Monday, April 4, 2011

ఆచార్య ఎన్.జి.రంగ


Prof. N. G. RANGA
From Wikipedia, the free encyclopedia

Gogineni Ranga nayukulu (Telugu: గోగినేని రంగ నాయకులు ) , better known as N. G. Ranga (Telugu: ఎన్. జీ. రంగా) (7 November 1900–9 June 1995), was an Indian freedom fighter, parliamentarian, and kisan (farmer) leader. He was an exponent of the peasant philosophy, and considered the father of the Indian Peasant Movement after Swami Sahajanand Saraswati.

Early life

Ranga was born in Nidubrolu village in Guntur District of Andhra Pradesh. He went to school in his native village, and graduated from the Andhra-Christian College, Guntur. He received a B.Litt. in Economics from the University of Oxford in 1926. On his return to India, he took up teaching as Professor of Economics at Pachaiyappa's College, Madras (Chennai).

Political career

Lok Sabha Period Constituency Party
2nd Lok Sabha 1957-1962 Tenali Congress Party
3rd Lok Sabha 1962-1967 Chittoor Swatantra Party
4th Lok Sabha 1967-1970 Srikakulam Swatantra Party
7th Lok Sabha 1980-1984 Guntur Congress (I)
8th Lok Sabha 1984-1989 Guntur Congress (I)
9th Lok Sabha 1989-1991 Guntur Congress (I)
Ranga joined the freedom movement inspired by Gandhi's clarion call in 1930. He led the ryot agitation in 1933. Three years later, he launched the Kisan Congress party. He held historic discussions with Gandhiji on the demand for a rythu-coolie state. He wrote a book, Bapu Blesses regarding his discussions with Gandhi..
Ranga was one of the founders of the International Federation of Agricultural Producers. He represented India at the Food and Agriculture Organisation (Copenhagen) in 1946, the International Labour Organisation (San Francisco) in 1948, the Commonwealth Parliamentary Conference (Ottawa) in 1952, the International Peasant Union (New York) in 1954 and the Asian Congress for World Government (Tokyo) in 1955.
He quit the Congress Party and founded the Bharat Krishikar Lok Party and the Swatantra Party, along with Rajaji who was a trenchant critic of the cooperative farming idea. Ranga became the founder-president of the Swatantra Party and held that post for a decade. In the general elections held in 1962, the party won 25 seats and emerged as a strong Opposition. He rejoined the Congress (I) in 1972.
Ranga served the Indian Parliament for six decades from 1930 to 1991.

Honours

  • A commemorative postage stamp was released by Government of India in 2001.

  • He was awarded Padma Vibhushan by the President of India in 1991.
  • ఆచార్య ఎన్.జి.రంగా :
  •  
ఆచార్య ఎన్.జి.రంగా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబర్ 7,1900 - జూన్ 9 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతిచ్చిన ఈయన్ను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.
రంగా, 1900, నవంబర్ 7న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.హేతువాది .

స్వాతంత్ర్యసమరంలో

1930లో మహాత్మా గాంధీ పిలుపుకు స్పందించి రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.
రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నెషనల్ పెజెంట్ యూనియన్లోనూ మరియు 1955లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.
ఈయన కాంగ్రేసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ, ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రేసు (ఐ)లో చేరాడు.

రాజకీయ జీవితము

లోక్ సభ పదవీకాలం నియోజకవర్గం పార్టీ
2వ లోక్ సభ 1957-1962 తెనాలి కాంగ్రేసు పార్టీ
3వ లోక్ సభ 1962-1967 చిత్తూరు స్వతంత్ర పార్టీ
4వ లోక్ సభ 1967-1970 శ్రీకాకుళం స్వతంత్ర పార్టీ
7వ లోక్ సభ 1980-1984 గుంటూరు కాంగ్రేస్ (ఐ)
8వ లోక్ సభ 1984-1989 గుంటూరు కాంగ్రేస్ (ఐ)
9వ లోక్ సభ 1989-1991 గుంటూరు కాంగ్రేస్ (ఐ)
రైతు బాంధవుడు రంగా
సుదీర్ఘ పార్లమెంటేరియన్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కిన ప్రొఫెసర్‌ ఎన్‌. జి.రంగా నేటి తరానికి సుపరిచితుడు కాదు. 1900లో పుట్టి 1995లో మరణించిన రంగా అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ 60 ఏళ్ళు రైతుల పక్షాన పోరాడిన నాయకుడు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో పుట్టి, ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశా రు. మద్రాసులోని పచ్చయప్పాస్‌ కళాశాలలో ఆర్థిక శాస్త్రాచార్యుడిగా చేరి నాలుగేళ్ళపాటు ఉన్నప్పుడు రంగాకు విద్యార్థిగా అన్నాదొరై (ఉత్తరోత్త రా తమిళనాడు ముఖ్యమంత్రి) ఉండేవారు.
1930లో కాంగ్రెస్‌లో చేరి జమీందారీ వ్యతిరేక పోరాటంలో రైతుల పక్షాననిలిచారు. 1935లో తొలిసారి కేంద్ర శాసనసభకు సభ్యుడై అప్పటి నుంచి మరణించే వరకు నిరంతరం పార్లమెంటేరియన్‌గానే కొనసాగారు. రంగా పార్లమెంటులో ఉంటే రైతులకు భద్రత ఉంటుందని పండి ట్‌ నెహ్రూ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర పోరాటంలో నిర్విరామంగా పాల్గొన్న రంగా అనేక పర్యాయాలు జైలుపాలయ్యారు. జైళ్ళలోకూడా రాజకీయ ఖైదీలకు పాఠశాలలు నిర్వహించారు. ఆయనకు పోటీగా కె.బి. కృష్ణ వంటి కమ్యూనిస్టులు రాజకీయ పాఠశాలలు నడిపారు.
ఆంధ్రలో తొలిసారి రాజకీయ పాఠశాలలను ప్రారంభించిన ఖ్యాతి రంగాదే. తొలి రాజకీయ పాఠశాలలో పుచ్చలపల్లి సుందరయ్యతో సహా కొందరు కమ్యూనిసులూ పాల్గొన్నారు. రంగా ఆంగ్లంలోను, తెలుగులోను మంచి రచయిత. 'హరిజన నాయకుడు' అనే నవల కూడా రాశారు. ఆంధ్ర రాజకీయాలలో గాంధీ అనుచరుడిగా పట్టాభి సీతారామయ్య ఉండ గా, రంగా గాంధీకి సన్నిహితుడు కాలేకపోయాడు. అయినప్పటికీ పార్టీ రీత్యా సిద్ధాంత పరంగా గాంధేయునిగానే కొనసాగాడు. సుభాస్‌చంద్రబోస్‌ అంటే ఇష్టపడేవారు.1938 నాటికే ఇందూలాల్‌ యాగ్నిక్‌తో కలిసి కిసాన్‌ సభలు నిర్వహించారు. ప్రకాశం పంతులుతో కలిసి ఆంధ్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించిన రంగాకు చాలా మంది శిష్యులు ఉండేవారు.
గౌతు లచ్చన్న, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, కందుల ఓబుల రెడ్డి, చేగిరెడ్డి బాలిరెడ్డి, ఎన్‌.వి. నాయుడు, నీరుకొండ రామారావు, బీశెట్టి అప్పారావు, పి.రాజగోపాలనాయుడు ఇత్యాదులు ఎందరో రంగా పిలుపునందుకొని రాజకీయాలలో ప్రవేశించారు. స్వాతంత్య్రానంతరం తొలి ఎన్నికలు వచ్చేనాటికి ముఠా తగాదాల కారణంగా రంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చి కృషీకార్‌ లోక్‌ పార్టీ స్థాపించారు. ఆ ఎన్నికలలో చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే కృషీకార్‌ లోక్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అందుకే నార్ల వెంకటేశ్వరరావు దానికి కొసల పార్టీ అని నామకరణం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి అనే వివాదం వచ్చినప్పుడు రంగా వర్గం తిరుపతిలో ఉండాలన్నారు.
కర్నూలు రాజధానిగా ఉన్న రోజుల్లో రంగా అనుచరులు లచ్చ న్న, కందుల ఓబులరెడ్డి, నీరుకొండ రామారావు మంత్రులయ్యారు. ప్రకాశం మంత్రి వర్గాన్ని పడగొట్టడంలో రంగా వర్గమే కీలక పాత్ర వహించింది. ప్రకాశం ప్రభుత్వ పతనం 1955లో ఉప ఎన్నికలకు దారి తీసింది. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారనే భయం పట్టుకున్నది. రంగా, ప్రకాశం, పివిజి రాజు కాంగ్రెస్‌తో కలిసి ఐక్య కాంగ్రెస్‌ ఏర్పరచి బరిలోకి దిగి కమ్యూనిస్టులను 15 సీట్లతో సరిపెట్టుకునేటట్లు ఓడించగలిగారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడేనాటికి రంగా కాంగ్రెస్‌ నుంచి చీలి బయటకు వచ్చారు. 1958 నాటికి కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయం బాగా పెంపొందింది.
నెహ్రూ నాయకత్వాన్ని, ఆయన ప్రతిపాదించిన సహకార వ్యవసాయాన్ని కాదని దేశ వ్యాప్తంగా స్వతంత్ర పార్టీ ఏర్పడింది. దానికి తొలి అధ్యక్షుడిగా ఆచార్య రంగా ఉన్నారు. రాజగోపాలాచారి, మినూ మసానీ, పీలూ మోడీ, రత్నస్వామి, బెజవా డ రామచంద్రారెడ్డి మొదలైనవారు ఎందరో చేతులు కలిపారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన పార్టీలో డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి కూడా తొలిదశలో ఉన్నారు. క్రమేణా స్వతంత్ర పార్టీ పలచబడుతుండగా రంగా దానికి దూరమౌ తూ వచ్చారు. ఆయన్ను బోల్షివిక్‌ అని రాజాజీ పిలిచారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వాన ఉన్న కాంగ్రెస్‌లో చేరి, రంగా తన జీవితాంతం అందులోనే ఉండిపోయారు. ఆచార్య రంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు.
1946లో కోపెన్‌ హేగన్‌లో జరిగిన వ్యవసాయ సమాఖ్యలో పాల్గొన్నారు. 1952లో కామన్వెల్త్‌ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొని అటావా నగరంలో ప్రసంగించారు. 1954లో న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ రైతు సమాఖ్యలో ప్రధానోపన్యాసం చేశా రు. 1955లో టోక్యోలో జరిగిన 'ఏషియన్‌ కాంగ్రెస్‌ ఫర్‌ వరల్డ్‌ గవర్నమెంట్‌' సభలో సుదీర్ఘోపన్యాసం చేశారు. రైతు సమస్యల్ని అంతర్జాతీయ సభ ల దృష్టికి తీసుకువచ్చారు. పొగాకు, పత్తి రైతుల, చేనేత కార్మికుల సమస్యలకు తన కాలాన్ని చాలా వినియోగించారు. ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ పుంఖా ను పుంఖంగా రచనలు చేశారు.
పత్రికలు స్థాపించారు. 1937 నుంచి వాహిని అనే పత్రికను నడిపారు. రంగా తన అనుచరులను గురించి, తనకు తెలిసిన రైతు ప్రముఖులను గురించి చక్కని పదచిత్రాలు రాశారు. వారిలో నాగినేని వెంక య్య, కల్లూరి వీరయ్య, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, ధనెంకుల నరసింహం, నన్నపనేని వెంకట సుబ్బ య్య, కావూరి వెంకయ్య ఇలా ఎందరో ఉన్నారు. కాకతీయ నాయకుల గురించి రాశారు. విప్లవోద్యమాలలో రైతులు నిర్వహించిన పాత్రను అధ్యయనం చేసి రివల్యూషనరీ పెజంట్స్‌, ది క్రెడో ఆఫ్‌ వరల్డ్‌ పెజంట్స్‌ అనే గ్రంథాలు రాశారు.
రంగా అటు ఆంగ్లంలోను, ఇటు తెలుగులోను అనర్గళం గా మాట్లాడేవారు. అతి సాధారణ అలవాట్లతో జీవితం గడిపారు. జాతీయ నాయకులలో అంబేద్కర్‌తో రంగా సన్నిహితం గా ఉండేవారు. రాజ్యాంగసభకు అంబేద్కర్‌ పేరును ప్రతిపాదించడంలో ఆయన కీలకపాత్ర వహించారు, ఆంధ్రలో సంస్కరణ వివాహాలను రంగా ప్రోత్సహించారు. ఆయ న పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సమ్మేళన్‌, మహిళా విభాగంలో ఎందరో శిక్షణ పొందారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో సహా బిఎస్‌ఆర్‌ కృష్ణ, ఎస్‌వి పంతులు వంటివారు వివిధ రంగాల్లో ఆరితేరారు.
పార్లమెంటులో కమ్యూనిస్టు నాయకుడు ప్రొఫెసర్‌ హీరేన్‌ ముఖర్జీతో రంగాకు మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. అంతర్జాతీయ రైతు నాయకులుగా పేరొందిన జార్జి డిమిట్రోవ్‌, పెరంక్‌ నాగీ, దీనా స్టాక్‌లు రంగాకు సన్నిహిత మిత్రులు. సుదీర్ఘ రాజకీ య జీవితంలో ఎలాంటి పదవులు లేకుండా ప్రతిష్ఠాత్మకమైన నీతివంతమైన రాజకీయాన్ని పాటించిన ఖ్యాతి ఆచార్య రంగాదే.




