియందు
సత్యవాక్యుండు సరసుండు సద్గుణుండు
సంభ్రమస్వాంతుడాశ్రిత సదయకరుడు
సనగ వెలశెను మిగుల కొడాలిపురిని ౯

4


తే.గీమహిని సంపత్కరముల చే రహినిమీర
జోకుగాపాంన్కు నూళ్ళగోత్రీకుడగుచు
వెలశెవారల వంశంబు విదితముగను
మాన్యులై వేడ్క పిదపచామరలపురిని ౧౦

కంఆ వెంకటాద్రియొకనా
డీవిధముననుండి మిగుల నెసగెడుమదినిన్
దేవునిదలచుచు శయ్యను
భావించిబరుండ రాత్రిబ్రమదంబెసగన్ ౧౧

చం బరమకృపావలోలుడయి భర్లుడుతావృషభేంద్రుపైనయా
గిరివరపుత్రుగూడుకొని కిన్నెరులెల్ల నుతింపుచుండనా
వరప్రమ దాదులేర్పడగ వైభవముప్పతిలంగ బ్రేమచే
గరుణవహిల్ల నాతనికి గన్పడె స్వప్నమునందు చెచ్చెరన్ ౧౨

తే.గీ చూచిపులకాంకితుండు నై చోద్యమంది
యరసిసాష్టాంగ దండమర్పించి మిగుల
లేవకున్నంతభక్తుని లేవనెత్తి
యలమినిట్లని యానతినిచ్చె బ్రీతి ౧౩

కం ధరచామర్లను సత్పుర
వరమున శ్రీసంగమేశ వరనామమునన్
దిరముగ వెలశితి నీవును
గరమొప్పగ నందు జేరుగరిమవహిల్లన్ ౧౪

5


కం అనియిట్లద్రుశ్యుడయినను
దనవారలకెల్ల నెరుగదయనింపారన్
వినుపించి వారియనుమతి
పనుపడ పరమేశుకృపను ప్రౌఢతనుండెన్ ౧౫

తే.గీ వేంకడాద్రికి పుత్రుండు విమలమతియు
సరసుడౌదార్య వితరణసాహసుండు
పరగస్వగ్రామ పెత్తనపరిధవుండు
సూరయాఘ్యుండు నాశ్రితసుజనహితుడు ౧౬

కం శ్రీకర సుకుమారుండును
ప్రాకట మణిభూషణాది బహుళాంగధరుం
డౌకామితార్ధచిత్తుడు
సాకల్యసుభాతిశయుడు సచరితుడెలమిన్ ౧౭

తే.గీ పన్నుగానొప్పుమిగుల సూరన్నగారి
కరయపుత్రులు నేడ్గురు నందముగను
నమరి సప్తమహషున్ లయట్ల బ్రబలి
కీర్తిలలరార దురితనివర్తు లగుచు ౧౮

సీ శ్రీలలరారగా గ్రాలువిఖ్యాతిచే
నొప్పునుమహిని నప్పన్నగారు
సతతంబు సద్ధర్మ సరణిచే పొగడొంద
పన్నుగా వెలసె శంభన్న గారు
గరుణాంతరంగ సంకలితుడై బ్రీతిచే
నెన్నగా రహిని కొండన్నగారు
యెసగునౌదార్యాది రసికుడై జనులెల్ల
క్రన్నన పెద్ద వెంకన్నగారు

తే.గీచెన్నుమీరగ ఘనుడు ముత్తన్నగారు
సన్నుతులగాంచె జగతి సీతన్నగారు
చిన్నదనమున చిన్న వెంకన్న గారు
విశదమైనట్టి కీతున్ వెలశె మహిని ౧౯

6


సీ అగ్రజు డప్పన్న యవనీతలంబున
ధన్మాభివృద్ధిగాదనరె భువిని
నాశిగాచనుదెంచు భూసురోత్తములకు
నొసగెమాన్యాదుల నెసగుమతిని
ఆరామకూప మహత్వాది దేవతా
మందిరంబులను సమ్మతినెసంగ
జేయించి పరతత్వదాయియై సతతంబు
గ్రామాధికార సుధాముడగుచు

తే.గీ సంగమేశ్వర వరలబ్ధ సహితుడగుచు
చెలగి సద్గుణ సత్యసుశీలుడగుచు
మహిని స్వారాజ్య రాజసన్మాను డగుచు
వెలశె ధరణీతలంబున విమలుడగుచు ౨౦

సీ బహుపురాణ శ్రవణ పారీణ సంభ్రమ
స్వాంతానుభవుడు ప్రశాంత మూతిన్
సాధుగోష్ఠీవిలాసాదుల నిరతంబు
బ్రహ్మానుభవమున ప్రబలు మూతిన్
విశదంబుగా షోడశమహాదానాది
వితరణ కరుడు సద్విదితయశుడు
సత్యసదాచార సద్ధర్మ నిరతుండు
హృదయ రంజనుండు సదయకరుడు

తే.గీ ధరనుచెలగుచు నర్ధిమందారుడగుచు
స్వపురమునందున నధికారసరణిధర్మ
పద్ధతిని బ్రోచుచుండి విశుద్ధవంశ
వృద్ధినెసగగజేసె సమృద్ధిగాను ౨౧

7


సీ అంతనప్పన్నకు నతికౌతుకముమీర
పుత్రషట్కముగల్గె ముదముమీర
సరసుడౌదార్యాతిశయములవెలసెను
నెయ్యమొప్పగను పుట్టయ్యగారు
విపుల ధర్మాధర్మ వేదియై రహిమించు
చయ్యనఘనుడు సుబ్బయ్యగారు
విభనాదుల మరసద్వినుతిచే సత్కీతిన్
మన్ననగాంచె నయ్యన్న గారు
వినయవివేకుడై మనియె సంతతమును
పన్నుగా జగతి వెంకన్నగారు

తే.గీ క్రమత ధర్మార్ధ కామమోక్షములయందు
పిన్నపెత్తనములను సంగన్నగారు
విగత భవమాననీయుడై విశదముగను
సన్నతింపగ వెలశె సూరన్నగారు ౨౨

సీ హర్షిన్ తు డప్పన్న నయిదవపుత్రుండు
గరిమచేవెలశె సంగన్నగారు
విరివిగా వాశిరెడ్వేంకటాద్రీనాయు
డవని మల్రాజు గుండ్రావుగారు
వరలు మాణికరావు భావనారాయణ
రావు మానూరు నర్స్రావుగారు
మొదలు జమీన్ దార్ల ముందట కోటము
రాజు వెంకాఖ్యవిభ్రాజితుండు

తే.గీ రంజిలంగను మిగుల దినాంజిహోద
వసుధ చామలన్ పురము నివాసముగను
వెలసె గావునపయివారు జెలగునట్లు
సలుపుచుండెను సరఫరా సరసముగను ౨౩

8


తే.గీ ఆజమీదార్లననుమతి నతిముదమున
రహినిమాణిక్యరావు నారాయణుండు
స్పష్టముగ సంగయాఖ్యుని నిష్టకపుడు
మెచ్చి భూమిని కొంతదామిచ్చె బ్రీతి ౨౪



తే.గీ అవనికోటమురాజు కులాబ్ధిసోము
డయిన యావెంకుపంతుల నతిసహాయ
మమర శ్రీసంగమేశ్వరానుగ్రహమున
జగతి సత్కీతిన్ సాధించె సంతతంబు ౨౫

క శ్రీసంగమేశుకృపచే
భాసిల్లుచు ధర్మకర్త భారము గనితా
వాసిగ నౌకర్లకువెస
భూసురు లౌననగ నొసగె భువిమాన్యంబుల్ ౨౬

తే.గీ యుర్విశ్రీ పన్కునూళ్ళ గోత్రోధ్భవశ్య
నలరుసంగన్న నామధేయస్యసహకు
టుంబఘనతర సపరివారంబుగాను
నెలమినీరీతి భూసురాదులు వచింప ౨౭

సీ బ్రత్యహంబునును మాపతినిహృత్పుండరీ
కమునందు నిల్పి నిక్కముగ మరియు
గోపురప్రాకార మేపారసత్ప్రద
క్షిణము సల్పుచును వేడ్కలను మిగుల
దగసంగమేశు సందర్శనంబును జేసి
బాడబవరులచే బ్రమదమునను
వనరంగమంత్రపుష్పాదికవిధులచే
యెసగుపూజలను జేయించిమిగుల


తే.గీ గృహమునందును నిరతంబు గొనబుమీర
యింద్రవైభవమున సత్యసంధుడగుచు
నతిధిభూసురవరుల సమ్మతులుగాను
జేశి మందారవిధమున వాసిగాంచె ౨౮


9



కం అతిముదము నిష్టవేల్పని
బ్రతివత్సరమునను వుతవాదివిధంబుల్
మితిలేక సల్పుచుండెను
చతురిండిత డౌరయనగ జగతిన్ వెలసెన్ ౨౯

తే.గీ అంతసంగన్నగారికి సంతసమున
సుతులునల్వురు వరుసగా సుదతిమణియు
లలితసద్గుణ నికురంబలక్ష్మమాంబ
నొనరగానొప్పె యీశ్వరానుగ్రహమున ౩౦

కంఘనుడు నరసాభిదాహ్యయు
డనబరగిన భావయాఖ్యుడనగను పిదపన్
వినయుడగు సీత యాహ్వయు
డనధరలో లింగయాఖ్యుడనగా వెలసెన్ ౩౧

కంసరసుడు నరసాహ్వయుడిల
వరసద్గుణములను వంశవర్ధనుడగుచున్
దిరమొప్పగ్రామపెత్తన
మరయవహిల్లంగ బ్రోచెనతినెయ్యమునన్ ౩౨

తే.గీ భావయాఖ్యుండు మిగుల సంభ్రమపరుండు
కలితసుజ్ఞాన వంతుడుకలుష హరుడు
బమరచారిత్రు డార్యసంపత్కరుండు
మాననీయుడు రాజసన్మానయుతుడు ౩౩

10




ఆ.వె సీత యాఖ్యయుండు బ్రీతివిఖ్యాతిచే
ఖచితహర్మ్యగేహ నిచయములను
చిత్రముగను నంతచేయించి వేడ్కచే
బరమహర్షుడగుచు ప్రబలుచుండె ౩౪

కం ధరలింగాఖ్యుడు ధర్మము
సరసమతిన్ పాలనంబు సల్పుచును వెసన్
గురుభక్తిని వ్రతమేర్పడ
గరుణాన్వితలోలుడగుచు ఘనతరమతినిన్ ౩౫

కం వారిలొనర సభిధానున
కారయతనయులును లేక నటలింగాఖ్యకు
మారుని మూలాహ్వయుగొనె
భూరిశుభావహుని దత్తపుత్రునిగాగన్ ౩౬

కం చతురుడు మూలాహ్వయునకు
నతిసుగుణుడు వేంకటప్పయాఖ్యయుడమరున్
సతతము భగవధ్యానము
లతులితముగ జేయు సుతుడునంత జనించెన్ ౩౭

సీ భావయాఖ్యునకంత బరమసంతసమున
సుతపంచకంబును సొరదిగల్గె
శీతాభిధాను సత్ప్రీతి బుచ్చాహ్వయు
డగుజగ్గయాఖ్యయుడమరుసంగ
యాహ్వయుడలరు పట్టాభిధానత నెన్న
నందగ్రజుడు శీతయాహ్వయునకు
సుతులు లేకున్నంత గతులికపుత్రస్య
గతినాస్తియని తనమతినిదెలసి

తే.గీ ప్రాభవముగాను వేడ్క జగ్గభిదాన
వరుని తనయుని సకలసద్వైభవమున
ఘనతమీరంగ తగుదత్త తనయునిగను
శ్రేయముగగాంచె శ్రీసుబ్బరాయవరుని ౩౮


