µ కల్లూరి చంద్రమౌళి
అప్పటికింకా స్వాతంత్య్రం రాలేదు.
టంగుటూరి ప్రకాశం మంత్రివర్గం రాజీనామా చేసిన తర్వాత (1947 మార్చి 23న) రామస్వామిరెడ్డియార్ మద్రాసు ప్రావిన్స్‌కి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకారశాఖ మంత్రిగా తొలిసారిగా బాధ్యత చేపట్టారు కల్లూరి చంద్రమౌళి. ఓ ఉదయం నందిగామ సందర్శనలో ఉన్నారు. పార్టీలోని ఇరువర్గాలు రెండు జగ్గుల నిండుకు కాఫీ తెచ్చారు. 'మా కాఫీ తాగాలంటే... మా కాఫీ తాగాలని పట్టుబట్టారు. ఇరువర్గాల మద్దతుదారుల అరుపులు ఎక్కువయ్యాయి. అప్పుడు సహకార మంత్రి తన సమీపంలో ఉన్న పోలీసు ఇన్‌స్పెక్టర్ని మరో జగ్గు తెమ్మన్నారు. అది వచ్చినవెంటనే ఇరువర్గాలు తెచ్చిన కాఫీని అందులో పోసి బాగా కలిపేశారు. అప్పుడు కప్పులో పోసుకొని ''ఇది ఎవరి కాఫీ'' అని ప్రశ్నించారు! ప్రజల కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. నింపాదిగా కాఫీ సేవించి తన ప్రసంగం ప్రారంభించారాయన!
కల్లూరి చంద్రమౌళి నిష్కళంక దేశభక్తులు. జాతీయవాది, పరిపాలనాదక్షులు. ధార్మిక సంపన్నులు. మానవతామూర్తి, బహుగ్రంథ రచయిత! ఆయన పుట్టుకతో సంపన్నుడైనా తన భూమిని స్వరాజ్యోద్యమానికి హారతికర్పూరం చేశారు. విదేశాల్లో చదువుకొని, ఉన్నతోద్యోగంలో చేరినా దాన్ని వదులుకొన్నారు. ఎన్నో సంవత్సరాలు జైలుజీవితం అనుభవించారు. గాంధీజీ ఆశయాలకు చివరిదాకా నిలిచారు. కొన్ని శతాబ్దాల క్రితం గోపన్న అనే రామదాసు నిర్మించిన భద్రాద్రి రామాలయానికి ఆగమశాస్త్రానుసారంగా మరమ్మతులు చేశారు. అలాగే ఎన్నో దేవాలయాలను పునర్నిర్మించారు. వరదలు, తుపానులు వచ్చినపుడు ప్రజలకాదుకున్నారు... చిరస్థాయిగా నిలిచే పనులు అనేకం చేశారు అందుకే ఆయన ఒక్క గుంటూరు జిల్లాకో, మరొక దానికో పరిమితంకాక రాష్ట్రం గర్వించదగిన ఉన్నతవ్యక్తి కాగలిగారు.
ఇరవయ్యో శతాబ్దం ప్రవేశించడానికి ముందు అంటే 1898 నవంబరు 15న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మోపర్రు గ్రామంలో కల్లూరి సుదర్శనం వెంకమాంబ దంపతులకు జన్మించిన మూడో సంతానం (రెండో కొడుకు) కల్లూరి చంద్రమౌళి. ఆయనకు తల్లి ఒడే తొలిబడి. ప్రాథమికవిద్య మోపర్రులోనే గడిచింది. కొన్నేళ్లు తురుమెళ్ల జార్జి కొర్నేషన్ స్కూల్లో చదివారు. అయితే ఆ చదువుకన్నా వేదాంతం రామాచార్యుల శిష్యరికంలో సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు చంద్రమౌళి. తెనాలి, గుంటూరుల్లో కొన్నేళ్లు చదివి ఎఫ్.ఎ. కోసం కలకత్తా వెళ్లారు. 1919లో ఆవుల పిచ్చయ్య కుమార్తె బుల్లెమాంబతో వివాహం జరిగింది. పెద్ద చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడే ఆయనకు ఎం.ఎన్.రాయ్ వంటివారితో పరిచయం కలిగింది. నాలుగేళ్లు విదేశాల్లో చదివి ''స్వరాజ్యం నా జన్మహక్కు'' అనే తిలక్ నినాదానికి అర్థం పరమార్థం తెలుసుకొని భారత్ తిరిగొచ్చారు కల్లూరి. అస్సాంలో టీకంపెనీలో ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది కానీ అప్పటికే స్వాతంత్య్రోద్యమ భావాలకు ఆకర్షితులై దేశం కోసం జరిగే పోరాటంలో తాను భాగం కావాలని ఆశించారు కల్లూరి. చిన్నతనంలోనే ఉత్తర భారతమంతా పర్యటించారు. స్వాతంత్య్రపోరాటాన్ని అవగతం చేసుకొన్నారు. మూడు నెలలు గాంధీజీ ఆశ్రమంలో గడిపి గాంధీజీకి సేవచేశారు. ఇక అక్కడినుంచి మోపర్రు చేరుకొన్నాక ఆయన స్వాతంత్య్ర ఉద్యమాలకే అంకితమయ్యారు. సైమన్ గోబ్యాక్ నినాదం అందుకున్నారు. గర్జించారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. 