- ఎన్‌. ఇన్నయ్య(ఆంధ్రజ్యోతి - 7 నవంబర్ 2009 నుండి)







9th Lok Sabha
Members Bioprofile
RANGA, PROF. NAYAKULU G., B. Litt. (Oxon), D. Lit. (Andhra) [Congress (I)—Andhra Pradesh, Guntur, 1989]: s. of Nagayya; b. at Nidubrolu, Guntur District, A.P., November 7, 1900; ed. at St. Catherine College, Oxford, Barnet House, Oxford; m. Smt. Bharatidevi, 1920; Agriculturist, Teacher; participated in freedom struggle;
Previous Association with Political Parties: President, PCC, A.P. 1946—51, Member, CWC, 1947—51, Leader, Krishikar Lok Party, 1952—55; Leader, Swatantra Parliamentary Party, 1952—56; President, Swatantra Party, 1959—69; Member Cong (1), from 1972; Member, CWC(I), 1975-85, Special, Invitee, CWC (I), Dy. Leader, CPP (Id since 1980;

Previous Membership: Central Legislative Assembly, 1930, 1934—46; Constituent Assembly, 1946—50; Provisional Parliament, 1950-51; Second Lok Sabha, 1957—62; Third Lok Sabha, 1962—67; Fourth Lok Sabha, 1967—70; Seventh Lok Sabha, 1980—84; Eighth Lok Sabha 1984—89; Rajya Sabha, 1952—;56 and 1977—79;

Committee Experience: Member, Estimates Committee, 1950—51, Consultative Committees, Planning, Ministry of External Affairs and Labour; Chairman, Public Accounts Committee, 1958-59; Member, Consultative Committee, Ministry of External Affairs, 1990;

Favourite Pastime and Recreation: Reading and writing;

Publications: 65 Books in English, including 'Credo of World Peasants'; 'Agony and Solace'—2 Vols; 'Distinguished Acquaintances'—2vols. 1976; "Colonial and Coloured Peoples' Freedom Front," 1957; 'Fight for Freedom' (Autobiography)—1967; 'Gandhian Plan'; 'History of Kisan Movement'; 'Revolutionary Peasant'—1954; 'Bapu Blesses" (containing the discussions and talks with Mahatma Gandhi), 1969; Quintessence of Non-alignment Movement, 1983; India in the U.N. Rangass participation, 1983; Protection of the self-employed Peasants and Tribes, 1984; Tribes of Nilgiris, Self-Employment Sector 1959 and 15 books in Telugu including Smrities of Bharati Devi, 1973, and Modern Political Institutions 2 vols. 1933 and Harijans Nayak 1934; "Aerial-eye View" of USSR and Yugoslavia, 1956 published by Parliament;

Travels Abroad: UK, USA, USSR, Yugoslavia, France, Italy, Bulgaria, Burma, Japan, Malaysia, Canada, Australia, Sudan, Egypt;

Special Interests: Promotion of Panchayat System, rural artisanship especially crafts and handicrafts and cooperative marketing societies, overall rural life;

Accomplishment in Letters, Literature, Art and Science: Recipient of Nehru Award for Literacy Campaign, Rajaji Ratna Award and Kushak Ratna Award;

Social Activities: Welfare of peasants, weavers and Khet mazdoors; a crusader against socio-economic disparities, works for such rural development measures like sanitation, electricity, communication, adult education and crop and cattle Insurance Scheme;

Other Information: Professor, Economics and Politics, Pachayappa College, Madras, 1927—30.
Hony. Economic Advisor to Government of Madras, 1929-30; Founding Member of All India Kisan Congress and Handloom Congress; Founder President of Foreign Affairs Association of India; Principal of Indian Presants Institute (Nidubrolu); hailed as the Doyen of Indian Cooperative Movement; Founder Chairman of Freedom Fighters Cultural Centre, Neb Sarai, New Delhi; Senior among the Presidium of Freedom Fighters Association; Executive Member of the Gandhi Smirti Darshan Committee, New Delhi; took part in Gandhi Centenary Celebrations in UNESCO (Paris); unveiled double statue of Gandhi and Patel in Ahmedabad in 1985 and led Patels' Celebrations in New York and Ottawa in 1987; Indian Parliamentary Group claimed entry of his name in Guinnes Book of World Records 1991 on account of being the Oldest Parliamentarian in the world and among the first three with the longest Parliamentary Career; Indian parliamentarians feliciated him on completion of 50 years of his Parliamentary career and on completion of 60 years of his first speech in Central Legislative Assembly; receipient of Padma Vibhushan, 1991;

Permanent Address: P.O. Nidubrolu, Guntur, Dist., Andhra Pradesh.


రంగాజీ
‘షష్ట్యబ్ది జయంతి’