11



కం హెచ్చగు భగవత్పూజల
బుచ్చాహ్వయుకిరువురొప్పె పుత్రులు జగతిన్
అచ్చుగ గోపాలాఖ్యుడు
గ్రచ్చర శ్రీరామ కృష్ణఘనవరులెలమిన్ ౩౯

కం సంగాంహ్వయునకు జగతిన
భంగవరుల్ నాత్మజులును పరమప్రీతిన్
రంగుగ గల్గిరి నలుగురు
మంగళకరుల వనిబరగె మహితనిరూఢిన్ ౪౦

తే.గీ గరిమ వేంకట కృష్ణాఖ్య ఘనుడుపిదప
బరగు శివలింగయాఖ్యసంపద్గుణుండు
సూరనారాయుడార యధిరవరుడు
భావయాహ్వయుడౌనన బ్రమదమునను ౪౧

కం వేంకట కృష్ణాహ్వయునకు
పొంకముగ సుతద్వయంబు బొల్పువహిల్లన్
వేంకట్రామాఖ్యయుసం
గాఖ్యయులన నొప్పెమిగుల నవనీస్తలిపై ౪౨

కం ధరపట్టా హ్వయునకువెస
నరయగనైద్గురును మించెనతిశయవరుసన్
గురుభక్తులు కులభూషణు
లరిసూదనవరులు దారులార్య విధేయుల్ ౪౩

ఆ.వె భావయాఖ్యయుండు బరగు ముకుందరా
యాహ్వరామస్వామి యెసగు వేంక
టప్పయాఖ్యసాంబ యాఖ్యులనగమించె
విపులధర్మపరులు విమలమతులు ౪౪


12


సీ ఖ్యాతిమీరినయట్టి సీతయాహ్వయునికి
నరయసంతతిలేక నతిముదమున
కరమొప్ప భావాఖ్యుకడుతృతీయ సుపుత్రు
జగ్గయాహ్వయుని హ్రుత్సరసమంద
శుభలగ్నమందున సొంపుగాగొనితెచ్చి
దత్తుగాబెనుచుచు దనరెమిగుల
జగ్గయాఖ్యునకంత జనియించి రబ్జజు
హరిహరాదులమాడ్కి గరిమసుతులు

తే.గీ మానితముగాను నరసాభిధానరసిక
వరునిశ్రీసుబ్బరాయసద్వంశ మణిని
సరసనైపుణముల రామస్వామియనగ
వెలసె సుజ్ఞానవంతులై వినుతిమీర ౪౫

కం నాసిగలింగాఖ్యునికిని
ధీసద్గుణులిరువురెలమి దెరమొప్పంగన్
భాసితుడగు మూలాఖ్యుడు
భాసురమతిసంగయాఖ్య భవ్యుండెలమిన్ ౪౬

గోపాలరావు గారి వంశము

కం గోపాలాఖ్యునికినిదగ
ప్రాపుగ కన్యాద్వయంబు బ్రభవించిరిలం
నాపుణ్యవతులు చెలగిరి
సాఫల్య తరంగమాంబజనుకప్పాంబల్ ౫౭

సీ అందునగ్రజరంగమాంబ యందున సుతుల్
నిరువురలోపల నెసగెవహిని
పరగెనుమిగుల జంపాలను వేంకట
గోపాలరాయతనేపుమీర
రహికొత్తగోపాల రాయునికినిదగ
దౌహిత్రబాధ్యతనదనరెమిగుల
యిలను శ్రీహరిహరాదుల సమబుద్ధిచే
సతతంబు మతిభక్తి వితతులందు

తే.గీ మాన్యచారిత్రుడై యొప్పెమహితసద్గు
ణాదులను వేడ్కమీరనామోదమునను
నర్ధిజనకల్పకుండిత డౌరయనగ
సాంద్రకీర్తుల వెలసెను సరణిగాను ౪౮

13


సీ సంగమేశ్వరుని హృత్సరసీజముననిల్పి
గరిమసన్నుతిజేయు కమ్మవారు
సంగమేశ్వరునిమేల్ సత్పూజ నిరతంబు
కడుముదమునగాంచు కమ్మవారు
సంగమేశ్వరు సదాసధ్యానమనసుతో
ఘనపరార్ధతగాంచు కమ్మవారు
సంగమేశ్వరు కటాక్షమున మహానంద
కరవైభవముచేత కమ్మవారు

తే.గీ ఖలవిగతులార్య పాలకుల్ కమ్మవారు
కలితవర సద్గుణాంగకుల్ కమ్మవారు
క్రమతనౌదార్య రసికులు కమ్మవారు
కవిజనార్ధి సురద్రుముల్ కమ్మవారు ౪౯

14

పుట్టయ్య గారి వంశము

సీ అగ్రజుడగు పుట్టయాఖ్యయునకు సుతుల్
జ్యేష్టుండు సంగన్న జెలగె నవని
సుందయాఖ్యయుడన సురుచిరంబుగగల్గె
సంగయాహ్వయునకు సంతసమున
నుదయించెపుత్రుండు నొనరయప్పాహ్వయు
డతని జనియించె సుతులుముగ్గు
రందునగ్రజుడమరె నందంబుగాకోట
యాఖ్యుండు లింగాఖ్యుడలరెపిదప

తే.గీ సొంపుమీరగ వేంకట సుబ్బయాఖ్యు
డంతసుందాహ్వయునకు ప్రశాంతుడనగ
కోటయాఖ్యుండుజనియించె నాటముగను
పరమధర్మాత్ములీశ్వర ప్రార్ధనముల ౫౦

సుబ్బన్నగారి వంశము

తే.గీ భువినియప్పన్న రెండవ పుత్రుడైన
సుబ్బయాఖ్యునికంతట సురుచిరముగ
సుతులుముగ్గురు నుదయించె సొంపుగాను
రహినిజగ్గాఖ్య కిచ్చాఖ్యరామవరులు ౫౧

తే.గీ అగ్రజుడు జగ్గయాఖ్యునకమరె మిగుల
సంతతంబున పుత్రుండు సరసుడనగ
బరమహర్షాత్ముడౌలక్ష్మి నరసయాఖ్యు
డవనిశ్రేయోభివృద్ధిగా సవినయమున ౫౨

సీ యేమహనియ్యుని బ్రేమాతిశయమున
భూసురప్రకరంబు వాశిగాంచె
యేవీరవరుపెరభూవలయంబున
భూదాన శాస నామోదమయ్యె
యేమాన్యసుచరిత్రుకోమలమృదువాక్య
పద్ధతిధర్మంబు పరిఢవించె
యేకీతిన్ సాంద్రుని ప్రాకటమహిమల
దివిరియానందాబ్ధిదేలుచుండు

తే.గీ అతడునిరతాన్న విధఘనత్యాగనీతి
హర్ష ములచేత యైశ్వర్యహర్షుడగుచు
వెలశెకడువేడ్కశుభముల జెఱగుచుండె
సౌఖ్యయుతుడౌర శ్రీకిచ్చయాఖ్యవరుడు ౫౩

15

తే.గీ కిచ్చయాఖ్యునిపుత్రులు హెచ్చుగాను
నలుగురుదయించె వారిలో నగ్రజుండు
రహిని సుబ్బాఖ్య వెంకటరాయమణియు
హర్షమున జగ్గయాఖ్యుండు హనుమయాఖ్యు
డనగపొగడొందె కీతున్ లనతిశయమున ౫౪

తే.గీ సుబ్బయాఖ్యునికిరువురు సుతులుగల్గె
రహినియప్పాఖ్య వెంకటరత్నయాఖ్యు
లగ్రజుడు యప్పయాఖ్యున కమరెసుతులు
నిరువురెలమిని ధరణిపైగురుతరమున ౫౫

తే.గీ ఘనుడు వేంకటరత్నాఖ్యతనయవరులు
నిర్మలాత్ములు రసికులు ధర్మవరులు
యార్యపూజితులతి శౌర్యధుర్యులగుచు
ముఖ్యముగ బుచ్చయాఖ్య సుబ్బాఖ్యులమరె ౫౬

తే.గీ దనరువేంకటరాయుని తనయవరులు
నలుగురేర్పడె ముదముచే సలలితముగ
నరసయాఖ్యుడు రామాఖ్యుడరివిజితులు
నవనిక్రిష్టాఖ్యయుడు సంగయాఖ్యయుండు ౫౭

తే.గీ క్రిష్టయాఖ్యున కేర్పడ స్పష్టముగను
సురుచిరంబుగ వేంకటసుబ్బయాఖ్యు
డమరె గాంభీర్య విపులవిఖ్యాతిమీర
సంతసంబున శివపదస్వాంతుడగుచు ౫౮

16

తే.గీ గంహ్వరంబున జగతి జగ్గాహ్వయునకు
పరమపావన సద్ధర్మపరిఢవమున
ధాత్రిపొగడొందె వరుససుతత్రయమును
మోదమలరారకీర్తుల నాదరమున ౫౯

తే.గీహనుమయాఖ్యుని తనయులునమరనల్గు
రరయనగ్రజుడనగను నతిశయిల్లె
లలితగుణముల సీతరామాఖ్యలక్ష్మి
యాఖ్యవేంకటరమణ సంగాఖ్యులనగ ౬౦

అయ్యన్నగారి వంశము

సీ యేఘనాంగుని శుభదాఘనస్ఫూతిన్ చే
పుడమికల్పకవిధస్ఫూతిన్ గల్గె
యేదయాగుణుని సమ్మోదావలోకన
పుడమిసరస్వతీ స్ఫూతిన్ గల్గె
యేధర్మనిరతుని సాధువాదములచే
పుడమి బ్రంహ్మ న్భవస్ఫూతిన్ గల్గె
యేపరాక్రమగణ్యు నాపరాక్రమముచే
పుడమి హేమాద్రి విస్ఫూతిన్ గల్గె

తే.గీ ననఘుడౌదార్య విద్యవేదాంతధైర్య
వితతులను సాటిలేరనవిపులధర్మ
పాలనంబున జగతిపైప్రబలెనౌర
ముఖ్యముగ వేడ్కతానయ్యనాఘ్యుడనగ ౬౧

సీ భువినప్పయాఖ్యు మూడవపుత్రుడయ్యనా
హ్వయునకు సుతులొప్పునైదుగురును
అగ్రజుండనగను నలరెజానకిరామ
వరుడు కొండాఖ్యయుడరిజితుండు
పొంకంబుగా నొప్పు వెంకటాఖ్యుండన
సుగుణవంతుండైన సుబ్బయాఖ్యు
డలరుసంపదలచే శినాఖ్యుండు
జానకిరామ సుజ్ఞానవరుని

తే.గీ కరయపుత్రులుముగ్గురు నతిముదమున
వీరయాఖ్యుండువిపుల సద్విమలగుణుడు
గంహ్వరంబుగవెలశె శీతాంహ్వయుండు
లక్ష్మయాఖ్యుండు మహిని సలక్షణముగ ౬౨

17

తే.గీ వీరయాఖ్యయుడంతట విమలమతిని
లక్ష్మయాఖ్యతనూజుని లలితముగను
యుత్తమముమీరగొనెవేట్క దత్తుగాను
ముఖ్యమౌనట్టుగా రామయాఖ్యవరుని ౬౩

తే.గీ సీతయాంహ్వయునకు సుతుల్ క్షితినిలేక
లక్ష్మయాంహ్వయు పుత్రునిలలితముగను
సుబ్బయాఖ్యునిదత్తుగా సుఖముగాను
సుతునిగాదెచ్చి పెనచెను సురుచిరముగ ౬౪

కం ధరలక్ష్మయాఖ్యునకు వెస
గర మొప్పగ నల్గురొప్పె గడునెయ్యమునన్
గురుభక్తి మానసాత్ములు
ఖలవిగతులు సుగుణవరులు ఘనసంభ్రములన్ ౬౫