1929 మార్చిలో తెనాలిలో జరిగిన విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలో కీలకపాత్ర పోషించారు. అది జరిగిన నెలరోజులకు గాంధీజీ గుంటూరొస్తే ఆయన్ని తన స్వగ్రామానికి తీసుకెళ్లగలిగారు... శాసనోల్లంఘనం, ఉప్పు సత్యాగ్రహం ఇలా అన్ని ఉద్యమాలనునడిపారు. అందుకు బహుమానంగా జైలుశిక్షలు అనుభవించారు. 'కల్లుమానండని' ఎలుగెత్తి చాటారు. వివక్షను ప్రశ్నించారు. 1933 నుంచి 1962 వరకు గుంటూరు జిల్లా కాంగ్రెసుకు పెద్దదిక్కుగా ఆయనే ఉన్నారు. తొలిసారిగా రంగా ఎన్నిక కావడానికి తనవంతు కృషి చేశారు కల్లూరి. దేవరంపాడులో ఉప్పు సత్యాగ్రహ విజయస్తంభం నెలకొల్పారు. 1936లో నెహ్రూజీ గుంటూరు సందర్శించడానికి, ముఖ్యంగా తెనాలిలో ప్రసంగించడానికి కల్లూరి కారణం! 1940లో గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షుడయ్యారు. ఊరూరూ తిరిగి గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం కారణంగా రాయవెల్లూరులో రాజకీయ ఖైదీగా గడిపారు. 1945లో తెనాలి హిందీ ప్రేమీమండలికి అధ్యక్షుడయ్యారు. ఆతర్వాత భారత రాజ్యాంగసభ సభ్యుడిగా ఎన్నికై ఎంతో కృషి చేశారు. 1946లో రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. చంద్రమౌళి గెలిచారు. మద్రాసులో ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. అయితే దాదాపు పదకొండు నెలలు మాత్రమే ఆయన ప్రభుత్వం కొనసాగి ఆతర్వాత రామస్వామిరెడ్డియార్ ముఖ్యమంత్రి అయ్యారు. రెడ్డియార్ మంత్రివర్గంలో సహకారమంత్రిగా పదవి చేపట్టారు. 1949లో పూసపాటి కుమారరాజా మంత్రివర్గంలోనూ పనిచేశారు. తర్వాత 1955లో గోపాలరెడ్డి మంత్రివర్గంలో రెవిన్యూ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నపుడే భద్రాద్రిరామాలయం విస్తరణ జరిగింది. స్వాతంత్య్ర సమరయోధులకు భూములు పంచారు. నిజాంపట్నం ప్రాంతంలో, సెంట్రల్ డెల్టాలో లక్షల ఎకరాల భూమిని సాగులోకి తేవడంతో అందరూ అపర భగీరథుడని కొనియాడారు. సహకార రంగానికి ఎంతో సేవ చేశారు. తెనాలి కళాశాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కృష్ణా బ్యారేజ్ నిర్మాణానికి కల్లూరి విరివిగా విరాళాలు సేకరించి అందజేశారు. తిరుమల పండిత పరిషత్, అన్నవరం పండిత పరిషత్ వంటివి ఏర్పాటుచేశారు. అక్కడే 'ఆర్షవిద్యాలంకార' అన్న బిరుదునిచ్చారు. 1962లో భద్రాద్రిలో కళ్యాణమంటపం, ఆతర్వాత రామదాసు ధ్యానమందిరం నిర్మింపజేశారు. తెనాలి సహకార భూమి తనఖా బ్యాంక్ ఏర్పాటు చేయించారు. తిరుమలలో వాల్మీకి కుటీరం వంటివి నిర్మించారు. 1962లో కూడా వేమూరు వాల్మీకి కుటీరం వంటివి నిర్మించారు. 1962లో కూడా వేమూరు శాసనసభనుంచి ఎన్నికయ్యారు. అయితే 1965లో ఆయన తన శాసనసభ్యత్వానికి, తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలికీ, భద్రాచల రామాలయ జీర్ణోద్ధారణ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
రచయితగా ఆయన 1933లో రైతులకోసం 'రైతు-రాజ్యాంగం', 'నానాదేశ రాజ్యాంగములు' అనే పుస్తకాలు రాశారు. 1950లో ''భారతీయ ప్రతిభ'', '52లో 'రామాయణ సుధాలహరి', 62లో మతం- భౌతికశాస్త్రం, '64లో 'ఆండాళ్ వైభవం', పురుషార్థములు, '70లో యుగసమీక్ష, '71లో వేదసుధాకరం, '73లో ఉజ్వల తరంగిణి, '75లో భాగవతసుధ, '76లో రామకథానిధి, '77లో ఆర్షసంస్కృతి, '81లో సీతామహాసాధ్వి, వివేకానందస్వామి- వంటి గ్రంథాలు ప్రచురించారు. వాటితోపాటు వేదాలు, ఆచారాలు- ఆడంబరాలు, సన్యాసాశ్రమాలు మొదలైన ఎన్నో పుస్తకాలు రాశారు. 91వ ఏట కేంద్ర ప్రభుత్వం ''స్వాతంత్య్ర సైనిక్‌సమ్మాన్'' అవార్డుతో సత్కరించింది. 1992 జనవరి 21న ఆయన శాశ్వతంగా కన్నుమూశారు. ఆయన చివరిరోజుల్లో నివసించిన ప్రదేశంలో ప్రస్తుతం షిర్డిసాయిబాబా మందిరం నిర్మించడం విశేషం!