 
రచన : కళాప్రపూర్ణ, పండిత కొత్త సత్యనారాయణ చౌదరి
ఒకసారి లోక్ సభలో హాజరయి ప్రేక్షకశ్రేణిలో గూరుచుండి చూడవలసిన వినోదములు చూసి ఈవలకు వచ్చితిని. ‘శాసనసభా- హక్కుల సంఘము’ ముందు  విచారణకు వచ్చునేమో అన్న సందేహముతో అనరాదు గాని హరిహరీ! అంతగా మనమెన్నుకొని పంపిన పెద్దలు అంతదూరాననుండి యావద్భారతమునకే తలమానికమైన ఆ శాసనసభలో ఏమేమి చేయుచున్నారో స్వయముగా చూచినగాని బోధపడదు. క్లాసులో తప్పనిసరిగా హాజరయి, వినవలసినవన్నియు శ్రద్ధగా విని, అడుగ వలసిన ముక్కలు చక్కగా అడుగనేర్చిన చురుకైన విద్యార్ధులవోలె అంతలావు మహాసభలో అదేపనిగా మునిగిపోయిన సభ్యులు - అన్ని వందలలో నాకు లెక్కకు చేతివ్రేళ్ళకే సరిపోయిరి. వారిలో ఒకరు మన ఆచార్య రంగా.
ఎన్నేండ్లనుండియో ఢిల్లీ శాసనసభా ప్రాంగణములో కావలిగా నిలిచియున్న చిన్న యుద్యోగులిర్వురకు - ఒకనాడు ఈ సంభాషణ జరిగెనట.
‘ చూడవయ్యా అటుచూడు! ఆ ధోవతి - ఆ చొక్కాతో - ఆ బక్కచిక్కిన సన్నకారు పెద్దమనిషి, ఈసభలో రాని సంవత్సరమే లేదే! హాజరుకాని సమయమేలేదే! అట్టేవచ్చి ఇట్టేమెరసి మంత్రులై కారులెక్కి తుర్రున పోయెడివారి నెందరినో చూచితిమిగాని, ఈయన నాటినుండి నేటిదాక పట్టెడురికార్డు చంకను బెట్టుకొని కాలి బాటను పోవుచుండెనే! ఏమిటి ఈ మాయ -’ అని.
అవును మరి. స్వతంత్ర ప్రవృత్తి అట్లే కానవచ్చును. సమావేశము ముగిసిన పిదప బసలో ఒకసారి ఆయనను గలసికోవలెనని ప్రయత్నించితిని. అప్పుడు ఆయనతో నాకేమియు పనిలేదుగాని నాకున్న ఒకానొక ‘మమకారము’ ఆ వాకిట కొన్ని గంటలు నిలబెట్టినది. ఎందరో అక్కడికి వత్తురు. రంగాజీ రాలేదాయని ప్రశ్నింతురు. రాలేదని ఆ ప్రశ్నకు న్  సమాధానము. చూచిచూచి నిరాశతో నాబసకు నేను బోయితిని.  ఏమిటట ఈ ఆలస్యము? క్లబ్బులలోజేరి చీట్లపేకలకు దిగెనా? నృత్య నృత్తములలో పాల్గొనెనా? ఢిల్లీ వినోదాలలో కులాసా కబురులలో మునిగెనా? కాదు కాదు;ఆ సమావేశములో మొదటి నిమేషమైన విడువరాదన్న తత్వము రంగాతత్వము. సభా సమాప్తి అయినగాని ఈవలకు రారాదని ఆయన దీక్ష. ఈవలకనగా - ఇంటికి గాదు. అందులోనే గ్రంధాలయములోనే ‘తిష్ట’వేయవలెను. నాటి చర్చలో వచ్చినవిగాని రేపటి చర్చలో ఉపకరించునవిగాని బద్ధ శ్రద్ధగా పది సంపుటములైనా పరిశీలింపవలసినదే. ఆ సభలో- ఇక్ష్వాకులనాటి తాతయ్య అయ్యు, ఎప్పటికప్పుడు సర్వతోముఖ విషయ సంకలనము చేయుటలో ఆ మహావ్యక్తి అంత శ్రద్ధాభక్తులు చూపుచుండుటచేతనే నాటి సాయంకాలము నేను నిరాశతో తిరిగిపోవలసి వచ్చినది. నావంటి వ్యక్తులకుగాదు, ఆయన పుట్టినది. సంఘపరముగా దేశపరముగా వసుధైక కుటుంబముగా అక్కరకు వచ్చెడి దొడ్డనాయకులు ఆచార్య రంగనాయకులు.
ఆయన ఇన్నేండ్లుగా దేశసేవా తపస్సులో మునిగి ఈరంగమునకు వచ్చుటలో ఆయనకున్న ‘సాధ” ఏది? ఒకటికాదు రెండుకాదు; అవియు స్వయంభువులు. ఒకరి వెన్నువెనుక నిలిచి జైయని జెండాకర్రపట్టి ఊరేగిన ఘటముకాదు. మెరమెచ్చులకయి మందనుబ్రోవుచేసి కల్లబొల్లి కూతలతో కాలక్షేపము చేసిన మానిసికాదు. బ్రహ్మిని దిమ్మినిచేసి పందిని నందినిచేసి చాణక్యముతో బ్రతుకనేర్చిన జీవికాదు. అచ్చముగా కౌటిల్యమే ఉగ్గుపాలతో రంగరించి పోయగా పెరిగిపెద్దయై గద్దెయెక్కిన నాయకమ్మన్యుడుకాదు. ఎక్కిన యందలమే శాశ్వతమని భ్రమపడి వెనుక ముందర వారినందరను వెంటనే మరచిపోయెడి రాజకీయవేత్తకాదు.
పదవులు రానీ రాకపోవనీ తనపాటయే తనబాట; తన సిద్ధాంతమే ఘన సిద్ధాంతము. వారికోసము, వీరికోసమని మార్పుకూర్పులు కానరావు. మేతకోసమై గుర్రాలు రావచ్చును; పోవచ్చును. తరిగి పోయిన గరిక ఎదిగి పైకి రానే వచ్చును. ఆయన సిద్ధాంతము నమ్మి వచ్చిన అనుయాయులలో కొందరు అలవోకగా జారిపోయినను - ఆయన కదలడు; బెదరడు. సంఖ్యాబలము మీద ఎన్నడు ఆయన ఆధారపడి యుండలేదు. సిద్ధాంతములకే ఆయన ప్రాణము లిచ్చును. పదవులకై  సిద్ధాంతములను అమ్ముకొన్నచో ఎన్నడో ఢిల్లీలో వల్లమాలిన మంత్రియై అందలాలలో ఊరేగియుండును.మంత్రిగా గద్దెయెక్కిన వారిలో మనకు నేడు కానవచ్చు దోషములు రంగాజీలో అంటకుండుట మనము మరవరాదు.
చిన్న నాటి చదువులలోనే ఆయన రాజకీయ జీవితము ప్రతిబింబించి యుండెడిది. అప్పుడే ఆయన నాయకత్వచ్చాయ స్ఫురించెడిది. ఆవయస్సులోనే ఆయన దేశసేవాతత్పరత కొట్టవచ్చినట్లు కన్పట్టెడిది. పాఠశాల ఒక్కటే ఆయనకు పాఠశాల కాదు. ఇంటను బయటను - ఆయన కొక్కటే లక్ష్యము. తాను విన్నదేదో తనకు దెలిసినదేదో ప్రక్కవారికి జెప్పవలసినదే. మందిని గూడకట్టుకొని పదిమందికి పనికి వచ్చు పనిలో అడుగుపెట్టుటయే ఆయన సరదా. లేబ్రాయమందే ఆయనకు ‘కొమర్రాజు’ రచనలు ‘హృత్కవిలె’యై నిలిచెను. ‘చిలుకూరి’ చరిత్ర రచనలు హృద్గతమైపోయెను. ‘విజ్జాన చంద్రికా మండలి’ గ్రంధములు నిత్యగ్రాసములాయెను. తిక్కన రచన చవిచూడసాగెను.
గాంధీజీ ఆంధ్రులకు దెలియకముందే అస్పృశ్యతా పిశాచిని ఆవలకు నెట్టివేయవలెనని వీధిలో జెప్పుటయేగాక వ్రాతలో చూపుటయేగాక ఇంటిలో ఆచరించిన ధీరుడు. తెలుగువారిలో నాకు దెలిసిన పూజ్యుడు వీరేశలింగము పంతులు.
ఆయననుగూర్చి చదువవలసినవి చదివి, ఆయన యుద్యమములోని మెరుగులను దెచ్చుకొని, అక్షరాల ఆలేత వయస్సులో పాటించిన ప్రజ్జాశాలి రంగనాయకులు. తిక్కన కవిత్వతత్త్వము చక్కగా అర్ధము చేసికొని రాజకీయ చాతుర్యమిదిగో యని ప్రక్కవారికి అప్పుడే భోధింప నేర్చిన సాహితీ చతురుడు రంగా, ‘కురుక్షేత్ర సంగ్రామము’లో తానొక పాత్రగ రంగమెక్కి ఆ చిన్నతనములోనే పెద్దలను మెప్పించిన మంచివిద్యార్ధి రంగా. కేవలము- ఆంగ్లమానసపుత్రులే అవతరించెడి ఆ రోజులలో జాతీయత నేర్చుకొని వేషభాషలలో మార్పు తెచ్చుకొన్న మనీషి రంగా.
తెలుగుదేశము మారుమూలల తిరిగి చూచిన నాయకులలో ముఖ్యులు ఇర్వురో మువ్వురో. ఒకరు టంగుటూరి; రెండు - రంగా. రాయలసీమలో రంగా,  అడుగుపెట్టని పల్లెలేదు. తెలుగు గడ్డలో ఆయనకు అర్ధముగాని సమస్యలేదు. పట్టణాలలో చొచ్చి బంగళాలలో మకాముపెట్టి పెద్దరికము పెంచుకొన్న బుద్ధిమంతులలో రంగా చేరడు. పల్లెలలోగాలుపెట్టి జానపదుల ఆనుపానులు మూలమూట్టుగ గుర్తింపనేర్చిన నాయకులు రంగనాయకులు. తన మండలమే కాదు- తన రాష్ట్రమేకాదు- తన దేశమేకాదు- విదేశములు సైతము ఆయనకు సంచారభూము లాయెను. తనజాతికి  ఏమికావలయునో అంతర్జాతీయముగ తన దేశమునకేమి అవసరమో ఆ కీలకమెన్నడొ గుర్తించి రేయింబవలు శ్రమపడుచున్న మహానాయకులు రంగనాయకులు. నాలుగు దశాబ్దములనుండి తన యుద్యమమును నడుపుకొనుచున్న దేశభక్తుడు రంగాజీ. ఆయన నెలకొల్పిన సంస్థలకు అప్పుడే రజతోత్సవములు వచ్చినవి. ఆయన దేహము షష్టిపూర్తిలో పడినను- ఆయన జీవితము నిత్యోత్సాహతరంగ సంభృతము. అంగపుష్టిలో సన్నదనము కానవచ్చినను నిలువెల్ల జవసత్వములే తాండవించును.
రైతుతత్త్వము చదివిన విద్వాంసులుందురుగాని రైతుతత్వము జీర్ణించుకొన్న విద్యాధికులు మనకులేరు. వ్యక్తిగతముగా ఆతత్త్వము జీర్ణించుకొన్న కొందరు పెద్దలు చదువులలో ముందుకురాలేదు. చదువులలో ముందుకువచ్చినవారు -  ఆతత్త్వము నకు దూరమైపోయిరి. ఇట్టి తరుణములో చక్కగా చదువు సంధ్యలలో ఆరితేరి వానికనుకూలమైన త్రోవలో వ్యాసంగముచేసి, రైతుకోవలో పుట్టుటచే అలవోకగా రైతుతత్వము అర్ధము చేసికొని జీర్ణించుకొని, ఒకానొక మహోద్యమమును తానేముమ్మొదట ఈదేశములో సృష్టించి యిచ్చినది ఆచార్య రంగా. ఆ జెండా పట్టుకొని ఇతరులెందరో నేడు విప్లవధోరణిలోఊరేగవచ్చును. కాని ఈ యుద్యమమునకు ఉపజ్జాత రంగా అన్నమాట దేశము మరచిపోవదు; పల్లెలు అసలు మరువజాలవు. ఈ యుద్యమ సంరంభమేలేక సాహిత్యముగా ఆయన మరికొంత వ్యాసంగమేచేసియుండెనా ఆ కధ ఎట్లుండెడిదో అని అస్మాదృశులము కొన్నాళ్ళు అనుకొనుటకద్దు. ఉద్యోగపర్వములోని ఘట్టములను దీసికొని ఆ తీరుతెన్నులిట్టివని ఆయన నోట విన్నప్పుడుగాని, పారిజాతాపహరణములోని వర్ణనా వైదుష్యములో వింతసొబకులు ఆయన సోదాహరణముగా నిరూపించినపుడుగాని మాకు విస్మయానందములేగాదు మా చదువులకు ధిక్కారము గూడ కలిగెడిది.
తెలుగు గడ్డలో ఏమూల కెప్పుడు ఆయన సంచారమునకు బోయినను ఆ మూలనుండి కొన్ని మాటలు కొన్ని ‘యాసలు’ మూటగట్టుకొని రావలసినదే. చిత్తూరు జిల్లాలో చివరినుండి ఒరిస్సా సరిహద్దువరకు ఆ రోజులలో నిత్యసంచారము లాయెను. ఉన్నట్టుండి ఒకనాడు ఆయననోట భాషావిప్లవ ధోరణి ఒకదానిని సన్నిధానవర్తులము మేము గుర్తించితిమి. పర్లాకిమిడినుండి ఆరాత్రియే యింటికి వచ్చెను. యధాపూర్వకముగ మేము దర్బారులో చేరితిమి. ఇకమీదట నావ్రాసిన వాక్యమెల్ల వ్యావహారిక ధోరణిలో సాగవలసినదే అని ఆయన నిర్ణయించెను. అంతకుముందు లలితమైన గ్ర్ంధిక రచనలో ఆయన వ్రాసిన ఒకానొక ‘నవల’ నాచేతిమీదుగా అచ్చునకు వచ్చుటజేసి ఆయన గ్ర్ంధిక సరళి లెస్సగా తెలిసిన నాకు అప్పుడు కొంత ఆశ్చర్యమే కలిగినది. కాని ‘గిడుగు’ వారితో ఆయన చేసిన గోష్ఠి చాల హెచ్చుగా పనిచేసెను.ఆ కలము ఆనాటినుండి కొంగ్రొత్త కలమై ‘ఉన్నవ’ పంతుల వరవడిలో మరికొన్ని వన్నెచిన్నెలు చూపినది. విదేశములకు వెళ్ళియు మాతృభాషను మరువనివారు, అందుకు సాహిత్యము విడువనివారు చాల తక్కువమంది మనలో గలరు. వారిలో రంగాజీ ఒకరు.
అసలు దేశములో దేశనాయకులకు మాతృభాషా పాటవమునకు అవకాశమేలేదు. ఔత్తరాహులలో నాయకులు కొందరు రాజకీయ భాషయందేగాక మాతృభాషలో సైతము ప్రాభవము చూపినవారు కానవత్తురు. ఆ శ్రేణిలో మన రంగా చేరును. సాహిత్యముగా తన నేర్పు కూర్పులు చూపుచు, నిలువెల్ల రాజకీయములలో మునిగిపోయిన రంగాజీ నేడు అరువది యేండ్లు నిండినవన్న వార్త, ఒక విధముగా ఆనందము, వేరొక విధముగ విచారము ను గలిగించుచున్నది. ఆయన సృష్టించియున్న మహోద్యమములు పంటకు రాదగిన తరుణమిప్పుడే. వ్యవసాయరంగములో రాజకీయముగ అల్ల కల్లోలములు పుట్టవచ్చును. పునాదులే కదిలిపోయి సాంఘికముగా దెబ్బలు తగలవచ్చును. పొలములన్నియు ప్రభుత్వ పరములనియు తక్కిన ఆస్తిపాస్తులన్నియు వ్యక్తిగతములనియు మొన్ననే ఒకానొక పెద్దమంత్రి చెప్పినట్లు నిన్ననే పత్రికలో  వార్త వింటిని. అదే సిద్ధాంతమని తేలినచో రాజాజీ, రంగాజీలతో దేశమున కెంతో పనియున్నది. ఈషష్టిపూర్తి పెద్దల భోధలే మనము పెడచెవిని బెట్టితిమా దేశములో పరోక్షముగా నష్ట కష్టములు రావచ్చును. ఆవల కొన్నేండ్లకు - కాదు కాదు కొన్నాళ్ళకే ఆ ఫలితము ప్రత్యక్షమై అక్షరాల అనుభవింపవలసిన దుర్గతి పట్టితీరును. రాజ్యములు మారినను, రాజులు నశించినను రైతు చెడిపోవరాదు. రైతుబలమునుబట్టియే పంటబలిమి కానవచ్చును. పంట యింటికి వచ్చిననాడే భోక్తలనోటికి అయిదు వ్రేళ్ళుపోవును. రైఉ శ్రేయమే దేశశ్రేయము. రైతు కల్యాణమే విశ్వకల్యాణము. విశ్వకల్యాణము కోసమై రంగాజీ వంటి నాయకులను మనము సన్మానించుకోవలెను. ఇతోధికముగా ఎన్నెన్నో ఉత్సవములు ఆయనకు మనము చేసికొని తద్రూపమైన దేశసేవలో మన విధ్యుక్తము నెరవేర్చుకోవలసి యున్నది.
(నవంబరు 1960 లో ‘వాహిని’ ప్రచురించిన ఆచార్య రంగా షష్టిపూర్తి, వాహిని రజతోత్సవాల ప్రత్యేక సంచిక నుండి)