తే.గీ క్రిష్ణయాఖ్యుండు జగతిపైనిష్టపరుడు
సుబ్బయాఖ్యుండునాశ్రిత సుజనహితుడు
సరసనైపుణముల రామస్వామియనగ
అప్పయాంహ్వయుడెలమి దానొప్పెమిగుల ౬౬

కం కొండాంహ్వయునకు పుత్రులు
భండన విక్రములు ధర్మపాలనులై భూ
మండలమున సత్కీర్తుడు
ఖండమతిన్ హనుమయాఖ్యఘనబుచ్చాఖ్యుల్ ౬౭

18

తే.గీ అగ్రజుడు హనుమయాఖ్యునకంతగల్గె
నమరనయ్యాంహ్వయుండన నప్పమాంబ
గర్భ శుక్తిమరత్నంబు ఘనతగాంచె
భువినిజంపాలవంశాబ్ధి పూర్ణచంద్రు
డై వెలింగెను వెంకాఖ్యుడతిశయమున ౬౮

తే.గీ వెంకయాఖ్యయుపుత్రులు విమలమతులు
సిరులచే హనుమయాఖ్యుండు శ్రీకరముగ
చన్నయాఖ్యుండు సంభ్రమసన్నుతుండు
రామయాఖ్యయులనగను రహిచెలంగె ౬౯

తే.గీ దనరు శ్రీరామవరుని సుతద్వయంబు
నగ్రజుడువెంకయాంహ్వయుడలరెమిగుల
సుగుణకరుడైన వేంకటసుబ్బయాఖ్యు
డనగసత్కీతిన్ సాంద్రులై జనములలర ౭౦

కం యిలసుబ్బాఖ్యునిసుతయగు
సలలితముగ సీతమాంబ సత్పుత్రుడుచె
న్నలరార దేవభక్తిని
కులశీలుడు రామచంద్రుడలరారెవెసన్ ౭౧

19

వెంకన్నగారి వంశము

సీ యవనిచేధర్మంబు లేర్పడజగతిపై
క్రమముగా నాల్గుపాదముల బరగె
యవనిచేనద్భుతంబెసగంగ సత్యత
రహిని గ్రామాధికారము వహించె
యవనిచేగ్రంధాదులేర్పడ లిఖితముల్
వెసబఠించుటకునై వెలసెమిగుల
యవనిచేభూదాన మవనిననేకముల్
భూసురాదులకు నేర్పుగనుగల్గె

తే.గీ నతడుమతిమంతు డతిశాంతుడనఘవంతు
డాశ్రితస్వాంతుడౌదార్యుడమిత ధైర్యు
డాదియౌసద్గుణాదుల నమరెభువిని
మన్ననవహిల్ల వెలశెవెంకన్నగారు ౭౨

తే.గీ వెంకయాంహ్వయునకు సుతుల్ పొంకముగను
నల్వురుదయించె వేట్కచే సలలితముగ
ప్రబలతర సద్గుణాంగులై బరగెనౌర
హరపరాయత్త చిత్తత నతిశయిల్లు ౭౩

తే.గీ పుడమిరఘయాఖ్యు డనగను బొలుపుమీర
చలమయాఖ్యుండు ననఘుండు సలలితుండు
ఆశయాఘ్యుండు మహిమలనాశిగాంచె
సౌఖ్యుడైదాను శివలింగయాఖ్యుడొప్పె ౭౪

కం వారలుసంతతనిర్మలు
లారయగురుభక్తి మానసాత్ములువరుసన్
ధీరతరసత్యవాక్యులు
భూరిశుభావహులు హర్షమోదకు లెలమిన్ ౭౫

తే.గీ దనరరఘయాఖ్యునకు సుతుండనగనొప్పె
పొందుగను వెంకయాఖ్యుండునందముగను
నంతనాయనకును సుతుల్ సంతసమున
ముగ్గురుదయించెకీతున్ ల ముదము మీర ౭౬

20

తే.గీ యెనగె వెంకట క్రిష్ణాఖ్యుడసదృశుండు
ధీరితరనైపుణములచే సారసముగ
విపులసంభ్రమపరతను వెలసె మిగుల
మహితఘనముల నలరాల మహిని రహిని ౭౭

తే.గీ నమరుస గాంహ్వయుడు మహానందపరుడు
ప్రబలతరకీర్తనీయుండు పరమగుణుడు
కలుషదూరుండు నాశ్రితకల్పకుండు
సవినయుండన వెలసెదాభువినిమిగుల ౭౮

ఆ.వె పారుమార్ధికుండు పరమసుజ్ఞానుండు
కలిత సద్గుణాంగకరుడు మహిని
చతురవాక్యయుండు సద్ధర్మశీలుండు
రఘయనామకుండు నఘహరుండు ౭౯

తే.గీ అలరుచలమాఖ్యయునిసుతుల్ నైదుగురును
సొంపుగను వెంకయాఖ్యుండు సూరయాఖ్య
రామయాఖ్యయులనగను శ్రీశివాఖ్య
క్రిష్ణయాఖ్యయులీశ్వరనైష్టికులును ౮౦

తే.గీ అగ్రజుడు వెంకయాఖ్యుని కంతసుతులు
గల్గకున్నంత దత్తునిగానుదలచి
రామయాఖ్యునిపుత్రునిరహిజెలంగ
మూలయాంహ్వయుబెనచెను ముదముమీర ౮౧

కం ధరరామాఖ్యుడుధర్మము
సరసమతిన్ పాలనంబుసల్పుచునుయిలన్
దిరమొప్పనిరతమేర్పడ
గురుపూజాధుర్యుడగుచు కొమరారెవడిన్ ౮౨

కం వరరామాఖ్యునితనయులు
నిరువురునగ్రజుడనంగ నేర్పరియగుచున్
సరసుడగు యప్పయాఖ్యుడు
గరుణామతిమూలయాఖ్యఘనులంతవెసన్ ౮౩

21


పంతమునసంగయాఖ్యయు
డెంతో మోదంబుమీర నెసగెనుధరపై ౮౪

తే.గీ ఆశయాంహ్వయునకు సుతుల్ వాశిగాను
సాటికారనజనియించె కోటయాఖ్య
సంగయాఖ్యుండు భక్త ప్రసంగ మతులు
వైభవంబున నెసగిరివరుసగాను ౮౫

కం శివలింగాఖ్యయునకు వెస
బ్రవిమలతసుతుండుగల్గె బ్రేమలరంగా
భువికోటాఖ్యుండనగను
నవిరళమతిమూలయాఖ్యు డతనికిగల్గెన్ ౮౬

సూరన్న గారి వంశము

కం గరమొప్ప యప్పయాఖ్యున
కరయగపుత్రులును రవవారల్
గురుభక్తుడుసూరన్నకు
సరసుడు శివయాఖ్యుడొప్పె సంతసమందన్ ౮౭

తే.గీ సొరదిశివయాఖ్యుడేర్పడె సుతులునల్గు
రందునగ్రజుడలరె నింపొందగాను
సత్యవాక్యుండు సజ్జనసమ్మతుండు
గురుతరానందు డైశ్వర్యకరుడనంగ ౮౮

తే.గీమంగళప్రదుడగునట్టి లింగయాఖ్య
క్రిష్టయాఖ్యయుడన బహునైష్టికుండు
సోముడై కడుప్రబలె శ్రీరామయాఖ్యు
డెలమివెంకాఖ్యులేర్పడెయిలను రహిని ౮౯

22





తే.గీ రాజయాఖ్యయుతనయులు తేజముగను
ముగ్గురేర్పడగలిగిరి మోదమలర
ఘనతమీరంగ కీతున్ లగాంచిమహిని
బరగెసుగుణాతిశయముల బ్రౌఢిమీర ౯౭

తే.గీ కీతున్ లనునగ్రజుండొప్పె క్రిష్టయాఖ్య
రామలింగాంహ్వయుడును విరాజితముగ
కోటయాఖ్యుండు వరసగాగొనబుమీర
యీశ్వరధ్యానపరులయ్యు నెసగిరెలమి ౯౮

తే.గీ క్రిష్టయాఖ్యుని పుత్రులు స్పష్టముగను
ముగ్గురలరారె నాత్మనుమోదమంద
ఘనునయారామలింగాఖ్య ఘనునకంత
ధాత్రిపొగడొందె వెసను సుతద్వయంబు ౯౯

తే.గీ సుబ్బయాఖ్యుండు వివిధ సంస్తుతయశుండు
రాజయాఖ్యుండు సద్వాక్యరాజితుండు
సంబ్రమంబులబ్రబలిరి సరసముగను
సుతులునిద్దరు కోటాఖ్యయుతునకెలమి ౧౦౦

శ్రీ గురుస్తుతి

సీ వసుధలో గుదిమెండ్ల వంశాబ్ధిసోముడై
బరగురంగాచార్యప్రాభవుండు
వారికినాత్మజుండారయ వేట్కచే
సరసుడావేంకటాచార్యులనగ
తే.గీ గ్రామసద్గుణములను సుశీలుడగుచు
గౌరవంబునభరిత నిష్కాముడగుచు
బరమ వేదాంత తాత్పర్యప్రౌఢుడగుచు
సరసశారద వరలబ్ధసహితుడగుచు ౧౦౧

తే.గీ అట్టిగురువర్యవరులను నమరవేట్క
భువిని సంగమ చామర్లపురిని వెలయు
కమ్మవారలు హృత్పద్మకమలములను
దలచిసతతంబు గొలుతురు జెలగినటుల ౧౦

కం విమలముగా వంశాను
క్రమణికమను వర్ణణంబు కడువేడ్కవహిం
ప్రమదమున సంగమేశుని
కమర సమర్పించె మిగుల నలరంగ వెసన్ ౧౦౩

కం ఆశుకవిత్వము జెప్పితి
వాశిగకవివర్యులెల్ల వహినేర్పడగన్
ధీసమబుద్ధిని తప్పులు
భాసిల్లగ దిద్దరయ్య పండితులారా ౧౦౪

కం క్షమవడ్డమాని వేంకట
రమణాఖ్య కవీంద్రవరుడు రంజిల జేసెన్
క్రమమొప్ప వినిన చదివిన
సమలతసంతాన నాయురారోగ్యములన్ ౧౦౫

సీ.విభుధేంద్రసేవ్యమై * వెలయు క్రౌంచనగంబు
        సలలిత వేంకటాచలముగాగ
నాశ్వజశుద్ధ మ*హానవమ్యాగతుల్
        బ్రహ్మోత్సవాగత*ప్రజలుగాగ
బారమార్ధిక హోమ* పాత్రోన్నభోక్తంబు
        తనర దీర్ధప్రసాదంబుగాగ
శ్రుతగజస్యందనా*రూఢోత్సవోన్నతుల్
        దివ్యరధోత్సవ*స్థితులుగాగ

గీ.విశ్వ సర్వంసహాస్థలా*విర్భవంబు
తిరుపతిస్థల మమరావ*తీస్థలంబు
వన్నెజెలువొంద విలసిల్లె*వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రనామ పృ౮ధ్వీవరుండ!           8
  
సీ.ఏరాజు వాకిట * నేప్రొద్దు గృష్ణాన
          దీదివ్యతిలకంబు*తిరుగిచుండు
నేరాజు హృదయమం*దింద్రప్రతిష్ఠితుం
        డమరేశ్వరేశ్వరుం*డమరితుండు
నేరాజు కెదుటగా* నీప్సితార్ధము లీయ
        వైకుంఠపురిశౌరి* వరుసనుండు
నేరాజు నెడబాయ* కేవేళ గేళికై
       రాజ్యలక్ష్మియు హృష్టి౮గ్రాలుచుండు
  
గీ.నట్టిరాజును వినుతింప*వలవియగునె?
రాజమాత్రుం డటం చన*రాదుగాని
వేంకటాద్రీంద్రు డనుచును*వినుతిసేయ
వలయు శ్రీవాసిరెడ్డి స*త్కులజమణిని.          9
  