రచన --: -చీకోలు సుందరయ్య
కల్లూరి చంద్రమౌళి (1898 - 1992) స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. దేవాదాయ శాఖా మంత్రిగా పనిచేసిన చంద్రమౌళి కొంతకాలము తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
కల్లూరి చంద్రమౌళి గారు 1898 నవంబరు 15న గుంటూరు మండలములోని మోపర్రు గ్రామములో జన్మించారు. తల్లిదండ్రులు వెంకమాంబ, సుదర్శనం. 1920లో ఇంగ్లాండు వెళ్ళి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. స్కాట్లాండు విశ్వవిద్యాలయము నుండి విద్యనభ్యసించిన చంద్రమౌళి భారతదేశానికి తిరిగివచ్చి వ్యవసాయభివృద్ధికై కృషిచేశాడు. కాంగ్రేస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడైనాడు. బాల్యము నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఇష్టం. 1926లో ఉద్యోగాన్ని నిరాకరించి మహాత్మా గాంధీ నాయకత్వంలో అన్ని జాతీయోద్యమాలల్లో పాల్గొని అనేకసార్లు జైలు కెళ్ళారు. 1937, 1946, 1955 , 1962లలో శాసనసభకు ఎన్నికై మద్రాసు ప్రావిన్సు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రదేశ్ లలో మంత్రిగా పనిచేశారు. భారతరాజ్యాంగ సభ సభ్యులు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. శ్రీశైలం, భద్రాచలం దేవాలయాల జీర్ణోద్ధరణ గావించారు.
భద్రాచలం
చంద్రమౌళి గారి సేవలలో ముఖ్యమైనది భద్రాచలం గుడి పునర్నిర్మాణం. 1960 నాటికి గుడి బాగ శిధిలమైంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. వెంటనే గుడి పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. నాడు భద్రాచలం మారుమూల అటవీప్రాతం. యాత్రీకులకక్కడ ఏ సౌకర్యాలు లేవు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచార్యులు గణపతి స్థపతిని ఆహ్వానించారు. ముందుగా కల్యాణమండపం నిర్మించ తలపెట్టారు. సరైన రాయిని తమిళనాడులోని దిండివనంలో గుర్తించారు. కొత్తగూడెం వరకు రైళ్ళలో తెచ్చి అక్కడినుండి గోదావరి వరకు లారీలలో తరలించారు. పెద్ద పెద్ద రాతి శిలలను ఇసుకలో నెట్టుకు వచ్చి లాంచీలలో కెక్కించి అతికష్టంతో భద్రాచలం చేర్పించారు. చంద్రమౌళి నగర్లో 500 శిల్పులు 3 లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన కళ్యాణమండపం నిర్మించారు. రామాలయానికి దక్షిణాన ఉన్న రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం నిర్మించారు. శిల్పశోభాయమానమైన గోపురాలు నిర్మించారు. దీనిలో ఆరు అడుగుల పచ్చరాయి రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు. రామదాసు కీర్తనలు, భక్తి తరతరాలవారికి తెలియచేసే అపురూప నిర్మాణమిది. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. ఈ రాతిని సమీపములోని తాటియాకుల గూడెంలో సేకరించారు. మహామండపాన్ని అష్ఠలక్ష్ములు, దశావతారాలు, ఆళ్వారుల శిల్పాలతో అలంకరించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమానం ఏర్పాటుచేశారు. ఈ విమానం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది.1974లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా చంద్రమౌళిని రామాలయ ధర్మకర్తల సంఘానికి అధ్యక్షులుగా నియమించారు. వెంటనే విశేషంగా విరాళాలు సేకరించి చిత్రకూట మంటపాన్ని 127 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించారు. స్థంభాలపై అద్భుతమైన శిల్పలు చెక్కించారు. మంటపములో సంగీత సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తున్నారు.