 

N.G.Ranga(1900-1995) critical profile 

 

POLITICS WITHOUT POWER
A Study on N.G.Ranga by N. Innaiah


 N. Innaiah
Outstanding personalities like M K Gandhi, Jayaprakash Narayan influenced Indian society without entering into power corridors. Though not to that extent, Professor N.G.Ranga emerged in Indian political scene before independence and continued his impact in post independence era.
This is a special study of that peasant leader from several angles.
Ranga was born in 1900 in Nidubrolu, a village in Guntur district. His parents Nagaiah, Atchamamba hail from a middle class agricultural family. The school education of Ranga was completed in his village and neighbor village Ponnur. He completed his matriculation and went straight to England for higher education.
During school days Ranga was exposed to the reformist literature of Kandukuri Veeresalingam, and Tripuraneni Ramaswami. The non -Brahmin movement was rampant and Ranga attended a couple of meetings and conferences of non Brahmin, and Kamma conventions. At that juncture Andhra was under Madras state. Justice party emerged against congress party and propagated for non Brahmin rule both in administration and temples. Ranga developed a flair for writing and he attempted a small book on Rani Rudramadevi. He read out the script to villagers, which was applauded.
By the time Ranga left for England the congress party was under the influence of Gandhi. Bal Gangadhar Tilak, another prominent leader in congress died and hence Gandhi was unopposed in congress party.

Ranga in Oxford:
N G Ranga traveled by ship and reached England in November 1920. He had to habituate himself for non vegetarian food. Since he was only a matriculate, he was asked to learn a second foreign language to qualify for admission in Oxford. Hence Ranga went to Germany and obtained a certificate after learning a few words and sentences! Mr. Velagapudi Ramakrishna (later ICS officer), Mr. Lingam Veerabhadraiah choudary (later income tax officer), Mr. Vasireddi Srikrishna (later vice chancellor of Andhra University) Mr. Murahari and Bhaskararao were there to give company. While studying in Oxford Ranga also had briefly visited Italy, France and Germany where he observed the agricultural conditions. He acquainted himself with J J Malen, G D H Cole, Brails ford, Wilkinson, Palmi dutt, clement dutt and J A Thod.
 Ranga was impressed with socialist movements of England and Europe. He also studied Marxism. Later Ranga attempted a book titled ‘Ranga and Marxism’ but it was not traced.
After returning from UK he married Bharati Devi. She was a matriculate and accompanied him in all his tours and political journeys.
Ranga contributed articles in the magazine COMRADE which drew the attention of Gandhi. Ranga met Gandhi a couple of times during his tenure of employment in Madras and observed the conditions of agriculture, labour and hand looms.
By the time Ranga returned to India, Madras state was under the rule of Justice Party. Ranga joined Pachayappa College in Madras which was managed by Justice Party. Then Ranga was appointed as adviser of state government on economic affairs and was an officer. In that capacity Ranga studied the conditions of peasants in Nilgiri and other places. Though Congress party was fighting for freedom, Ranga remained as an observer until 1930.
 He enrolled himself as a member of Congress party in 1930 after resigning to the posts of college lecturer and state advisor. He started wearing Khaddar and Gandhian cap.
During Madras days Ranga got close to Gudavalli Ramabrahmam, the writer, cine producer and editor of Prajamitra journal. Ramabrahmam produced reformist movies like Rytubidda, Malapilla during late 1930. And Ranga was impressed by them.
With that, the name of Ranga was popular among peasants in Andhra. Oxford education was added prestige in those days. Ranga also founded All India Adult Education Institution and became its vice chairman in 1926 to 30.
For the first time Ranga was elected to the central legislature at Delhi in 1930.The vacancy arose due to the resignation of Tanguturi Prakasam. In those days the voters were limited and confined to tax payers whose number is much less. Once plunged into congress party, Ranga was very active and emerged as an all India figure. He came close to leaders of all parties.From 1930 till 1991 Ranga was either in Lok Sabha or Rajya sabha. He was in Guinness book as parliamentarian with long innings. Though defeated to Lok Sabha a couple of times, immediately he could go to Rajya Sabha.
At home Ranga was helped by his elder brother Mr. Venkatappaiah who looked after agricultural lands and domestic affairs. His younger brother Mr. Lakshminarayana studied law but remained in politics to help Ranga in district and state level. Ranga had no children and he was relatively free from domestic affairs.
During 1930s Unnava Lakshminarayana published the Telugu novel ‘Malapalli’ which is quite an eye opener. Similarly Ranga wrote ‘Harijan Nayakudu’ which elevates the untouchable community on par with upper caste people. The hero Lingaiah worked for the welfare of his community and at the same time fought against discrimination based on caste.

After joining Congress party Ranga was very active politically both at centre and state level. He invited Gandhi in 1933 to inaugurate a political school for peasants, workers and artisans, the first school started in Nidubrolu, the native place of Ranga. Since then every year political educational schools were conducted at several places in Andhra. Distinguished politicians, economists and public workers addressed the schools. Syllabus was prepared by Ranga and few others covering vast scope of rural economics, agriculture, political movements and artisans. Peddireddi Timmareddi, P.Rajagopalanaidu, Kandula Obula Reddi, Chegireddi Balireddi, N.Vijayaraja Kumar, Sunkara Satyanarayana, Gorrepati Venkatasubbaiah, G. Lakshminarayana, Gouthu Latchanna, Muniratnam, and galaxy of others participated. These schools continued until 1953 annually spreading through out Andhra, Rayalaseema areas. Mostly, they were held in summer so that peasants could attend and participate. Even during prison days Ranga continued political classes to retinues in the jail. Even communists like Makineni Basavapunnaiah attended Ranga`s political classes. But during those days communists were camouflaged within congress and they came out only later. Indulal Yagnik, Jayaprakash Narayan, Pattabhi Sitaramaiah, addressed political classes. Thus Ranga has become the pioneer in rural political training classes.
Political schools for peasants:
The first political school was inaugurated by Gandhi on 23 December 1933.It was named after Ramanaidu. Simultaneously a library also was opened.
Training classes commenced on 12 April 1934 under the principal ship of Ranga. His brother Lakshminarayana taught in the school. K.Santanam, editor of Indian Express , inaugurated and Konda Venkatappaiah, congress leader presided. It ran for 30 days. Students and peasants from 6 districts actively attended.
Again on 17 April 1935 second year classes were held at the same place with 35 students.
Third year classes started on 15 May 1936 which was inaugurated by Ayyadevara Kaleswararao, congress leader.40 students attended.
Fourth year classes started on 1 May in 1937.Mr Kandula Obul Reddi, leader from Rayalaseema and Sadasivan conducted the classes.45 students participated.
During 1939 Rayalaseema peasant training classes were held on 20 Dec. 1937 in Giddalur. Bharati Devi presided over and Kandula Obul reddi was the principal.60 students participated. In Madanapalli school was held under the presidentship of Nyapati Narayana murthy. 75 students attended from 1 may 1938 for 30 days.
In May 1939 school was conducted in Tunikipad of Krishna district for 30 days and students from Telengana also came.
On 9 April 1940 School was conducted in Idupulapadu village of Bapatla taluq.Gouthu Latchanna inaugurated and Kandula Obul Reddi presided over. Drill classes were introduced.
Political school was held at Chennur in 1941 with Ratakonda Narasimhareddi as principal.
During 1945 May again a school was conducted in Nidubrolu and Ranga was present.
During summer of 1946 a school was held in Avanigadda of Krishna district. In 1947 a school was held in Sivagiri near Diguvamagam of Chittoor district. In 1947 training classes were conducted in Palasa of Srikakulam district with drill classes. In 1948 another school was held in Chilakaluripet, Khammam and Bezwada.
During 1952 big political school was conducted Challapalli of Krishna district. In 1953 another school was held in Tiruttani and in 1954 one more school was conducted in Nidubrolu. In all these classes Ranga was present or his syllabus was discussed.
Malcolm Adiseshaiah, J C Kumarappa, Ajay Kumar Ghosh, Unnava Lakshminarayana, Ferang Nagi, K T Shah, Dimitrov and others lectured.

Ranga participated in round table conference meetings and All India Congress annual meetings. He came close to Subhas Chandra Bose during the fight between Gandhi and Subhas. Ranga stood for Bose and thus paved the way for Gandhi to support his own people in Andhra Politics. That is how Pattabhi Sitaramaiah came closer to Gandhi.
In the factional politics of Andhra there was always bitter fight between Ranga followers and Pattabhi followers. Though Ranga was away most of the time from Andhra, his followers dragged his name and the bitter fight went on.
The factional fights in Andhra commenced when Ranga sought election to central legislature. Bulusu Sambamurthi campaigned against Ranga exposing his connections with Justice Party and anti-Brahmin stance.
Ranga underwent jail six times during freedom movement. First time in 1931 he, along with his wife Bharati Devi , was arrested in freedom fight.
Ranga also started his own political journal Vahini in Telugu in 1937. Several persons edited it periodically commencing with Nyapathi Narayana Murthy. Ranga contributed several articles and pen portraits in the weekly. Ranga wrote pen portraits of 110 persons under the title Distinguished acquaintances. Several persons were described by Ranga in a hearty way. The Telugu translation of this book was published by Telugu Academy.
During late 1960 the weekly was stopped. Ranga wrote pen portraits about many of his followers and admirers in the weekly.
Ranga was the president of Congress party in Andhra from 1946 to 51. The factionalism was rampant in the congress circles. Kalluri Chandra Mouli, Neelam Sanjiva reddi, Kala Venkatarao, Manthena Venkataraju, Alapati venkataramaiah and several others were against Ranga group.
Gouthu Latchanna from Srikakulam district was solid supporter of Ranga in all factional fights. Similarly Kandula Obul Reddi, P Rajagopala naidu, P.Thimmareddi, Chegireddi Balireddi, N V Naidu, Nirukonda Ramarao, Ravi Satyanarayana and others stood by Ranga. Of course Ranga`s brother Mr.Lakshminarayana was the kingpin in all those factional fights. These things went on until first national elections in 1951.
Ranga continued his efforts in other fields since 1930 and participated in several international delegations, addressed conferences and meetings. He called President of USA, Mr. Truman, during 1948 in Washington DC on behalf of world peasants association. He toured extensively in Europe, Soviet Union and USA. Ranga continued to write both in English and Telugu, covering various topics.
Ranga was in Constituent committee from 1946 and contributed his ideas. He proposed the name of Mr. B.R.Ambedkar to the chairmanship of Constituent assembly.
Ranga continued in Congress party until 1951. During 1951, Ranga and Sanjivareddi fought for the president ship of Andhra congress. Ranga was defeated narrowly. Due to faction fights, one section of congress went to court and obtained injunction, stopping the participation of delegates from Guntur district. In that district the majority were supporters of Ranga. Then in the last moment some prominent kamma congress persons like Anjaiah Anne and Kakani Venkataratnam defected to the opposite group. That led to the defeat of Ranga. After defeat Ranga along with his large followers resigned to the congress party. Thus the first national elections were fought while Ranga went to opposition party. That was big turning point in his political career.