సీ."సర్వబుధ శ్రేణి* సంతరింప దలంచి
         గగనావతీర్ణమౌ* కల్పకంబు"
"కల్పకం బదికాదు* కవిచేతనావళి
         బ్రేమతో బ్రోవ గా*న్పించు ఘనుడు"
"ఘనుడు గా డితడు స*జ్జన చకోరావళి
         గరుణింప వచ్చు రా*కావిధుండు"
"విధుడు గా డితడు కో*విదజనాధారుడై
         సిరు లీయవచ్చు ని*క్షేపమూర్తి"

గీ.యనగ విలసిల్లితౌర! జ*గ్గావనీంద్ర
లక్ష్మమాంబాతనూజ! స*ద్రాజతేజ!
వాసిరెడ్డన్వవాయ స*ద్వార్ధిచంద్ర!
ధీరగుణసాంద్ర! వేంకటా*ద్రిక్షితీంద్ర!         10
  
సీ.ధరణి నేవిభు డద్య*తన భోజరాజంచు
         విద్వద్గణంబుచే* వినుతి గాంచె
నెఱయ నే ఘనుడు దా*నంతన రాధేయు
          డని రాజసభల బ్రఖ్యాతి గాంచె
నేనృపుం డైదంయు*గీ యార్జునుండని
      శూరులచేత బ్ర*స్తుతి వహించె
నేమహాప్రభువర్యు * డిల నధునాతన
     రుక్మాంగదుండని* రూఢిమించె
  
గీ.నఖిలవిద్యా పరిశ్రమా*ద్యంత దాన
శౌర్య హరివాసరవ్రత * చర్యలందు
నట్టి శ్రీవాసిరెడ్డి వం*శాబ్ధిపూర్ణ
చంద్రుడగు వెంకటాద్రి ధా*త్రీంద్రు డలరు.    11
  
సీ.సురసరిద్ధరణ  రు*గ్ద్విరదభిద్ధరకు భృ
       ద్దర శర చ్చరదర * స్ఫురితకీర్తి
హరిసఖస్వరు హరి*ద్ధరికరోద్ధుర భయం
       కర శరోత్కరముఖ*క్షరద రాతి
సురభి కిన్నరకులే*శ్వరసుత స్మరమరు
       ద్వర జనుస్సురుచి సుందరతనుండు
తరణి భూశరద ని*ర్జర కురుట్సురగవీ
    హర సఖామరమణీ* వరవితీర్ణి


గీ.నృపతిమాత్రుండె యాశ్రిత*నివహ పద్మ
భానుడై భూరి ధీరతా*సూనరత్న
సానుడగు వాసిరెడ్డి వం*శ ప్రసిద్ధ
వేంకటాద్రిప్రభుండు ర*విప్రభుండు.          12

సీ.భములతో సురపాద*పములతో గంగోద
         కములతో నీహార*కములతోడ
హేతితో నమరేంద్ర* వీతితో నైలింప
         భూతితో పరమేష్ఠి* సూతితోడ
నవ్వుతో విరమల్లె * పువ్వుతో జేజేల
        బువ్వతో బలుకుల* యవ్వతోడ
శూలితో గూఢపా* త్పాలితో మౌక్తిక
        పాళితో సారంగ* పాళితోడ

గీ.మొల్లమున నల్లిబిల్లియై * యెల్లజగము
నల్లుకొని నీ యశోవల్లి * యుల్లసిల్లు
శ్రీవిభాసిత జగ్గభూ*భృత్తనూజ
వేంకటాద్రీంద్ర నృపచంద్ర! * విజయసాంద్ర!        13
సీ.లోకప్రసిద్ధ  వ*ల్లుట్లనామకగోత్ర
         పద్మపంకేరుహ * బాంద్గవుండు
వాసిరెడ్డ్యాఖ్యాన్వవాయ పారావార
         శారద రాకాని*శాకరుండు
రణరంగఫల్గున*రాజ జగన్నాధ
         భూజాని సింహత*నూజవిభుడు
లక్ష్మీసతీతుల్య * లక్ష్మీసతీగర్భ
          శుక్తికానర్ఘోరు*మౌక్తికంబు

గీ. కొండవీ డాది వినుకొండ*కొండపల్లి
బందరు నిజాముపట్టణ *ప్రముఖ రాజ్య
విభుడు జగదేకవీరుడు * వేంకటాద్రి
నాయడు బహద్దరు ధనాధి*నాయకుండు.       14 
సీ. ధాత్రీసురప్రీతి * ధనతులాభారంబు
          దూగ నేభూతి* తూగగలడు?
నవరత్న కీలిత * నవ్యద్కిరీటంబు
          మించి యేరాజు ధ౮రించగలడు?
పదినూర్లశిరముల * ఫణిరాజుపై శౌరి
          లీల నేపతి పవ్వళింపగలడు?
చతురిభరాజిత * స్యందనారూధత
           జక్కగా నిక నేరు * సల్పగలరు?

గీ. అతడు రాజశిఖామణి * ధృతిసురాద్రి
కనుకనే తత్ప్రకార ప్ర*కాశుడగుచు
వసుధ బెంపొందె నౌరౌర * వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రు డతుల పృధ్వీవరుండు.                15
  నీనప్రతిమానమూర్తినని వ*క్కాణింతు నిన్ధాత్రి గీ ర్వాణస్తోమములెన్నబ్రత్యహము సా*లగ్రామగోదానభూ
దానాన్న ప్రతిపాదనార్ధులిడి శీ*తక్షోణిభృత్సేతు మ
ధ్యానూనాంబుధిమేఖలాస్థలి సమా*ఖ్యంజెందితీవేగదా
భూనాధావళి, వేంకటాద్రినృపతీ! పూర్ణప్రభావాక్పతీ!          16

మ. వరహాల్కాసులభంగి సేవలు కం*బళ్ళట్ల రూపాయలు
న్మఱిగవ్వల్బలెగంకణంబులు తృణప్రాయంబుగానిచ్చిబం
గరుపళ్ళెంబుల బాయసాన్నమును ల*క్షబ్రాహ్మణాపోశనం
బరలేకిత్తువు వాసిరెడ్డి కులదీ*పా! వేంకటాద్రీశ్వరా!      17
    శా. ఏరీ నీవలెగీర్తిగాంచిన ధరి*త్రీశు ల్జమీందార్ల గా శీ రామేశ్వరమధ్యభూమిని నర*శ్రేణి న్విచారింపగా
సారాచారత గాంచిరో ప్రజల కి*ష్టాన్నంబు బెట్టించిరో?
ధీరాగ్రేసర! వేంకటాద్రినృపతీ! దేవేంద్రభాగ్యోన్నతీ!      18

ఉ. అర్ధికి నీవొసంగిన పదార్ధ*ము భోజన వస్త్ర ధర్మ కా
మ్యార్ధములౌ త్వదన్యవసు*ధాధిపులిచ్చు పదార్ధముల్నిశా
తీర్ధ మరీచి కామ్లరస* దివ్యసుఖాదులునౌనొ? కావొ?
త్పార్ధివ! వేంకటాద్రివసుధాపతి! నూతనమన్మధాకృతీ!     19
 
. గుణనిధి! వేంకటాద్రినృప*కుంజర!వైభవధీ! భవత్సుధీ
జనకరవంశ జాతముల * శత్రుమదేభనికాయ సద్వధూ
గణనయనాండజాతముల * గారణజన్ముడ నౌటచేత గం
కణములునిల్వగా నొకట * గల్పనజేసితి వెంతచిత్రమో?             20

 
క. అమరావతి యమరావతి
యమరగ నింద్రుడు వేంకటాద్రీంద్రుండే
యమరులు గోత్రామరులే
కమనీయము నందనంబు * ఘననందనమే.                        21
    మ. మురుగుల్ గొల్సులు చంద్రహారములు స*మ్మోదోక్తి
నిద్దంపుటుంగరముల్ పోగులు పల్లకీలు హయసం*ఘం బగ్ర
హారంబుల్ మెఱయంజాలిననేలుపుల్ ధనము నె*మ్మిన్
వేంకటాద్రీంద్రుచే దరచున్ గొన్న బహుస్థితుల్ గలిగి వి
ద్వాంసుల్ సుఖం బందరే?                                                  22
    శా. తేజఃకాంతి వితీర్ణిభోగకరుణా * ధీసారతన్ బద్మినీ
రాజున్ రాజును రాజరాజు సుమనో*రాజున్ నదీరాజు వా
గ్రాజున్ బర్వతరాజు మీరితివి నీ*కాసాటి భూరాజులో
రాజశ్రీయుత వాసిరెడ్డి కులచం*ద్రా! వేంకటాద్రీశ్వరా!                23
  మ. సురభూమీరుహపంచకంబున, రమా*సూనుండు నొక్కొ
క్క శాఖ రహిన్ గైకొని వాసిరెడ్డికులరా * కాచంద్రుడౌ
వేంకటాద్రిరసాధీశుని పంచశాఖముగ గూ*ర్చెన్నేడు
మాకున్మహేశ్వరపూజాతిశయంబటంచుసురభూ*జంబుల్
ముదంబండెడిన్.                                                            24
    క. ఇలగల నృపతులు నీతో
దులదూగకయున్న నీవు * తులదూగితివౌ
బళి బళి బంగారముతో
బలసాంద్రా! వేంకటాద్రి * పార్ధివచంద్రా!                                 25
   గీ. వైభవోపేంద్రుడైనట్టి * వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రు డొకపెండ్లి * వేళయందు
చిన్నదొరలకు నత్తరు * కొన్న కర్చు
పృధ్విగల రాచవారికి * బెండ్లికర్చు.                                      26
 