ఈ విధంగా భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి చంద్రమౌళి గారు అపర రామదాసుగా కీర్తిగాంచారు.
తిరుపతిలో విశ్వ సంస్కృతసదస్సు నిర్వహించారు. స్వయంగా రామాయణసుధాలహరి, రామకధానిధి, సీతామహాసాధ్వి, వివేకానందస్వామి, యుగసమీక్ష, ఆండాళ్ వైభవం, వేదసుధాకరం, ఆర్షసంస్కృతి, భాగవతసుధ మున్నగు పుస్తకాలు రచించారు.
1992 జనవరి 2న చంద్రమౌళి గుంటూరులో పరమపదించారు. (వికీపీడియా నుండి..)
..................................................................
20.04.92 *t01
LOK SABHA DEBATES
MR. SPEAKER: Now, lot me make the Obituary Reference first. OBITUARY REFERENCE
11.01 hrs.
MR. SPEAKER: Hon. Members, I have to inform the House of the sad demise of one of our former colleagues, Shri Kalluri Chandramouli.
Shri Chandramouli was a Member of the Constituent Assembly reporesenting Madras Presidency during 1946-48. He had also been a Member of "The Legislative Assembly of composite State of Madras in 1937 and 1946.
Shri Chandramouli was a veteran freedom fighter. He actively participated in the Salt Satyagraha and Civil Disobedience Movement.
As an able administrator, he served the then State of Madras and also the State of Andhra Pradesh and as a Minister held several imporant portfolios.
Shri Chandramouli was an active worker.
Shri Kalluri Chandramouli passed away on 21st of January, 1992 in Guntur District of Andhra Pradesh at the age of 93 years.
We deeply mourn the loss of this friend. The House will join me in conveying our condolences to the bereaved family.
The Members may now stand in silence for a short while as a mark of respect to the -deceased.
The Members then stood in silence for a short while.
.............................................................................
శ్రీ కల్లూరిచంద్రమౌళి
గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక ప్రముఖ నివాస ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.
శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992) గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు.
కల్లూరి చంద్రమౌళి గారు 1898 నవంబరు 15న గుంటూరు జిల్లా అమృతలూరు మండలములోని మోపర్రు గ్రామములో జన్మించారు. తల్లిదండ్రులు వెంకమాంబ, సుదర్శనం. 1920లో ఇంగ్లాండు వెళ్ళి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. స్కాట్లాండు విశ్వవిద్యాలయము నుండి విద్యనభ్యసించిన చంద్రమౌళి భారతదేశానికి తిరిగివచ్చి వ్యవసాయభివృద్ధికై కృషిచేశాడు. కాంగ్రేస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడైనాడు. బాల్యము నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఇష్టం. 1926లో ఉద్యోగాన్ని నిరాకరించి మహాత్మా గాంధీ నాయకత్వంలో అన్ని జాతీయోద్యమాలల్లో పాల్గొని అనేకసార్లు జైలు కెళ్ళారు.
1937, 1946, 1955 , 1962లలో శాసనసభకు ఎన్నికై నారు. మద్రాసు ప్రావిన్సులో రామస్వామి రెడ్డియార్, కుమారస్వామి రాజ మంత్రి వర్గంలోనూ ,మద్రాసు నుండి విడిపోయిన తరువాత ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం లో బెజవాడ గోపాలా రెడ్డి మంత్రి వర్గం లోను, ఆతరువాత ఆంధ్ర ప్రదేశ్ లో సంజీవయ్య గారి మంత్రి వర్గం లో మంత్రిగా పనిచేశారు. భారతరాజ్యాంగ సభ సభ్యులు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. శ్రీశైలం, భద్రాచలం దేవాలయాల జీర్ణోద్ధరణ గావించారు. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి చంద్రమౌళి గారు అపర రామదాసుగా కీర్తిగాంచారు.
తిరుపతిలో విశ్వ సంస్కృతసదస్సు నిర్వహించారు. మంచి గ్రంధ రచియిత. ఆర్ష విద్యాలంకార అనే బిరుదాంకితుడు.రామాయణసుధాలహరి, రామకధానిధి, సీతామహాసాధ్వి, వివేకానందస్వామి, యుగసమీక్ష, ఆండాళ్ వైభవం, వేదసుధాకరం, ఆర్షసంస్కృతి, భాగవతసుధ మున్నగు పుస్తకాలు రచించారు
1992 జనవరి 21న చంద్రమౌళి తన స్వ గ్రామం మోపర్రులో పరమపదించారు.-
- kodali srinivas
No comments:
Post a Comment