RANGA IN OPPOSITION:

The  nation faced first general elections in 1951. By that time Ranga was defeated as president of Congress party of Andhra. Then Ranga resigned to the congress party blaming anti-peasant policies of Jawaharlal Nehru. By that time prominent leaders Jayaprakash narayan, Ajit Prasad Jain, Rafi Ahmed Kidwai, Tanguturi Prakasam, Kripalani, left congress. They all met in Patna of Bihar state and formed opposition party called Kisan Mazdoor party. Ranga joined initially but left soon when the party gave leadership to T.Prakasam. Ranga gave the pretext of not giving importance Kisans and came out. He then formed Krishikar Lok Party.
The first general elections gave a jolt to several opposition leaders including N. G. Ranga, T.Prakasam, B. R. Ambedkar etc.  Nehru emerged as national leader with Congress party. But in Madras state communists gained substantial seats and claimed power. Prakasm joined hands with communists to form ministry. Ranga opposed communists. Rajagopalachari was brought into field to undo the strategy of communists. With the support of N. G. Ranga Congress formed ministry in 1952.
Krishikar Lok party gained seats in Srikakulam, Vizag, Chittoor and East Godavari districts. But they did not join the ministry.
Ranga was elected to Rajya Sabha.
Agitation for Andhra continued. Potti Sriramulu demanded Madras city for Andhra and went on indefinite fast and lost his life after 58 days. Andhra formation was declared but Madras is not given. Then came the question of capital city of Andhra. Ranga opted for Tirupati-Chandragiri saying that the zamindar building can be utilized immediately. But finally Kurnool was decided as capital. The High court was set up at Guntur.
Prakasam defected again, came out of communist fold and accepted to be the first chief minister of Andhra. Krishikar lok party also joined the ministry. Ranga once again saw that communists did not occupy power.
But the congress ministry lost confidence soon and by- elections came in Andhra. Once again communists fought vigorously to gain power. They described as Rangula Ranga means he changes colors often.Ranga joined hands with his rivals like Neelam Sanjivareddi, T Prakasam and socialists as joint congress front. The campaign of Ranga was virulent. Ranga toured in a whirlwind campaign along with his loyal followers like Veerachari, Sunkara Satyanarayana, N Vijayaraja Kumar and opposed communists tooth and nail. Communists lost the power by gaining only 15 seats. The credit goes to Ranga.
The ministry was formed in Kurnool with Bezwada Gopalareddi as chief minister and Krishikar Lok party joined in it. The fight for congress leadership once again took place between Ranga and Alluri Satyanarayana raju. Ranga lost.
Once again Ranga was disillusioned and left congress.
Swatantra Party:
C.Rajagopalachari emerged as champion of peasants and anti Hindi policy. He vigorously campaigned against congress party and Jawaharlal. Then Ranga was invited to take up the president ship of Swatantra party. Ranga accepted and all his followers joined with him. In the state assembly of Andhra Pradesh Swatantra party emerged as main opposition party. Initially Dr Marri Chennareddi joined the party and supported Ranga but later he backed out and went to Congress party. Swatantra party attracted business community, upper classes and traders. It remained in that position for a decade. Gradually Ranga drifted. Rajagopalachari called him as Bolshevik and M R Masani emerged as strong leader in Swatarnta party.
During 1971 elections, Ranga contested against congress but lost. Then he decided to leave Swatantra party and join Congress. By that time Indira Gandhi was a powerful leader in Congress. Several followers of Ranga refused to join him but Ranga joined hands with Indira Gandhi. He went to the extent of supporting blindly, the dictatorial policies of Indira Gandhi including her suspending constitutional rights of freedom and liberty. She declared emergency and Ranga supported it.

The admirers and followers of Ranga collected money and bought a house in Hyderabad and donated that to Ranga as a token of their appreciation for his services. It was registered under public trust for activities. Gradually the kith and kin of Ranga converted Ranga Bhavan as private trust and misused that. Ranga approved the conversion of public trust into private trust by applying to the chief minister N.T. Ramarao and obtained legal permission.
Afterwords, Ranga remained in Parliament until 1991 when he was defeated by Telugu Desam for Lok Sabha.
The Agricultal University at Hyderabad was named after N. G. Ranga as a token of his services to agricultural community.

International tours

Ranga toured extensively in the international field throughout his political career.
1948 - Participated in International conference of labour in San Francisco, USA
1949- Ranga met President Truman of USA in Washington DC on behalf of international agriculture community.
In 1957 Ranga addressed agricultural conference in Bulgaria.

WRITINGS OF N.G.RANGA:
1. The modern Indian peasant by N. G. Ranga  - 1988)
2. Distinguished acquaintances by N. G Ranga  - 1976)
3. Self-Employed Peasants and Tribal People , 1983)
4. Self-employed peasants and tribal people: A saga of Rangajis life-long fight for the protection and welfare of agricultural toilers and tribal people by N. G Ranga
5. Credo of World Peasantry by N.G. Ranga  
6. Economic programme of Kisan Congress by N. G Ranga - 1939)
7. Bapu blesses by N. G Ranga  - 1969)
8. The economics of handloom: (Being a study of the social and economic conditions of handloom weavers of South India.) (Andhra economic series) by N. G Ranga
9. Economic organisation of Indian villages (Andhra economic series) by N.G Ranga
10. Swatantra alternative to third plan: Speeches in Parliament by N. G Ranga - 1963)
11. Revolutionary peasants by N. G Ranga (- 1949)
12. N.G. Ranga (Indian freedom fighters: struggle for independence) by N. G Ranga
13. Fight for freedom: Autobiography of N.G. Ranga

Biography - Ranga Nayakulu, Nagaiah Gogineni


· N. G. Ranga   was awarded Padma Vibhushan by the President of India in 1991.
            
· A commemorative postage stamp was released by Government of India in 2001.

· The N.G. Ranga Farmer Award for Diversified Agriculture was instituted by the Indian

             Council of Agricultural Research in 2001.

· His name found a place in the Guinness Book of World Records as a Parliamentarian with fifty years of service.
· Agricultural University of Andhra Pradesh is named in his honour and memory as Acharya N. G. Ranga Agricultural University.

Political career


Lok Sabha
Period
Constituency
Party
2nd Lok Sabha
1957-1962
Congress Party
3rd Lok Sabha
1962-1967
Swatantra Party
4th Lok Sabha
1967-1970
Swatantra Party
7th Lok Sabha
1980-1984
Congress (I)
8th Lok Sabha
1984-1989
Congress (I)
9th Lok Sabha
1989-1991
Congress (I)


Ranga was one of the founders of the International Federation of Agricultural Producers. He represented India at the Food and Agriculture Organization (Copenhagen) in 1946, the International Labour Organization (San Francisco) in 1948, the Commonwealth Parliamentary Conference (Ottawa) in 1952, the International Peasant Union (New York) in 1954 and the Asian Congress for World Government (Tokyo) in 1955.
Who are Ranga’s admirers :
Professor N G Ranga during his long political life gained innumerable admirers, followers, disciples whose number is very long. It is not easy to name all of them. Ranga himself wrote pen portraits of some of them in Vahini weekly and published a book .These distinguished portraits were published in English and Telugu too. Here is a partial list.