  క. వెన్నెలవలె గప్పురపుం
దిన్నెలవలె నీదుకీర్తి* దిగ్దేశములం
దౌన్నత్యంబున వెలసెను
విన్నావా? వాసిరెడ్డి * వేంకటనృపతీ!                                      27
    చ. హితమతి వేంకటాద్రి విభు*డేలెడు నయ్యమరావతీపురిన్
గ్రతుభుజులన్నవస్త్రములు * గాంచరొకప్పుడు బూర్వదేవతా
హితమతి; వేంకటాద్రి నృపు*డేలెడు నీయమరావతీపురిన్
సతత సమస్తవర్ణులును * జక్కగ గాంచుదురన్న వస్త్రముల్       28
    మ. సుమబాణాకృతి! వేంకటాద్రినృపతీ! *శుంభత్ప్రతాపాఢ్య!నీ
యమరావత్వమరేశ్వరోన్నత సువ*ర్ణాంచన్మణీగోపురో
ద్గమమెన్నన్ద్విజరాట్శశశ ప్రధమదృక్ప్రా*ప్త స్థితింగాంచికా
ర్యముకాదంచును నిల్చెగాక గగనం*బంతంతకున్మించదే?              29
    మ. క్షయసంవత్సర మాఘశుద్ధ శుభచం*చద్వాదశీ జీవవా
రయుతశ్రేష్ఠ పునర్వసు ప్రఝష స*ద్రాశిం దులాభారమే
నయశీలుం డమరావతీపురములో*నన్దూగి నానార్ధిసం
చయహర్షాప్తి ధనంబొసంగె గవులెం*చన్వేంకటాద్రీంద్రు రీ
తియనంగాదగి వాసిరెడ్డి కులము*న్దేజంబు జెన్నొందగన్.              30
    ఉ.ఎన్ని వనంబు లెన్ని కృతు*లెన్ని సురార్చన లెన్ని దేవళా
లెన్ని సువర్ణ గోపురము*లెన్ని తటాకములెన్ని బావులె
న్నెన్నిపురంబులెన్ని కల*వెన్నిక ధర్మములెన్న ధాత్రిపై
బన్నిన వేంకటాద్రివిభు*పాటినృపాలుడు లేడు చూడగన్.            31
    క.శ్రీ వాసిరెడ్డి కులభవ
పావనుడై వేంకటాద్రి*పతి భాసిల్లెన్
గేవల వాగ్దీపశిఖా
వ్యావృత కలధౌత కుంభి*తాహిమకరుడై.                                32
    ఉ.తద్దియు వాసిరెడ్డి కుల*ధన్యుడు వేంకటనాయ డర్ధికిన్
గొద్దిగ నిచ్చెనేని నృప*కుంజరు కొక్కని పెండ్లికౌనహో
గద్దరి మేదినీశ్వరులు * కద్దని యిచ్చినయీవి పూటకుం
జద్దికి జాలదాయె నృప*సందడి దాతలనెన్న దోసమే?                 33
    క. భూపతిమతి జగతీ భృ
ధ్బూపతి శ్రీవేంకటాద్రి *భూపతి క్రౌంచ
ద్వీపాకృతి దగు శిఖర
స్థాపిత హరినీలఘటిత* తారాపధయై.                                34
    చ. కమలజుడుర్విపై గవుల* గాయకులన్సృజియించికల్పభూ
జమునుసృజింపనైతిని * చక్కగ జక్కని వాసిరెడ్డి జ
గ్గమహిమవేంకటాద్రినృపు * గారణజన్ముసృజించెగానిచో
నమితవిహాయితాత్మమతి*యైచెలువొందునె? చిత్రవైఖరిన్.        35
    శా. సద్వర్ణాంచిత హేమపాత్రతతితో * సత్రంబులోన న్విశి
ష్టాద్వైతప్రముఖద్విజావళికి మృ*ష్టాన్న ప్రదోక్తిన్వివే
కద్వైపాయను లిందువచ్చిరనగా * గాన్పించు తన్మధ్యతి
ష్ఠధ్వైచిత్ర్యగుణక్రమప్రతతి భా*స్వచ్చంద్రికాశోభక్రౌం
చద్వీపం బమరావతీపురము వీ*క్షాసక్తి జూడంగన్.              36
    సీ.  అంజనాచలమీన * గంజోద్భవాండంబు
           నిండారు రానడ*గొండలనగ
భానుబింబంబుపై * బగలు సాధింపగా
          గోరాడుచీకటి * గుంపులనగ
కవిదర్శనాపేక్ష * గదలివచ్చిన గజా
          సురగోత్ర దానవ * స్తోమమనగ
వింధ్యశైలస్థలి * వెడలి కృష్ణాస్నాన
          వాంచాగతేభరా*డ్వర్గమనగ
    గీ. వెలయు నమరావతీపురి * వేంకటాద్రి
విభుమనోభీష్టసంచార * వీధి దలచి
తీర్ధవాసంబు గావున * దిరుగులాడు
తత్పదావళి మత్త దం*తావళములు.                        37
    గీ. వైభవోద్దాము డైనట్టి * వాసిరెడ్డి
వేంకటాద్రీంద్రు డర్ధార్ధి * వితతి కొసగు
నొక్కపూటవ్యయంబు లీ*తక్కినట్టి
రాజకోటికి నొకయేటి * భోజనంబు.                         
    ఉ. అక్కడ వేంకటాద్రివిభు * నద్భుతచర్యలు సూచివచ్చి తా
నిక్కడ గూర్చె బండితుల * నిద్దరిలోపల వాసి రెడ్డి వా
రెక్కడ...................యుప్పలపాటి జోగిరా
జెక్కడ నక్కయెక్కడ న*దెక్కడ నిర్జరలోకమెక్కడో?                  38
      సీ. దీపాల మిసిదనల్ * దాపినబంగారు
              టోపీశిరంబందు * నేపుసూప
రంగైన నీసమస్త * రంగీజరీచెట్ల
        లుంగీ హోయల్ మీఱి * చెంగలింప
గుజరాతికెంపుల * కూర్పుతిన్ననయొప్పు
     పలువర్సపై నవ్వు * చెలువుదనర
మేచారమున బచ్చ * పోచీకరంబందు
   మేల్మిజీఱల ముద్దు * లల్ముకొనగ
    గీ. నరసి చిగురాకు దరవారు * వరువజీరు
.........................                                                  39
    క. జలజారికళలయందును
గలశాంబుధియందు బ*న్నగప్రభునందున్
నెలయై యలయై తలయై
యలరెన్ నీకీర్తి వేంక*టాద్రిమహేశా!                     40

ఇంకా ఉన్నాయి..త్వరలో..
------------------------------------------------------------------------

‘కొత్త’  వారి

    
వంశానుక్రమణిక చరిత్ర


కం|| శ్రీలలరసంగమేశ్వర
శైలేంద్రకుమారి హృదయజాలనచతురా
శూలధరలోకనాయక
పాలింపుము వృషభవాహప్రమదాధిపతీ|| ౧

ఉ|| శ్రీకరకొండవీటియను సీమధరన్ బరగెన్ మహోన్నతిన్
ప్రాకటమొప్పగాను మహిభాసిలు సంగమచామరల్ పురిన్
వీకమరంగ నందుతగ వేట్కలకెల్లను నాటపట్టుగన్
జోకుగ సంతతంబు కడుశోభితమై సరసాళిమెచ్చగన్|| ౨
 
సీ|| శిరులచేచామలన్ పురవరంబున నుత్త
రపుదిశవెలయు రమ్యముగను
ప్రాగ్భాగమున తుంగభద్ర మహానది
కడుపటమట కృష్ణ 

తే||గీ|| వెలశె కడునత్రిమునిచేత యిల బ్రతిష్ట
దక్షిణామూతిన్ యంత్రవిధానమునను
ధరనుచామలన్ పురజనవరులబ్రోవ
బ్రమదమలరార వరముల నమరనొసగ|| ౩

2

సీ|| సంగమేశ్వరు కటాక్షమున ధరాస్థలి
మహితవేట్కలను చామలన్ పురము
సంగమేశ్వరుకటాక్షమున మహానంద
మహిమచేనొప్పు చామర్లపురము
సంగమేశ్వరుకటాక్షమున సంపదలచే
మానుగా వెలసె చామర్లపురము
సంగమేశ్వరుకటాక్షమున శ్రీశుభముల
మరెవైభవమున చామరలపురము

తే.గీ|| దురితజాలములణచు చామరలపురము
బరగెసద్గుణములకు చామరలపురము
బరహితమునకాస్పదము చామరలపురము
గరుణ కామూలకమును చామరలపురము|| ౪

సీ|| కాంచనమణి చిత్ర ఖచిత హర్మ్యంబులు
వికసితరంగ వల్లికలుకలిగి
బహిద్వార బంధకవాటవర్గములచే
పచ్చలతోరణాలచ్చుపడగ
మహిదేవతా రామమందిరంబుల చేత
బహువస్తు సముదాయప్రభను వెలసి
కమలాదిలతల సంకలిత వారిజముల
విలసిల్లు మహిమలవివరముగను

తే.గీ|| ప్రాకటంబుగ విద్యలకాకరంబు
ప్రాపు బహువస్తుతతులకుదాపురంబు
వీకనఘములకెల్ల నిరాకరంబు
ఆపురంబున శ్రీసతికాపురంబు ౫

3

సీ|| కాలత్రయముల శంకరపదధ్యానుడౌ
కమలాసనుమహిమగరిమయెంత
ఏకవింశతిసాలున్ బోధకుండ వధియించు
జామదగ్ని ప్రతాపజాలమెంత
ధన వృధ్ధియందున ధాటిగల్గి వహించు
ఘనునికుబేరుని ధనమదెంత
ఏరువ్రయ్యలుచేసి ఎసగిప్రకాశించు
బలశాలి బలరాము బలిమియెంత

తే.గీ|| అలపితామహపరశురా మలకరాజ
శీరవరుల సుజ్ఞానవిశేషద్రవ్య
కృషివితతులం దగింపరుగొనబుమీర
సరసులప్పురి బ్రాహ్మణక్షత్రవరులు
వైశ్యజనములు శూరులు వరలు వీట|| ౬

తె.గీ|| అట్టిశూరులలో నలరాలుచుండు
ధర్మపరులయ్యు మిగుల సత్కరుణ గాంచి
వనరయీశ్వర పదభక్తవరులునగుచు
కలుములను యిల్లువెళ్ళని కమ్మవారు||

ఉ|| సమ్మతి మీర నెమ్మదిని సంతతమున్ భగవార్చనమ్ములన్
నిమ్ముగ భక్తినిల్పుకొని యేర్పడగొల్చుచు జ్ఞానవంతులై
నిమ్మహిమాన్యతన్ దగ నటింపుచు దాస్వకులోభితంబుగా
కమ్మకులంబునొప్పె శితికంఠవర ప్రదదత్తచిత్తులై||

సీ|| శ్రీమించుప్రాగ్దిశ భూమినివాసంబు
కొత్తకులాంబుధి కువలయేశు
డగు వేంకటాద్రి నుద్దండ విక్రమునమా
నిత రాజసన్మాన నీతములను
పొంది ఐశ్వర్య సంభోగాదులందుచు
నిరంతరంబుపురహరస్మరణుడగుచు
యుర్విని భూమిదేవోత్తములకు వేడ్క
వేడలేదనకిచ్చు వితరణుండు

తే.గీ|| నౌర యీతనిసాటి రార వనియందు
సత్యవాక్యుండు సరసుండు సద్గుణుండు
సంభ్రమస్వాంతుడాశ్రిత సదయకరుడు
సనగ వెలశెను మిగుల కొడాలిపురిని|| ౯
4

తే.గీ||మహిని సంపత్కరముల చే రహినిమీర
జోకుగాపాంన్కు నూళ్ళగోత్రీకుడగుచు
వెలశెవారల వంశంబు విదితముగను
మాన్యులై వేడ్క పిదపచామరలపురిని|| ౧౦

కం||ఆ వెంకటాద్రియొకనా
డీవిధముననుండి మిగుల నెసగెడుమదినిన్
దేవునిదలచుచు శయ్యను
భావించిబరుండ రాత్రిబ్రమదంబెసగన్ || ౧౧

చం|| బరమకృపావలోలుడయి భర్లుడుతావృషభేంద్రుపైనయా
గిరివరపుత్రుగూడుకొని కిన్నెరులెల్ల నుతింపుచుండనా
వరప్రమ దాదులేర్పడగ వైభవముప్పతిలంగ బ్రేమచే
గరుణవహిల్ల నాతనికి గన్పడె స్వప్నమునందు చెచ్చెరన్ || ౧౨

తే.గీ|| చూచిపులకాంకితుండు నై చోద్యమంది
యరసిసాష్టాంగ దండమర్పించి మిగుల
లేవకున్నంతభక్తుని లేవనెత్తి
యలమినిట్లని యానతినిచ్చె బ్రీతి|| ౧౩

కం|| ధరచామర్లను సత్పుర
వరమున శ్రీసంగమేశ వరనామమునన్
దిరముగ వెలశితి నీవును
గరమొప్పగ నందు జేరుగరిమవహిల్లన్|| ౧౪

5

కం|| అనియిట్లద్రుశ్యుడయినను
దనవారలకెల్ల నెరుగదయనింపారన్
వినుపించి వారియనుమతి
పనుపడ పరమేశుకృపను ప్రౌఢతనుండెన్|| ౧౫

తే.గీ|| వేంకడాద్రికి పుత్రుండు విమలమతియు
సరసుడౌదార్య వితరణసాహసుండు
పరగస్వగ్రామ పెత్తనపరిధవుండు
సూరయాఘ్యుండు నాశ్రితసుజనహితుడు|| ౧౬

కం|| శ్రీకర సుకుమారుండును
ప్రాకట మణిభూషణాది బహుళాంగధరుం
డౌకామితార్ధచిత్తుడు
సాకల్యసుభాతిశయుడు సచరితుడెలమిన్|| ౧౭

తే.గీ|| పన్నుగానొప్పుమిగుల సూరన్నగారి
కరయపుత్రులు నేడ్గురు నందముగను
నమరి సప్తమహషున్ లయట్ల బ్రబలి
కీర్తిలలరార దురితనివర్తు లగుచు|| ౧౮

సీ|| శ్రీలలరారగా గ్రాలువిఖ్యాతిచే
నొప్పునుమహిని నప్పన్నగారు
సతతంబు సద్ధర్మ సరణిచే పొగడొంద
పన్నుగా వెలసె శంభన్న గారు
గరుణాంతరంగ సంకలితుడై బ్రీతిచే
నెన్నగా రహిని కొండన్నగారుయెసగునౌదార్యాది రసికుడై జనులెల్ల
క్రన్నన పెద్ద వెంకన్నగారు

తే.గీ||చెన్నుమీరగ ఘనుడు ముత్తన్నగారు
సన్నుతులగాంచె జగతి సీతన్నగారు
చిన్నదనమున చిన్న వెంకన్న గారు
విశదమైనట్టి కీతున్ వెలశె మహిని|| ౧౯

6

సీ|| అగ్రజు డప్పన్న యవనీతలంబున
ధన్మాభివృద్ధిగాదనరె భువిని
నాశిగాచనుదెంచు భూసురోత్తములకు
నొసగెమాన్యాదుల నెసగుమతిని
ఆరామకూప మహత్వాది దేవతా
మందిరంబులను సమ్మతినెసంగ
జేయించి పరతత్వదాయియై సతతంబు
గ్రామాధికార సుధాముడగుచు

తే.గీ|| సంగమేశ్వర వరలబ్ధ సహితుడగుచు
చెలగి సద్గుణ సత్యసుశీలుడగుచు
మహిని స్వారాజ్య రాజసన్మాను డగుచు
వెలశె ధరణీతలంబున విమలుడగుచు|| ౨౦

సీ|| బహుపురాణ శ్రవణ పారీణ సంభ్రమ
స్వాంతానుభవుడు ప్రశాంత మూతిన్
సాధుగోష్ఠీవిలాసాదుల నిరతంబు
బ్రహ్మానుభవమున ప్రబలు మూతిన్
విశదంబుగా షోడశమహాదానాది
వితరణ కరుడు సద్విదితయశుడు
సత్యసదాచార సద్ధర్మ నిరతుండు
హృదయ రంజనుండు సదయకరుడు

తే.గీ|| ధరనుచెలగుచు నర్ధిమందారుడగుచు
స్వపురమునందున నధికారసరణిధర్మ
పద్ధతిని బ్రోచుచుండి విశుద్ధవంశ
వృద్ధినెసగగజేసె సమృద్ధిగాను|| ౨౧

7

సీ|| అంతనప్పన్నకు నతికౌతుకముమీర
పుత్రషట్కముగల్గె ముదముమీర
సరసుడౌదార్యాతిశయములవెలసెను
నెయ్యమొప్పగను పుట్టయ్యగారు
విపుల ధర్మాధర్మ వేదియై రహిమించు
చయ్యనఘనుడు సుబ్బయ్యగారు
విభనాదుల మరసద్వినుతిచే సత్కీతిన్
మన్ననగాంచె నయ్యన్న గారు
వినయవివేకుడై మనియె సంతతమును
పన్నుగా జగతి వెంకన్నగారు

తే.గీ|| క్రమత ధర్మార్ధ కామమోక్షములయందు
పిన్నపెత్తనములను సంగన్నగారు
విగత భవమాననీయుడై విశదముగను
సన్నతింపగ వెలశె సూరన్నగారు|| ౨౨

సీ|| హర్షిన్ తు డప్పన్న నయిదవపుత్రుండు
గరిమచేవెలశె సంగన్నగారు
విరివిగా వాశిరెడ్వేంకటాద్రీనాయు
డవని మల్రాజు గుండ్రావుగారు
వరలు మాణికరావు భావనారాయణ
రావు మానూరు నర్స్రావుగారు
మొదలు జమీన్ దార్ల ముందట కోటము
రాజు వెంకాఖ్యవిభ్రాజితుండు

తే.గీ|| రంజిలంగను మిగుల దినాంజిహోద
వసుధ చామలన్ పురము నివాసముగను
వెలసె గావునపయివారు జెలగునట్లు
సలుపుచుండెను సరఫరా సరసముగను|| ౨౩

8

తే.గీ|| ఆజమీదార్లననుమతి నతిముదమున
రహినిమాణిక్యరావు నారాయణుండు
స్పష్టముగ సంగయాఖ్యుని నిష్టకపుడు
మెచ్చి భూమిని కొంతదామిచ్చె బ్రీతి|| ౨౪

తే.గీ|| అవనికోటమురాజు కులాబ్ధిసోము
డయిన యావెంకుపంతుల నతిసహాయ
మమర శ్రీసంగమేశ్వరానుగ్రహమున
జగతి సత్కీతిన్ సాధించె సంతతంబు|| ౨౫

క|| శ్రీసంగమేశుకృపచే
భాసిల్లుచు ధర్మకర్త భారము గనితా
వాసిగ నౌకర్లకువెస
భూసురు లౌననగ నొసగె భువిమాన్యంబుల్|| ౨౬

తే.గీ|| యుర్విశ్రీ పన్కునూళ్ళ గోత్రోధ్భవశ్య
నలరుసంగన్న నామధేయస్యసహకు
టుంబఘనతర సపరివారంబుగాను
నెలమినీరీతి భూసురాదులు వచింప|| ౨౭

సీ|| బ్రత్యహంబునును మాపతినిహృత్పుండరీ
కమునందు నిల్పి నిక్కముగ మరియు
గోపురప్రాకార మేపారసత్ప్రద
క్షిణము సల్పుచును వేడ్కలను మిగుల
దగసంగమేశు సందర్శనంబును జేసి
బాడబవరులచే బ్రమదమునను
వనరంగమంత్రపుష్పాదికవిధులచే
యెసగుపూజలను జేయించిమిగుల

తే.గీ|| గృహమునందును నిరతంబు గొనబుమీర
యింద్రవైభవమున సత్యసంధుడగుచు
నతిధిభూసురవరుల సమ్మతులుగాను
జేశి మందారవిధమున వాసిగాంచె|| ౨౮

9

కం|| అతిముదము నిష్టవేల్పని
బ్రతివత్సరమునను వుతవాదివిధంబుల్
మితిలేక సల్పుచుండెను
చతురిండిత డౌరయనగ జగతిన్ వెలసెన్|| ౨౯

తే.గీ|| అంతసంగన్నగారికి సంతసమున
సుతులునల్వురు వరుసగా సుదతిమణియు
లలితసద్గుణ నికురంబలక్ష్మమాంబ
నొనరగానొప్పె యీశ్వరానుగ్రహమున|| ౩౦

కం||ఘనుడు నరసాభిదాహ్యయు
డనబరగిన భావయాఖ్యుడనగను పిదపన్
వినయుడగు సీత యాహ్వయు
డనధరలో లింగయాఖ్యుడనగా వెలసెన్|| ౩౧

కం||సరసుడు నరసాహ్వయుడిల
వరసద్గుణములను వంశవర్ధనుడగుచున్
దిరమొప్పగ్రామపెత్తన
మరయవహిల్లంగ బ్రోచెనతినెయ్యమునన్|| ౩౨

తే.గీ|| భావయాఖ్యుండు మిగుల సంభ్రమపరుండు
కలితసుజ్ఞాన వంతుడుకలుష హరుడు
బమరచారిత్రు డార్యసంపత్కరుండు
మాననీయుడు రాజసన్మానయుతుడు|| ౩౩

10


ఆ.వె|| సీత యాఖ్యయుండు బ్రీతివిఖ్యాతిచే
ఖచితహర్మ్యగేహ నిచయములను
చిత్రముగను నంతచేయించి వేడ్కచే
బరమహర్షుడగుచు ప్రబలుచుండె|| ౩౪

కం|| ధరలింగాఖ్యుడు ధర్మము
సరసమతిన్ పాలనంబు సల్పుచును వెసన్
గురుభక్తిని వ్రతమేర్పడ
గరుణాన్వితలోలుడగుచు ఘనతరమతినిన్|| ౩౫

కం|| వారిలొనర సభిధానున
కారయతనయులును లేక నటలింగాఖ్యకు
మారుని మూలాహ్వయుగొనె
భూరిశుభావహుని దత్తపుత్రునిగాగన్|| ౩౬

కం|| చతురుడు మూలాహ్వయునకు
నతిసుగుణుడు వేంకటప్పయాఖ్యయుడమరున్
సతతము భగవధ్యానము
లతులితముగ జేయు సుతుడునంత జనించెన్|| ౩౭

సీ|| భావయాఖ్యునకంత బరమసంతసమున
సుతపంచకంబును సొరదిగల్గె
శీతాభిధాను సత్ప్రీతి బుచ్చాహ్వయు
డగుజగ్గయాఖ్యయుడమరుసంగ
యాహ్వయుడలరు పట్టాభిధానత నెన్న
నందగ్రజుడు శీతయాహ్వయునకు
సుతులు లేకున్నంత గతులికపుత్రస్య
గతినాస్తియని తనమతినిదెలసి

తే.గీ|| ప్రాభవముగాను వేడ్క జగ్గభిదాన
వరుని తనయుని సకలసద్వైభవమున
ఘనతమీరంగ తగుదత్త తనయునిగను
శ్రేయముగగాంచె శ్రీసుబ్బరాయవరుని|| ౩౮

11

కం|| హెచ్చగు భగవత్పూజల
బుచ్చాహ్వయుకిరువురొప్పె పుత్రులు జగతిన్
అచ్చుగ గోపాలాఖ్యుడు
గ్రచ్చర శ్రీరామ కృష్ణఘనవరులెలమిన్|| ౩౯

కం|| సంగాంహ్వయునకు జగతిన
భంగవరుల్ నాత్మజులును పరమప్రీతిన్
రంగుగ గల్గిరి నలుగురు
మంగళకరుల వనిబరగె మహితనిరూఢిన్|| ౪౦

తే.గీ|| గరిమ వేంకట కృష్ణాఖ్య ఘనుడుపిదప
బరగు శివలింగయాఖ్యసంపద్గుణుండు
సూరనారాయుడార యధిరవరుడు
భావయాహ్వయుడౌనన బ్రమదమునను|| ౪౧

కం|| వేంకట కృష్ణాహ్వయునకు
పొంకముగ సుతద్వయంబు బొల్పువహిల్లన్
వేంకట్రామాఖ్యయుసం
గాఖ్యయులన నొప్పెమిగుల నవనీస్తలిపై|| ౪౨

కం|| ధరపట్టా హ్వయునకువెస
నరయగనైద్గురును మించెనతిశయవరుసన్
గురుభక్తులు కులభూషణు
లరిసూదనవరులు దారులార్య విధేయుల్|| ౪౩

ఆ.వె|| భావయాఖ్యయుండు బరగు ముకుందరా
యాహ్వరామస్వామి యెసగు వేంక
టప్పయాఖ్యసాంబ యాఖ్యులనగమించె
విపులధర్మపరులు విమలమతులు|| ౪౪

12

సీ|| ఖ్యాతిమీరినయట్టి సీతయాహ్వయునికి
నరయసంతతిలేక నతిముదమున
కరమొప్ప భావాఖ్యుకడుతృతీయ సుపుత్రు
జగ్గయాహ్వయుని హ్రుత్సరసమంద
శుభలగ్నమందున సొంపుగాగొనితెచ్చి
దత్తుగాబెనుచుచు దనరెమిగుల
జగ్గయాఖ్యునకంత జనియించి రబ్జజు
హరిహరాదులమాడ్కి గరిమసుతులు