Ferang Nagi, Dimitrov, Dr Swaminathan, Dr Y.Nayudamma, Justice Pandurangarao, Justice P A Choudary, Dadubhai Amin, Uddamsingh Nagoki, Avula Gopalakrishna Murthy, Guttikonda Narahari, Pavuluri srimannarayana, S.V.Pantulu, Bandlamudi subbarao, Narravula subbarao, N.Vijayaraja kumar, Nagineni Venkaiah, Gorrepati Venkatasubbaiah, Nyapati Narayana Murthy, Gogineni Umameswararao, Gutlapalli Subbarao, Sudangunta Venkateswarlu, Pasupuleti Koteswararao,N.Veerachari, Sunkara Satyanarayana, K.Rosaiah, Yadlapati Venkatarao, R C H Manoharam, Kosaraju Ammaiah, Kavuri Venkaiah, Yelavarthi Sriramulu, Pavuluri Srimannarayana, P.Rajagopalanaidu, Kandula Obul Reddi, Peddireddi Thimmareddi, Chegireddi Balireddi, Neerukonda Ramarao, Gouthu Latchanna, Dr K.Sadasivarao, N.V.Naidu, Bhisetti Apparao, col Apparao, Nannapaneni Venkatasubbaiah, K.V Subbaiah, B S R Krishna, Daruvuri Veeraiah,Dr Yelamanchali Sivaji, Dr Yarlagadda Lakshmi Prasad, Gorada Parandhamaiah, Tummala Sitaramamurthy, Kondaviti Venkatakavi, Ravipati Mahananda, Kalluri Veeriah, Dhanekula Narasimham,B.V.Sivaiah, Kandimalla Butchaiah,Agarala Eswara Reddi .G.Muniratnam,Vaddempudi Hanumantharao, Vegunta Kanaka Ramabrahmam, Chigurupati Krishnarao, Vadde Sobhanadriswararao,Tripurana Raghavadas, Dr Basavapunnaiah.Pullela Rattaiah. Parvathaneni Veeraiah, Velagapudi Ramakrishna, Limgam Veerabhadraiah choudary, Mandava Sriramamurthy,Pragada Kotaiah, Akkala Kotaiah,Divi Kondaiah, Dr M.Channareddi,Chittur Nagaiah, Pullela Syamasundararao,Chigurupati Krishnarao,Nellor Venkataramanaidu,Ramabrahmam Gudavalli,Charan Singh, C.Rajagopalachari, Bezwada Ramachandrareddi, Khasa Subbarao, Duggirala Balaramakrishnaiah,Suryadevara Rajyalakshmi Devi.C.Narayanareddi, Bapureddi,Velagapudi Ramakrishna, Settipalli,Goli Seshaiah,Kotha Satyanarayana chowdary, Kolla Srikrishnarao, Jasti jagannadham, V.L.sundararao.
WHAT RANGA STANDS FOR :  
Throughout his political career Professor Ranga stood for peasants, their self respect, right of their property and economic freedom. Before removing peasants from their agricultural lands, alternative employment source should be provided so that they can sustain and live with dignity. All agrarian reforms should be conducive to the agriculturists. Distribution of national wealth and income should be rationalized in such a way that the agriculturists are not exploited with unequal distribution. There should be parity in the evaluation of the services rendered by farmers and other sectors. Co-operative farming and collective cultivation under state supervision will lead to dictatorship.Ranga opposed such coercive reforms which curb the freedom and dignity of peasants.
Agriculturist is at the center of Ranga’s political, economic philosophy. He calls it Peasant (Kisan) worker (cooli) artisan (kalakar) kingdom (rajya).
  My acquaintance with N G Ranga:
I know Ranga ji since 1951. My father Narisetti Rajaiah and my brother Vijayaraja kumar are followers of Ranga in politics. Thus I came to know him.He visited couple of times my village Patareddi palem and Chebrolu where I could see him closely. When Ranga started Krishikar Lok Party my brother Vijayaraja kumar took active part in it. My father took him for the first time to Challapalli, in Krishan district where the political school was organized during 1952. My brother joined the party and became organizing secretary. His speech in the political school attracted Ranga ji and others. Since then he was star speaker in the party. Later the party organized its first conference at Tenali. I attended it and saw the deliberations, speeches of leaders and met lots of people. Mr S V Pantulu, K.Rosaiah ( later became chief minister) Mr Narravula Subbarao, Ms R C H Manoharam, J S R Krishna, Vasireddi Satyanarayana were there whom I came into contact. Ranga started Vidyathi Sammelan ( Student wing of the party) . RCH Manoharam wished to become its president but R,Mr Y R K Reddiangaji advised her not to go for such positions since it involves lot of public exposure.
I never involved in Ranga`s political parties nor indulged in his political activity.
In the bye elections held in 1952 Krishikar Lok party contested against congress in Duggirala constituency near Tenali and lost. At that time I toured to have first hand knowledge of election propaganda. I met Ranga ji couple of times at that time. He used to encourage party workers. But I was never joined party but remained onlooker and observer.
There was assembly election in Martur, in Guntur district where Mr  B V Sivaiah from Narakodur contested and won. Rangan canvassed vigorously and I went round places to observe and met Ranga couple of times.That is experience.
I joined in A C College in Guntur as intermediate student in 1953 and there was lot of exposure with politics, public meetings, agitations, public leaders. Ranga and his followers were frequent visitors and I observed them rather closely. I started writing in Prajavani weekly and commented on Ranga ji`s politics. Mr B S R Krishna, Mr Vasireddi Satyanarayana, Mr Daruvuri Veeriah are the active commentators. When Daruvuri Veeraiah started Yuva Karshak organization for peasant youth, I was the secretary of the organization. But I left it after short duration. Gouthu Latchanna, Kandula Obul Reddi, P.Rajagopal Naidu, kalluri Veeriah, Yedlapati Venkatarao, Veerachari, K.Rosaiah, Sunkara Satyanarayana, and several others were active as followers of Ranga. I gained much experience with their company. During that time I met Ranga several times and read much of his writings both in English and Telugu. I also followed his writings in Vahini weekly. I met his wife Bharati Devi and his brothers Gogineni lakshminarayana, Venkatappaiah and  their off spring.
I visited couple of times the native village of Ranga in Nidubrolu and had food in their residence. Then I come across Govada Parandhamaiah from Machavaram who became legislator.
In separate Andhra agitation and during the fight for political capital of new Andhra state , I observed politics with curiosity. Ranga opted Tirupati for capital. Ultimately it was decided in Kurnool. I visited Kurnool couple of times where I met Ranga. He contested for the leadership of the joint congress party and lost.
There was big election campaign during 1955 election in which Ranga was the hero. I followed his speeches. Mr Daruvuri Veeraiah reported his speeches regularly. Ranga campaigned against communists and became instrument to defeat them. My brother Vijayaraja Kumar was vigorous campaigner during those elections. I observed the constitutency of Jagarlamudi Chandra Mouli in Ammanabrolu.
Ranga was ridiculed by Mr Narla Venkateswararao in Andhra Prabha and put his full name as Gogineni Ranganayakulu. The followers protested but Narla did not budge. Communists attacked Ranga saying that he changed colors frequently. Despite all this Ranga stood triumphant.
After the elections Ranga came out of Congress and joined hands with Rajagopalachari to form National political Party called Swatantra. I observed the formation of the party from the beginning and came with close acquaintance with Bezwada Ramachandra redid and Rajagopalachari. I also reported their meetings from Bapatla to Bobbili where Ranga was along with Rajagopalachari was key speaker.
In 1956 my brother Vijayaraja kumar married Kanya Kumari and function was held in Saraswati mahal, Guntur. Prof N G Ranga was the chief guest in the ceremony where Mr Avula Gopalakrishna Murthy performed the wedding in a secular way. His speech at that time was master piece. Mr Kotha Raghuramaiah was another important person who blessed the marriage.
In 1960 I was in Sangareddi where my sister was working. Then I received a postcard from Ranga asking me to join as his personal assistant. I went and sought the advice of Mr Avula Gopalakrishna murthy at Tenali who welcomed the idea and advised me to join. Thus I became personal assistant of Ranga and worked with him for two years. It was great experience. I toured with him throughout India and met many people in various states. 
After two years I left the job and went back to persue my education. I joined Osmania University where I completed my M A with philosophy and did my Ph.D with the topic Philosophical consequences of Modern Science.
But I kept in touch the politics and writings of N G Ranga.I liked his book: Fight for Freedom which is autobiographical and franck. He was very critical of Jawaharlal Nehru.
But soon he was disillusioned with Swatantra party and rejoined congress party. For a short period he was critical with the administration of Indira Ganghi. In 1972 Ranga was defeated in the Lok Sabha elections. Immediately after the election he joined congress party along with his loyal followers. Many followers refused to join with him.
Prime minister Indira Gandhi declared emergency in the country and suspended the consitutuional rights of free expression . Ranga supported her and followed her leadership blindly.Since then he remained loyal to the party and was elected to Lok Sabha.
The admirers and followers of Ranga collected money and bought a house in Himayat nagar, Hyderabad as a gift to his services to the country, particularly to the peasant community. The building was kept under public trust. After some gap, the kith and kin of Ranga planned to convert the public trust into a private one. Mr N T Ramarao was the state chief minister of Andhra Pradesh. Ranga sent the papers for the approval of N T Ramarao . Out of regard to Ranga the chief Minister N T Ramarao signed and the public trust was converted into private one. Mr Nageswararao, son of Ranga`s younger brother took control of the Ranga Bhavan. The misuse of public trust was total and complete.
In the last of days of Ranga, I interviewed him on Doordarshan of Hyderabad which was telecasted in early 1990s.
I wrote critical appraisal of Ranga in my articles. His admirers did not like my approach. Ranga was in Pachayappa`s college as economics lecturer as soon as returned from Oxford during late 1920s. That college was under the management of Dravida Khazagam which is anti brahminical in its social philosophy. Ranga did not join congress party at that time. After his resignation from the college he entered into freedom movement and joined congress party. That was pointed out .This fact was not liked by either Ranga nor his followers. But I did not regret.
Communists were always critical of Ranga and his politics,They called him Rangula Ranga means that he often changes his parties. That is a fact. Ranga changed many parties during long political innings. He was in Swarajya party, Congress party, Kisan Praja party, Krishikar Lok Party, Swatantra Party, United Congress, and finally he returned to Congress.
Ranga was prolific writer in English and Telugu. He published several books, pamphlets, articles. He toured entire world and worked for the welfare of peasants. He wrote several pen sketches of his followers.
Ranga lived simple life and never indulged into corrupt practices. He had no children.
Throughout his life Ranga was in Khadi dress.
My brother Vijayaraja kumar translated his work Revolutionary peasants into Telugu.) 

 - Narisetti innaiah

ఈ బ్లాగు రూపకర్త కొత్త కమలాకరం కు 1977 సంవత్సరంలో ఆచార్య రంగ వ్రాసిన కార్డు:

 
రంగ
C/O రాజగోపాల నాయుడు
member Of Parliament

(Lok Sabha)
35, North Ave.

N.Delhi-1
19-7-77



శ్రీ కమలాకరం.
చక్కని కాగితంపై, కమ్మని అక్షరాలతో మీరు పంపిన శుభాకాంక్షలకు కృతజ్ణుడ.
“యధావిధిగా" తిరిగి పార్లమెంటరీ ప్లాటుఫారం నుండి రైతు కూలిప్రజల సేవలు చేయు అవకాశం అందినది.
మన శ్రీ రాజగోపాలు నాకు తోడైనాడు. ఆయన శక్తివంతముగా లోక్ సభలో  మన వుద్యమ సేవ చేయ గల్గు చున్నారు.
16 తేదీన హైదరాబాదులో MLA club లో మీ మునసబు గారు* కలిసిరి.
మీకాలేజి బాగా అభివృద్ధి చెందుచున్నందుకు సంతోషము.
అన్ని రాజకీయ పక్షాలతో చేరిన, జాతీయ ప్రభుత్వం అవసరం.
ప్రజాస్వామ్యం నిల్వాలంటే, మన ప్రజలు అభివృద్ధి సర్వతోముఖంగా
అందుకోవాలంటే, స్విట్జర్లండులో వలె N.Govt. మనకు ఎప్పటికైనా అందాలి గదా!
రైతు కూలి ప్రజా రాజ్యాశయమును ప్రచారము చేస్తూ వుందురు గాక.
                                     ప్రేమ.
                                     రంగ.

*మునుసుబుగారు :  తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, రామచంద్రపురం వి.ఎస్.ఎం కళాశాల వ్యవస్థాపకులు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి గారు రాయవరం మునసబుగా ప్రసిద్ధులు.
               ..............
రంగా గారి స్వహస్తంతో వ్రాసి నాకు ఇచ్చిన టెస్టిమోనియల్....


 

 






నిడుబ్రోలు వెంకటేశ్వర నగర్ లోని
పండిత, కళాప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి గారి
స్వగృహంలో జరిగిన, చౌదరిగారి వర్ధంతి సభలో- 
ఆచార్య ఎన్.జి.రంగా,
తెలుగు లెంక తుమ్మల సీతారామ మూర్తి గారు,
పండిత శ్రీకృష్ణ భగవాన్,
నన్నపనేని వీరయ్య చౌదరి, ఉప్పల నాగేశ్వర రావు,ప్రభృతులు 