తే.గీ|| మానితముగాను నరసాభిధానరసిక
వరునిశ్రీసుబ్బరాయసద్వంశ మణిని
సరసనైపుణముల రామస్వామియనగ
వెలసె సుజ్ఞానవంతులై వినుతిమీర|| ౪౫

కం|| నాసిగలింగాఖ్యునికిని
ధీసద్గుణులిరువురెలమి దెరమొప్పంగన్
భాసితుడగు మూలాఖ్యుడు
భాసురమతిసంగయాఖ్య భవ్యుండెలమిన్|| ౪౬

గోపాలరావు గారి వంశము

కం|| గోపాలాఖ్యునికినిదగ
ప్రాపుగ కన్యాద్వయంబు బ్రభవించిరిలం
నాపుణ్యవతులు చెలగిరి
సాఫల్య తరంగమాంబజనుకప్పాంబల్|| ౫౭

సీ|| అందునగ్రజరంగమాంబ యందున సుతుల్
నిరువురలోపల నెసగెవహిని
పరగెనుమిగుల జంపాలను వేంకట
గోపాలరాయతనేపుమీర
రహికొత్తగోపాల రాయునికినిదగ
దౌహిత్రబాధ్యతనదనరెమిగుల
యిలను శ్రీహరిహరాదుల సమబుద్ధిచే
సతతంబు మతిభక్తి వితతులందు

తే.గీ|| మాన్యచారిత్రుడై యొప్పెమహితసద్గు
ణాదులను వేడ్కమీరనామోదమునను
నర్ధిజనకల్పకుండిత డౌరయనగ
సాంద్రకీర్తుల వెలసెను సరణిగాను|| ౪౮

13

సీ|| సంగమేశ్వరుని హృత్సరసీజముననిల్పి
గరిమసన్నుతిజేయు కమ్మవారు
సంగమేశ్వరునిమేల్ సత్పూజ నిరతంబు
కడుముదమునగాంచు కమ్మవారు
సంగమేశ్వరు సదాసధ్యానమనసుతో
ఘనపరార్ధతగాంచు కమ్మవారు
సంగమేశ్వరు కటాక్షమున మహానంద
కరవైభవముచేత కమ్మవారు

తే.గీ|| ఖలవిగతులార్య పాలకుల్ కమ్మవారు
కలితవర సద్గుణాంగకుల్ కమ్మవారు
క్రమతనౌదార్య రసికులు కమ్మవారు
కవిజనార్ధి సురద్రుముల్ కమ్మవారు|| ౪౯

14

పుట్టయ్య గారి వంశము

సీ|| అగ్రజుడగు పుట్టయాఖ్యయునకు సుతుల్
జ్యేష్టుండు సంగన్న జెలగె నవని
సుందయాఖ్యయుడన సురుచిరంబుగగల్గె
సంగయాహ్వయునకు సంతసమున
నుదయించెపుత్రుండు నొనరయప్పాహ్వయు
డతని జనియించె సుతులుముగ్గు
రందునగ్రజుడమరె నందంబుగాకోట
యాఖ్యుండు లింగాఖ్యుడలరెపిదప

తే.గీ|| సొంపుమీరగ వేంకట సుబ్బయాఖ్యు
డంతసుందాహ్వయునకు ప్రశాంతుడనగ
కోటయాఖ్యుండుజనియించె నాటముగను
పరమధర్మాత్ములీశ్వర ప్రార్ధనముల|| ౫౦

సుబ్బన్నగారి వంశము

తే.గీ|| భువినియప్పన్న రెండవ పుత్రుడైన
సుబ్బయాఖ్యునికంతట సురుచిరముగ
సుతులుముగ్గురు నుదయించె సొంపుగాను
రహినిజగ్గాఖ్య కిచ్చాఖ్యరామవరులు|| ౫౧

తే.గీ|| అగ్రజుడు జగ్గయాఖ్యునకమరె మిగుల
సంతతంబున పుత్రుండు సరసుడనగ
బరమహర్షాత్ముడౌలక్ష్మి నరసయాఖ్యు
డవనిశ్రేయోభివృద్ధిగా సవినయమున|| ౫౨

సీ|| యేమహనియ్యుని బ్రేమాతిశయమున
భూసురప్రకరంబు వాశిగాంచె
యేవీరవరుపెరభూవలయంబున
భూదాన శాస నామోదమయ్యె
యేమాన్యసుచరిత్రుకోమలమృదువాక్య
పద్ధతిధర్మంబు పరిఢవించె
యేకీతిన్ సాంద్రుని ప్రాకటమహిమల
దివిరియానందాబ్ధిదేలుచుండు

తే.గీ|| అతడునిరతాన్న విధఘనత్యాగనీతి
హర్ష ములచేత యైశ్వర్యహర్షుడగుచు
వెలశెకడువేడ్కశుభముల జెఱగుచుండె
సౌఖ్యయుతుడౌర శ్రీకిచ్చయాఖ్యవరుడు|| ౫౩

15

తే.గీ|| కిచ్చయాఖ్యునిపుత్రులు హెచ్చుగాను
నలుగురుదయించె వారిలో నగ్రజుండు
రహిని సుబ్బాఖ్య వెంకటరాయమణియు
హర్షమున జగ్గయాఖ్యుండు హనుమయాఖ్యు
డనగపొగడొందె కీతున్ లనతిశయమున|| ౫౪

తే.గీ|| సుబ్బయాఖ్యునికిరువురు సుతులుగల్గె
రహినియప్పాఖ్య వెంకటరత్నయాఖ్యు
లగ్రజుడు యప్పయాఖ్యున కమరెసుతులు
నిరువురెలమిని ధరణిపైగురుతరమున|| ౫౫

తే.గీ|| ఘనుడు వేంకటరత్నాఖ్యతనయవరులు
నిర్మలాత్ములు రసికులు ధర్మవరులు
యార్యపూజితులతి శౌర్యధుర్యులగుచు
ముఖ్యముగ బుచ్చయాఖ్య సుబ్బాఖ్యులమరె|| ౫౬

తే.గీ|| దనరువేంకటరాయుని తనయవరులు
నలుగురేర్పడె ముదముచే సలలితముగ
నరసయాఖ్యుడు రామాఖ్యుడరివిజితులు
నవనిక్రిష్టాఖ్యయుడు సంగయాఖ్యయుండు|| ౫౭

తే.గీ|| క్రిష్టయాఖ్యున కేర్పడ స్పష్టముగను
సురుచిరంబుగ వేంకటసుబ్బయాఖ్యు
డమరె గాంభీర్య విపులవిఖ్యాతిమీర
సంతసంబున శివపదస్వాంతుడగుచు|| ౫౮

16

తే.గీ|| గంహ్వరంబున జగతి జగ్గాహ్వయునకు
పరమపావన సద్ధర్మపరిఢవమున
ధాత్రిపొగడొందె వరుససుతత్రయమును
మోదమలరారకీర్తుల నాదరమున|| ౫౯

తే.గీ||హనుమయాఖ్యుని తనయులునమరనల్గు
రరయనగ్రజుడనగను నతిశయిల్లె
లలితగుణముల సీతరామాఖ్యలక్ష్మి
యాఖ్యవేంకటరమణ సంగాఖ్యులనగ|| ౬౦

అయ్యన్నగారి వంశము
సీ|| యేఘనాంగుని శుభదాఘనస్ఫూతిన్ చే
పుడమికల్పకవిధస్ఫూతిన్ గల్గె
యేదయాగుణుని సమ్మోదావలోకన
పుడమిసరస్వతీ స్ఫూతిన్ గల్గె
యేధర్మనిరతుని సాధువాదములచే
పుడమి బ్రంహ్మ న్భవస్ఫూతిన్ గల్గె
యేపరాక్రమగణ్యు నాపరాక్రమముచే
పుడమి హేమాద్రి విస్ఫూతిన్ గల్గె

తే.గీ|| ననఘుడౌదార్య విద్యవేదాంతధైర్య
వితతులను సాటిలేరనవిపులధర్మ
పాలనంబున జగతిపైప్రబలెనౌర
ముఖ్యముగ వేడ్కతానయ్యనాఘ్యుడనగ|| ౬౧

సీ|| భువినప్పయాఖ్యు మూడవపుత్రుడయ్యనా
హ్వయునకు సుతులొప్పునైదుగురును
అగ్రజుండనగను నలరెజానకిరామ
వరుడు కొండాఖ్యయుడరిజితుండు
పొంకంబుగా నొప్పు వెంకటాఖ్యుండన
సుగుణవంతుండైన సుబ్బయాఖ్యు
డలరుసంపదలచే శినాఖ్యుండు
జానకిరామ సుజ్ఞానవరుని

తే.గీ|| కరయపుత్రులుముగ్గురు నతిముదమున
వీరయాఖ్యుండువిపుల సద్విమలగుణుడు
గంహ్వరంబుగవెలశె శీతాంహ్వయుండు
లక్ష్మయాఖ్యుండు మహిని సలక్షణముగ|| ౬౨

17

తే.గీ|| వీరయాఖ్యయుడంతట విమలమతిని
లక్ష్మయాఖ్యతనూజుని లలితముగను
యుత్తమముమీరగొనెవేట్క దత్తుగాను
ముఖ్యమౌనట్టుగా రామయాఖ్యవరుని|| ౬౩

తే.గీ|| సీతయాంహ్వయునకు సుతుల్ క్షితినిలేక
లక్ష్మయాంహ్వయు పుత్రునిలలితముగను
సుబ్బయాఖ్యునిదత్తుగా సుఖముగాను
సుతునిగాదెచ్చి పెనచెను సురుచిరముగ|| ౬౪

కం|| ధరలక్ష్మయాఖ్యునకు వెస
గర మొప్పగ నల్గురొప్పె గడునెయ్యమునన్
గురుభక్తి మానసాత్ములు
ఖలవిగతులు సుగుణవరులు ఘనసంభ్రములన్ || ౬౫

తే.గీ|| క్రిష్ణయాఖ్యుండు జగతిపైనిష్టపరుడు
సుబ్బయాఖ్యుండునాశ్రిత సుజనహితుడు
సరసనైపుణముల రామస్వామియనగ
అప్పయాంహ్వయుడెలమి దానొప్పెమిగుల|| ౬౬

కం|| కొండాంహ్వయునకు పుత్రులు
భండన విక్రములు ధర్మపాలనులై భూ
మండలమున సత్కీర్తుడు
ఖండమతిన్ హనుమయాఖ్యఘనబుచ్చాఖ్యుల్|| ౬౭

18

తే.గీ|| అగ్రజుడు హనుమయాఖ్యునకంతగల్గె
నమరనయ్యాంహ్వయుండన నప్పమాంబ
గర్భ శుక్తిమరత్నంబు ఘనతగాంచె
భువినిజంపాలవంశాబ్ధి పూర్ణచంద్రు
డై వెలింగెను వెంకాఖ్యుడతిశయమున|| ౬౮

తే.గీ|| వెంకయాఖ్యయుపుత్రులు విమలమతులు
సిరులచే హనుమయాఖ్యుండు శ్రీకరముగ
చన్నయాఖ్యుండు సంభ్రమసన్నుతుండు
రామయాఖ్యయులనగను రహిచెలంగె|| ౬౯

తే.గీ|| దనరు శ్రీరామవరుని సుతద్వయంబు
నగ్రజుడువెంకయాంహ్వయుడలరెమిగుల
సుగుణకరుడైన వేంకటసుబ్బయాఖ్యు
డనగసత్కీతిన్ సాంద్రులై జనములలర|| ౭౦

కం|| యిలసుబ్బాఖ్యునిసుతయగు
సలలితముగ సీతమాంబ సత్పుత్రుడుచె
న్నలరార దేవభక్తిని
కులశీలుడు రామచంద్రుడలరారెవెసన్|| ౭౧

19

వెంకన్నగారి వంశము

సీ|| యవనిచేధర్మంబు లేర్పడజగతిపై
క్రమముగా నాల్గుపాదముల బరగె
యవనిచేనద్భుతంబెసగంగ సత్యత
రహిని గ్రామాధికారము వహించె
యవనిచేగ్రంధాదులేర్పడ లిఖితముల్
వెసబఠించుటకునై వెలసెమిగుల
యవనిచేభూదాన మవనిననేకముల్
భూసురాదులకు నేర్పుగనుగల్గె

తే.గీ|| నతడుమతిమంతు డతిశాంతుడనఘవంతు
డాశ్రితస్వాంతుడౌదార్యుడమిత ధైర్యు
డాదియౌసద్గుణాదుల నమరెభువిని
మన్ననవహిల్ల వెలశెవెంకన్నగారు|| ౭౨

తే.గీ|| వెంకయాంహ్వయునకు సుతుల్ పొంకముగను
నల్వురుదయించె వేట్కచే సలలితముగ
ప్రబలతర సద్గుణాంగులై బరగెనౌర
హరపరాయత్త చిత్తత నతిశయిల్లు|| ౭౩

తే.గీ|| పుడమిరఘయాఖ్యు డనగను బొలుపుమీర
చలమయాఖ్యుండు ననఘుండు సలలితుండు
ఆశయాఘ్యుండు మహిమలనాశిగాంచె
సౌఖ్యుడైదాను శివలింగయాఖ్యుడొప్పె|| ౭౪

కం|| వారలుసంతతనిర్మలు
లారయగురుభక్తి మానసాత్ములువరుసన్
ధీరతరసత్యవాక్యులు
భూరిశుభావహులు హర్షమోదకు లెలమిన్|| ౭౫

తే.గీ|| దనరరఘయాఖ్యునకు సుతుండనగనొప్పె
పొందుగను వెంకయాఖ్యుండునందముగను
నంతనాయనకును సుతుల్ సంతసమున
ముగ్గురుదయించెకీతున్ ల ముదము మీర|| ౭౬

20

తే.గీ|| యెనగె వెంకట క్రిష్ణాఖ్యుడసదృశుండు
ధీరితరనైపుణములచే సారసముగ
విపులసంభ్రమపరతను వెలసె మిగుల
మహితఘనముల నలరాల మహిని రహిని|| ౭౭

తే.గీ|| నమరుస గాంహ్వయుడు మహానందపరుడు
ప్రబలతరకీర్తనీయుండు పరమగుణుడు
కలుషదూరుండు నాశ్రితకల్పకుండు
సవినయుండన వెలసెదాభువినిమిగుల|| ౭౮

ఆ.వె|| పారుమార్ధికుండు పరమసుజ్ఞానుండు
కలిత సద్గుణాంగకరుడు మహిని
చతురవాక్యయుండు సద్ధర్మశీలుండు
రఘయనామకుండు నఘహరుండు|| ౭౯

తే.గీ|| అలరుచలమాఖ్యయునిసుతుల్ నైదుగురును
సొంపుగను వెంకయాఖ్యుండు సూరయాఖ్య
రామయాఖ్యయులనగను శ్రీశివాఖ్య
క్రిష్ణయాఖ్యయులీశ్వరనైష్టికులును|| ౮౦

తే.గీ|| అగ్రజుడు వెంకయాఖ్యుని కంతసుతులు
గల్గకున్నంత దత్తునిగానుదలచి
రామయాఖ్యునిపుత్రునిరహిజెలంగ
మూలయాంహ్వయుబెనచెను ముదముమీర|| ౮౧

కం|| ధరరామాఖ్యుడుధర్మము
సరసమతిన్ పాలనంబుసల్పుచునుయిలన్
దిరమొప్పనిరతమేర్పడ
గురుపూజాధుర్యుడగుచు కొమరారెవడిన్|| ౮౨

కం|| వరరామాఖ్యునితనయులు
నిరువురునగ్రజుడనంగ నేర్పరియగుచున్
సరసుడగు యప్పయాఖ్యుడు
గరుణామతిమూలయాఖ్యఘనులంతవెసన్|| ౮౩

21
పంతమునసంగయాఖ్యయు
డెంతో మోదంబుమీర నెసగెనుధరపై|| ౮౪

తే.గీ|| ఆశయాంహ్వయునకు సుతుల్ వాశిగాను
సాటికారనజనియించె కోటయాఖ్య
సంగయాఖ్యుండు భక్త ప్రసంగ మతులు
వైభవంబున నెసగిరివరుసగాను|| ౮౫

కం|| శివలింగాఖ్యయునకు వెస
బ్రవిమలతసుతుండుగల్గె బ్రేమలరంగా
భువికోటాఖ్యుండనగను
నవిరళమతిమూలయాఖ్యు డతనికిగల్గెన్|| ౮౬

సూరన్న గారి వంశము

కం|| గరమొప్ప యప్పయాఖ్యున
కరయగపుత్రులును రవవారల్
గురుభక్తుడుసూరన్నకు
సరసుడు శివయాఖ్యుడొప్పె సంతసమందన్|| ౮౭

తే.గీ|| సొరదిశివయాఖ్యుడేర్పడె సుతులునల్గు
రందునగ్రజుడలరె నింపొందగాను
సత్యవాక్యుండు సజ్జనసమ్మతుండు
గురుతరానందు డైశ్వర్యకరుడనంగ|| ౮౮

తే.గీ||మంగళప్రదుడగునట్టి లింగయాఖ్య
క్రిష్టయాఖ్యయుడన బహునైష్టికుండు
సోముడై కడుప్రబలె శ్రీరామయాఖ్యు
డెలమివెంకాఖ్యులేర్పడెయిలను రహిని|| ౮౯

22
తే.గీ|| రాజయాఖ్యయుతనయులు తేజముగను
ముగ్గురేర్పడగలిగిరి మోదమలర
ఘనతమీరంగ కీతున్ లగాంచిమహిని
బరగెసుగుణాతిశయముల బ్రౌఢిమీర|| ౯౭

తే.గీ|| కీతున్ లనునగ్రజుండొప్పె క్రిష్టయాఖ్య
రామలింగాంహ్వయుడును విరాజితముగ
కోటయాఖ్యుండు వరసగాగొనబుమీర
యీశ్వరధ్యానపరులయ్యు నెసగిరెలమి|| ౯౮

తే.గీ|| క్రిష్టయాఖ్యుని పుత్రులు స్పష్టముగను
ముగ్గురలరారె నాత్మనుమోదమంద
ఘనునయారామలింగాఖ్య ఘనునకంత
ధాత్రిపొగడొందె వెసను సుతద్వయంబు|| ౯౯

తే.గీ|| సుబ్బయాఖ్యుండు వివిధ సంస్తుతయశుండు
రాజయాఖ్యుండు సద్వాక్యరాజితుండు
సంబ్రమంబులబ్రబలిరి సరసముగను
సుతులునిద్దరు కోటాఖ్యయుతునకెలమి|| ౧౦౦

శ్రీ గురుస్తుతి

సీ|| వసుధలో గుదిమెండ్ల వంశాబ్ధిసోముడై
బరగురంగాచార్యప్రాభవుండు
వారికినాత్మజుండారయ వేట్కచే
సరసుడావేంకటాచార్యులనగ||
తే.గీ|| గ్రామసద్గుణములను సుశీలుడగుచు
గౌరవంబునభరిత నిష్కాముడగుచు
బరమ వేదాంత తాత్పర్యప్రౌఢుడగుచు
సరసశారద వరలబ్ధసహితుడగుచు|| ౧౦౧

తే.గీ|| అట్టిగురువర్యవరులను నమరవేట్క
భువిని సంగమ చామర్లపురిని వెలయు
కమ్మవారలు హృత్పద్మకమలములను
దలచిసతతంబు గొలుతురు జెలగినటుల|| ౧౦౨

కం|| విమలముగా వంశాను
క్రమణికమను వర్ణణంబు కడువేడ్కవహిం
ప్రమదమున సంగమేశుని
కమర సమర్పించె మిగుల నలరంగ వెసన్|| ౧౦౩

కం|| ఆశుకవిత్వము జెప్పితి
వాశిగకవివర్యులెల్ల వహినేర్పడగన్
ధీసమబుద్ధిని తప్పులు
భాసిల్లగ దిద్దరయ్య పండితులారా|| ౧౦౪

కం|| క్షమవడ్డమాని వేంకట
రమణాఖ్య కవీంద్రవరుడు రంజిల జేసెన్
క్రమమొప్ప వినిన చదివిన
సమలతసంతాన నాయురారోగ్యములన్|| ౧౦౫

8 comments:

  1. Awesome content for ever and ever i hope you keep it up successfully this blog
    KAMMA'S MOST REPUTATED AND TRUSTED MATRIMONIAL PORTAL
    Kamma's Marriages is the solution for delivering reliable and quality match making services to all the briders and grooms seeing to enter into marital bliss.We arrange alliances through our extensive database to match your needs and tates. Since 1982, we have been very successful in providing alliances and settling marriages to thousands of our valued customers and commited to discover your better half!Kammakalyanam is a platform of bringing in the prospective brides and bridegrooms to the heaven of marriage with its extensive database across all economic strata.
    Website:https://kammakalyanam.com/
    Name:Kamma Kalyanam Matrimony
    Keywords:Kamma matrimony, Kamma marriage bureau, kamma brides, kamma grooms Matrimony, Wedding
    Address: MIG 165 SMR heights 5 th floor Opp to Holistic Hospitals, no 1, KPHB Road, Hyderabad, Telangana 500072
    EMAIL: INFO@TELUGUMARRIAGES.COM

    ReplyDelete
  2. We always enjoy your articles its inspired a lot by reading your articles day by day. So please accept my thanks and congrats for success of your latest series. We hope, you should published more better articles like ever before
    Old Age Homes In Hyderabad
    Retirement Homes In Hyderabad

    ReplyDelete

  3. Thank you so much @ admin for share your valuable thoughts and ideas We always enjoy your articles its inspired a lot by reading your articles day by day. So please accept my thanks and congrats for success of your latest series. We hope, you should published more better articles like ever before
    Sales CRM Company

    ReplyDelete
  4. AWSLix as AWS PHP Hosting Partner provides right solution for all the new generation web developers who look for scalable cloud hosting yet sophisticated. https://awslix.com/aws-php-hosting-partner/

    ReplyDelete
  5. Today, Emblix as one of the best and top most service-oriented Digital Marketing Agency in Hyderabad and India , Which provides high-quality result-oriented Digital Services ranging from SEO to Web Design, Social Media Marketing and more, to a broad spectrum of clients from diverse industry segments. Through a well-oiled combination of Quality Solutions, Transparent Pricing, helping brands connect with customers, Flexible Delivery & Contract Model with a firm commitment to deliver on time and to budget, Emblix has successfully built a strong relationship with clients based on mutual trust and respect. Further, Emblix’s extensive market experience and expertise in Digital Marketing helps clients in successfully managing data as a strategic asset.
    /Facebook marketing company in Hyderabad

    ReplyDelete
  6. Power BI is a collection of various tools and services, applications that collaborate to produce interactive visuals and business intelligence capabilities of data. It helps end-users very much. Learn Power BI in real-time with ITGuru.
    power bi course| ITGuru

    ReplyDelete
  7. Learn msbi online training from india's leading software training institute: Onlineitguru and get your dream job in your dream company. We provide Live Instructor-Led Online Classes with 100% job Assistance and 24 X 7 Online Support.

    msbi online course | msbi online training

    ReplyDelete
  8. Read your blog, it was amazing and great to hear from you.
    Buy liquor from Poly wines in Powai. Home delivery avaiable. No prepayment. To order call :9850998519 | 9809790790.

    Poly Wines
    Poly Wines Contact

    ReplyDelete