....................
ఆచార్య రంగాజీ
రచన: డాక్టర్ జక్కంపూడి సీతారామారావు

 రంగాజీ 1900 సంవత్సరం నవంబరు 7వ తేది జన్మించారు. తొంభైఅయిదేళ్ళ పరిపూర్ణ జీవితం గడిపి 1995 జూన్ 8వ తేది పరమపదించారు.
అంటే ౧౯వ శతాబ్దాంతమున జన్మించి ౨౦వ శతాబ్దాంతమున స్వర్గారోహణ చేశారు. కాబట్టి రెండు శతాబ్దములను పావనం చేశారు. అందుకే రంగాజీని అనేకమంది జాతీయ, అంతర్జాతీయ రాజనీతిజ్ణులు, మరెందరో వివిధ వర్గములకు, తరగతులకు చెందిన ప్రముఖులు బహుముఖ ప్రజ్ణాధురీణునిగా, దేశభక్తునిగా, పావనచరితునిగా, పూర్ణపురుషునిగా, అభివర్ణించారు.
ఆయన జీవితం - జీవితగమనం రుషిగా, మహర్షిగా, బ్రహ్మ
ర్షిగా, రూపాంతరములు చెందుతూ మానవులలో మనీషిగా, మహనీయునిగా, మానవ అవతారము నుండి పరిణత చెందిన మాధవుడుగా ఎంచుకొనుచున్నారు.
రంగా మాతృగర్భము నుండి యీ పరమ పవిత్రమూ, పరమ పావనమూనైన పుణ్యభూమిపై జన్మించి, పుణ్యపురుషునిగా పరిణతచెంది, పరమ భాగవతోత్తముడిగా రూపుదాల్చిన మహోన్నత వ్యక్తి.
రంగాజీ1924 ఇంగ్లండులో చదువులు సాగిస్తున్న కాలంలో మార్క్సిజం, కమ్యూనిజం, సోషలిజం ప్రభావాలకు లోనై, సుత్తి, కొడవలి చిహ్నంగా ఎర్రజెండాను ఎగురవేసిన తొలి యువతరంలోని వారు.
1935-40 మధ్య కాలంలోనే కమ్యూనిజంఅంటే ఏకపక్ష కార్మిక నియంతృత్వమేనని ముందుగా మునుముందుగా అవగాహన వచ్చిన ఇరువురు మహామేధావులలో రంగాగారొకరు. రెండవవారు యుగోస్లోవియా కమ్యూనిస్టు పార్టీ నిర్మాత - ఆ దేశ కమ్యూనిస్టుప్రభుత్వాధినేత మార్షల్ టిటోకు గురువు “మిహిలోవ్ జిలాన్”, “న్యూక్లాస్” అనే గ్రంధంద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు.
మార్క్సిజం, కమ్యూనిజం,  ఏకపక్ష కార్మిక నియంతృత్వ సిద్ధాంతానికి, మార్క్స్ “క్యాపిటల్” గ్రంధానికి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా, దానినే ప్రాణప్రదంగా ఎంచుకొనే విధంగా “కిసాన్ మజ్దూర్ ప్రజారాజ్” సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ౧౯౪౪లో జైలు నుండి విడుదలవుతూనే గాంధీతో చర్చించి ఆమోదింప చేశారు.
రంగాజీ జీవితంలో ఎన్నో ఘటనలు - ఈ ఘట్టాలు, ఘటనలు, ఘర్షణలుగా, సంఘర్షణలుగా, ముసురుకున్నాయి. అన్నింటినీ ఎదిరించి నిలచిన ధీరోదాత్తుడాయన.
అపోహలతో, అపార్ధాలతో, అబద్ధాలు సృస్టించి, అక్రమాలు సాగించి ఆయనను జీవితమంతా ఎదిరించారనేకులు.. వేధించారు మరికొందరు.
ఇక ప్రధాని పండిట్ నెహ్రూతో సిద్ధాంత పోరాటాలు- అపజయాలు, పరాజయాలు, పొందుతూనే విజయాలు సాధించిన యోధులు రంగాజీ.
ఆచార్య యన్.జి. రంగా, అరవై అయిదు సంవత్సరాలు పార్లమెంటులో ఉన్న ప్రముఖ గాంధేయవాది. ఆర్ధిక శాస్త్రంలోను, చరిత్రాధ్యయనంలోను, ఆక్సుఫర్డులో పట్టం పుచ్చుకొన్న శాస్త్రవేత్త, గుంటూరు జిల్లా నిడుబ్రోలులో 1900 సంవత్సరంలో పుట్టి, 1924లో భారతీదేవిని వివాహమాడారు.
రంగాజీ గాంధేయ సిద్ధాంతాలను వరించిన గిల్డు సోషలిస్టు. అంతర్జాతీయ రైతాంగనేత. భారత పార్లమెంటులో 1930 నుండి ఇటీవల వరకు కాంగ్రెసులోను, ప్రతిపక్షంలోను అగ్రగామిగా నుండి, ప్రపంచ పార్లమెంటరీ వేదికలైన వివిధ దేశాల సంయుక్త పార్లమెంటు సమాఖ్యలలోను, కామన్వెల్తు పార్లమెంటు సమాఖ్యలలోను, గణనీయమైన పాత్ర నిర్వహించారు. కాంగ్రెసు ఆర్ధిక, ప్రణాళికా విభాగ కార్యక్రమాల్లోను, ప్రభుత్వ రంగ పరిశ్రమ సంస్థల కమిటీలలోను, పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉండి బహుముఖంగా ఖ్యాతి నార్జించారు.
జాతీయ, అంతర్జాతీయ సంస్థల స్థాపన:
అంతర్జాతీయ వ్యవసాయోత్పత్తిదారుల సమాఖ్యను స్థాపించిన ప్రముఖులలో రంగాజీ ఒకరు. వారు అఖిల భారత కిసాన్ కాంగ్రెసుకు వ్యవస్థాపక అధ్యక్షులు, భారత రైతాంగ విద్యాలయం-నిడుబ్రోలు, విదేశ వ్యవహారాల సంఘం-న్యూ ఢిల్లీ. గ్రామీణ ప్రజా సమాఖ్య, చేనేత, చేతివృత్తుల కాంగ్రెసు వ్సంస్థలకు వ్యవస్థాపక అద్యక్షులు కూడా. “రైతు కూలీ ప్రజా రాజ్య సిద్ధాంతాన్ని” ప్రవచించి మహాత్మ గాంధీజీచే ఆశీస్సుల నందిన మహాతత్వవేత్త.
భారత ప్రతినిధిగా అనేక అంతర్జాతీయ సభల్లో పాల్గొన్నారు. శాన్ ఫ్రాంసిస్కోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక మహసభలోను, కోపెన్ హాగన్ లో జరిగిన ఆహార, వ్యవసాయ మహాసభ లోను, టోకియో ప్రపంచ శాంతి మహాసభలోను, మిత్ర రాజ్య సమితి పారిస్ లో నిర్వహించిన గాంధీ శతజయంతి సదస్సులోను1969లో పాల్గొని చారిత్రాత్మక పాత్ర నిర్వహించారు. 1988లో జరిగిన నానాజాతి సమితి సమావేశంలో భారత ప్రతినిధివర్గ ఉపనాయకునిగాను, 1991లో అలీన రాజ్యాల సభలకు భారత ప్రతినిధిగాను పాల్గొన్నారు.
పరిశోధనలో పరిణతుడు:
ఆర్ధిక, రాజకీయాధ్యయనంలో ఆక్సుఫర్డ్ విద్యాలయం డి.లిట్, సామాజిక శాస్త్రంలో ఆక్సుఫర్డ్ డిప్లొమాను పొంది, ఆంధ్ర విశ్వవిద్యాలయం చేత గౌరవ డి.లిట్ తో గౌరవించబడ్డారు.
పార్టీల స్థాపనలో ప్రముఖ పాత్ర నడిపిన ప్రజా ఉద్యమాలు:
వ్యవసాయీకులైన ఆచార్య రంగా 1917 నుండి ఇప్పటి వరకు జాతీయ కాంగ్రెసు నాయకునిగా ఉండి స్వాతంత్ర్య సంగ్రామంలో ఆరుసార్లు జైలు శిక్ష అనుభవించారు. భారత కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీలలో అధినేతగా వుండి గణనీయంగా కృషిచేశారు. వలస ప్రజల, రంగుజాతుల స్వాతంత్ర సిద్ధికి, స్వయంవృత్తుల రైతాంగాన్ని చెనేత, చెనేత కార్మికుల, గ్రామీణ ప్రజల స్వాతంత్ర్యానికి , వారి హక్కుల పరిరక్షణ్కు, వారి అభ్యున్నతికి నిర్విరామంగా కృషి సల్పారు. 1931 నుండి అనేక సత్యాగ్రహ సమరాలు, కిసాన్ యాత్రలు, పికెటింగులు నిర్వహించారు. రైతుల స్వంత కమతాలను స్వాహా చేయడానికి, రద్దు చేయడానికి ఉద్దేశించబడిన ౧౭వ రాజ్యాంగ సవరణ బిల్లును సాహసోపేతంగా ఎదిరించి, దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించి పార్లమెంటులో విజయం పొంది, స్వయం వృత్తుల వారైన రైతాంగాన్ని కాపాడారు.
వారు 65 సంవత్సరాల పార్లమెంటరీ జీవితంలో ప్రజల అభ్యున్నతికి పాటుపడి, నిరాడంబరుడిగా, శీల సంపదలు కల్గిన గాంధేయవాదిగా గణుతి కెక్కారు. పార్లమెంటులో 50 సంవత్సరాల రికార్డు స్థాపించిన సందర్భంగా, ప్రత్యేక గౌరవానికి చిహ్నంగా ప్రభుత్వ పరంగా, స్పీకరు అధ్యక్షతన జరిగిన సభలో ప్రధాని ఇందిరా గాంధీ పార్లమెంటు చిత్తరువు పొదగబడిన లోహ పత్ర్ంతో సన్మానించారు. తోటి పార్లమెంటు సభ్యులందరూ దానిలో పాల్గొని నీరాజనాలందించారు.
గత 10 సంవత్సరాల వరకు (ఈ రచన జరిగింది 1997 లో) కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ ఉపనాయకునిగా ఉంటూ వచ్చారు.
వారు 75 ఏండ్ల రాజకీయ, సాంఘిక సేవారంగాల్లో ఒనరించిన సేవలకు గుర్తింపుగా వివిధ అవార్డులు పొందారు. భారత్ కృషిక్ సమాజ్ చే 1983లో “కృషిక్ రత్న”, అఖిలభారత రాజాజీ సమాఖ్యచే “రాజాజీ రత్న” అవార్డు 1982-83 లో, ఆల్ ఇండియా ఎడల్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ - న్యూఢిల్లీ వారిచే ప్రఖ్యాతమైన “జవహరలాల్ నెహ్రూ లిటరసీ ఎవార్డు”ను, 1984 లో ఆంధ్ర మహాసభచే “ఆంధ్ర రత్న” అవార్డును, అందుకున్న వీరి పుట్టిన తేదీ అయిన నవంబరు ౭ ను “కిసాన్ దినం”గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీ శిరోమణి సంస్థ వారు “శిరోమణి” ఎవార్డును,  1991లో ఇండోజపనీస్ సంఘం వారు టోక్యో“ఓస్కా” ఎవార్డును అందచేశారు. ఇండియా కోరియోట్రిక్ సంస్థ వారు “పార్లమెంటు పెద్ద”గా గుర్తించి సన్మానించారు.
మేధావులు, జాతీయ నాయకుల సరసన రంగాజీ :
భారత జాతీయ నాయకులుగా ఉండి, పార్లమెంటులో అగ్ర నాయకులుగా ఉండి నిర్మాణ కార్యక్రమం నిర్వహించిన రచయితల్లో మేటి రచయిత రంగాజీ, ప్రసిద్ధ జాతీయ నాయకులుగా త్యాగధనులుగాఎంచబడిన గాంధీజీ, నెహ్రూ. సర్దార్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రాధా కృష్ణన్, నేతాజీ సుభాస్ చంద్ర బోస్, ప్రకాశం, లాల్ బహదూర్, గిరి, యస్.యం.జోషీ, సహజానంద్, రాజాజీ , మసానీ వంటి ప్రముఖుల సహచరుడుగా స్వాతంత్ర్యోద్యమంలోను, కిసాన్ ఉద్యమాల్లోను, కార్మిక ఉద్యమాల్లోను, అనేక కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించిన విషయం అందరికీ విదితమే. అంతేగాక అతివాద కార్యక్రమాల్లోను, సోషలిష్టు, నిర్మాణ కార్యక్రమాలలోనూ వారితో కలిసి పనిచేశారు. రంగాజీ జయప్రకాష్ నారాయణ్, అశోక్ మేహతా, కమలాదేవి, అరుణా అసఫాలీ, లోహియా, నాధ్ పాయి, మొదలగు అనేకమంది అతివాద సోషలిస్టు నాయకులతో కలిసి కార్యరంగం నడిపారు. అంతేగాక నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించే అనేకమంది సంఘసేవకులతో, ఆధ్యాత్మికవాదులతో సన్నిహితంగా ఉన్నారు.
స్వాతంత్ర్య పోరాట నిర్వహణలో పనిచేసిన, సాంఘిక విప్లవకారుల, రైతాంగ నేతల, కార్మిక నాయకుల కార్యకలాపాలపై, భావాలపై, విలువలపై, 65సంవత్సరాలు రంగాజీ అనుభవాలు, అభిప్రాయాలకు అత్యున్నత విలువ సంతరించుకొంటుందంటే అతిశయోక్తికాదు.
అందుకు దర్పణంగా రంగాజీ రచనలు, ప్రచురించిన గ్రంధాలు:
(ఆంగ్లంలో)
రంగాజీచే రచించి, ప్రచురించబడిన  ఈ క్రింది గ్రంధాలతో పాటు మొత్తం అరవై అయిదు.
1) క్రెడొ ఆఫ్ వరల్డ్ పెజంట్రీ
2) ఎగొని అండ్ సొలెస్ - 2భాగాలు
3) డిస్టింగ్విష్డ్ ఎక్వెంటెన్సెస్ (1976) 2 భాగాలు
4) కలోనియల్ అండ్ కలర్డ్ పీపుల్సు ఫ్రంట్ (1957)
5) ఫైట్ ఫర్ ఫ్రేడమ్ (ఆత్మ కధ) 1967
6) గాంధియన్ ప్లాన్
7)హిస్టరీ ఊఫ్ కిసాన్ మూవ్ మెంట్
8) రివల్యూషనరీ పెజెంట్(1954)
9) బాపూ బ్లెసెస్ ( గాంధీజీతో చర్చలు, సంభాషణలు)1969
10) అలీన ఉద్యమం
11) ఇండియా ఇన్ ది యు.ఎన్. - రంగాస్ పార్టిసిపేషన్1983
12) ప్రొటెక్షన్ ఆఫ్ ది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెజెండ్స్ అండ్ ట్రైబెల్ క్లాసెస్
13) ట్రైబ్స్ ఆఫ్ నీలగిరి
14) సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్టర్
15)స్మృతీస్ ఆఫ్ భారతీదేవి(1973)
16) ఇండియన్ పొలిటికల్ ఇన్ స్టిట్యూషన్స్-2 భాగాలు (1933)
17) హరిజన నాయకుడు(1934)
18) ఎరియల్ - ఐ - వ్యూ ఆఫ్ యు.ఎస్.ఎస్.ఆర్. అండ్ యుగోస్లోవియ (1956)
19) ఔట్ లైన్స్ ఆఫ్ నేషనల్ రివల్యూషనరీ పాత్ (1945)
20) వరల్డ్ రోల్  ఆఫ్ రివల్యూషన్ (1946)
21) మెనీ మోనో గ్రాఫ్స్ ఆఫ్ పార్లమెంటరీ డెమాక్రసీ ఇన్ ఇండియా అండ్ ఎబ్రాడ్
22) ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ విలేజస్ - 2 భాగాలు.
రంగాజీ తన ౭౫ ఏళ్ళ ప్రజా జీవితంలో - అధికార పదవులను ఏమీ ఆశించలేదు. తను అనేక ప్రజా సంస్థల్లో, వివిధ హోదాల్లో నైతిక స్థాయిని నిలబెట్టి, గాంధేయ వాదిగా విప్లవ పంధాలో ప్రజానాయకుడిగా ప్రఖ్యాతిగాంచారు. సంపూర్ణ జీవితం గడిపి ప్రపంచంలోనే ఒక ఉత్తమ అగ్ర్గామి పార్లమెంటేరియన్గా విఖ్యాతి గాంచారు.
ఆయన నిర్వహించిన గౌరవ బాధ్యతలు కొన్ని:
1926-30  ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ఆర్ధిక సలహాదారు మరియు స్పెషల్ ఆఫీసరుగా ఉన్నారు.
1927-30  ప్రధాన ఆచార్యునిగా, ఆర్ధిక శాస్త్రంలోను, రాజకీయ శాస్త్రవిభాగంలోను మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉన్నారు.
1928-30 అఖిల భారత వయోజన విద్యా సంస్థ- వ్యవస్థాపక ఉపాద్యక్షులు.
1930       కేంద్రశాసన సభకు ఎన్నికయ్యారు.
1930-51   అఖిల భారత కాంగ్రెసు సభ్యులు
1933        రాష్ట్ర కేంద్రభూమి తనఖా బ్యాంకు డైరెక్టరు
1935-45  కేంద్ర శాసనసభలో ఉన్నారు.
1945-51  ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్నారు.
1947-51  అఖిల భారత కాంగ్రెసు కార్యవర్గ సభ్యులు.
1933        ఇండియన్ పెజెంట్ ఇన్ స్టిట్యూట్ - నిడుబ్రొలు కు ప్రధానాచారులుగా ఉన్నారు.
1935     ఆల్ ఇండియా కిసాన్ మహాసభ- ఫైజపూర్ కు అధ్యక్షులు.
1936       ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెసు మహాసభకు -( ఢిల్లి), అలాగే 1946,1949,1951,1952 సంవత్సరాలలో అధ్యక్షులుగా నిర్వహించారు.
1936       ఆల్ ఇండియా కిసాన్ సమ్మేళన్ కు వ్యవస్థాపకులుగా,  అధ్యక్షులుగా ఉన్నారు.
1940    అవిభక్త మద్రాసు రాష్ట్రంలో- రాష్ట్ర చేనేత సహకార సంఘాధ్యక్షులు.
1947      అఖిల భారత రూరల్ పీపుల్స్ ఫెడరేషన్ను స్థాపించారు.
1946-50 కేంద్ర శాసన సభలో ఉన్నారు.
1947-50 ఆర్ధిక సంఘంలో ఉన్నరు.
1947-51 ప్రొవిజనల్ పార్లమెంట్ లో ఉన్నారు.
1950-51 ఎస్టిమేట్సు కమిటీలో ఉన్నారు.
1947-85  అఖిల భారత చేనేత కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్నారు.
1952-56  రాజ్యసభకు ఎన్నికైనారు, కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు.
1957-62  రెండవ లోక్ సభలో పార్లమెంటుకు ఎన్నిక.
1958-69 చైర్మెన్ - పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ
1962-67 మూడవ లోక్ సభకు ఎన్నిక.
1967-70   నాల్గవ లోక్ సభకు ఎన్నిక.
1967-68  పార్లమెంటులో అతిపెద్ద ప్రతిపక్ష గ్రూపుకు నాయకుడుగా ఉన్నారు.
1977        జాతీయ వ్యవసాయ సమాఖ్య వ్యవస్థాపక అద్యక్షులు.
1977-79  రాజ్యసభకు ఎన్నిక.
1980-84, 1984-89,  మరియు 1989లో మరలా పార్లమెంటుకు ఎన్నిక.
1980-90  పార్లమెంటరీ కాంగ్రెసు పార్టీకి ఉపనాయకులుగా వ్యవహరించారు.
చట్టసభలైన పార్లమెంటు, రాజ్యసభల్లో ప్రజల కొరకు నిర్విరామంగా కృషిచేస్తూ, బయట కూడా అనేక కార్యకలాపాలు రైతు గ్రామీణ జనాలకై నిర్వహించి అవిశ్రాంతంగా పోరాడారు. అంతేగాక అనేక అంతర్జాతీయ సభల్లోను, వేదికలపైన ఉపన్యసించి తమ అమూల్య సలహాల నిచ్చారు.
1946         ప్రపంచ వ్యవసాయదారుల మహాసభ లండనుకు భారత ప్రతినిధిగాను,
1947       కోపెన్ హాగన్ లో 1949- గల్ఫ్ దేశాల్లోను, కెనడాలోను   1959 భారత్ కు ప్రాతినిధ్యం వహించారు.
1948       ప్రపంచ కార్మిక సదస్సు, శాన్ ఫ్రాన్సిస్ కోకు భారత ప్రతినిధి.
1949        అంతర్జాతీయ వ్యవసాయదారుల సమస్యలు చర్చించడానికి అమెరికా అధ్యక్షులు హారీట్రూమన్తో సమావేశం, మరియు గాంధి శాంతి సంఘం సభ్యులుగా అనేక దేశాల్లో గాంధీ సందేశాన్ని        
                 వినిపించారు. గాంధీ స్మారక నిధి సంస్థకు అద్యక్షులుగా ఉన్నారు.
1957       సహకార కాంగ్రెసు- బల్గేరియాకు- భారత ప్రతినిధి.
1954-69  ఉమ్మడి దేశాల పార్లమెంటరీ మహాసభ ప్రతినిధి.
1969      గాంధీ శతజయంతి ఉత్సవాల ప్రతినిధిగా సూడాన్, ఈఇప్టు, ఫ్రాన్సు, యు,కె, దేశాల్లో పర్యటించారు.
1983      అలీన రాజ్యాల సభ- ఢిల్లీకి- భారత ప్రతినిధి వర్గ సభ్యులు.
              ఇండియా- శ్రీలంక ఒడంబడికపై సంతకాలు చేయడానికి ప్రతినిధి.
               ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంతిమ క్రియలకు భారత ప్రతినిధి.
(కాకతీయ నాయకులు - ఎన్.జి.రంగ, గ్రంధాన్ని తెలుగులోనికి అనువదించిన డా. జక్కంపూడి సీతారామారావు గ్రంధం నుండి సేకరణ....)
 

రంగాజీ - జీవితంలో ప్రధాన ఘట్టాలు
(షష్టిపూర్తి వరకూ..)

1900      ..     ..    జననం.
1905                 అక్షరాభ్యాసం
1910                  మాతృవియోగం. విద్య పట్ల శ్రద్ధ, ఆంధ్రోద్యమం వంగ విభజనోద్యమాలను గురించి విని ఉత్తేజితులయ్యారు. చరిత్ర, సంస్కృతి రాజకీయ గ్రంధ పఠనం
1914                  హైస్కూలు ప్రవేశం, తాను చదివిన గ్రంధాల సారాంశం తోటి విద్యార్ధులక భోధించుటకు ‘అధ్యయన తరగతుల’ నిర్వహణ.
1915                  “ఆంధ్ర సరస్వతి గ్రంధాలయ(నిడుబ్రోలు) పునరుద్ధరణ, పత్రికా పఠన ప్రారంభం
1916                   నాటి సమస్యలపై గ్రంధాలయంలో చర్చల నిర్వహణ, నిరక్షరాస్యులకు పత్రికా వార్తలు వినిపించుట.
1917                   వీరేశలింగంగారి గ్రంధాల పఠణం. ఇంగ్లీషులో తొలిసారిగా వీరేశలింగంగారిపై 50 పేజీల వ్యాస రచన.
1918                   సంఘసంస్కరరణాభిలాష. వరకట్న నిషేధం, స్త్రీ పునర్వివాహం, జంతుబలుల నిషేధం, పురోహితుల అక్రమ చర్యలపై ప్రతిఘటన-తీవ్రప్రచారం.
1919                 విద్య, గ్రంధాలయోద్యమం ప్రచారం, వయోజన విద్యాకేంద్రాలు, రాత్రి పాఠశాలల నిర్వహణ, నెల్లూరు, విజయవాడ ఆంధ్ర మహాసభలకు హాజరు- పలువురు ఆంధ్ర ప్రముఖులతో పరిచయం,        వర్ణ వ్యవస్థ నిర్మూలన, అస్పృస్యతా నివారణకావాలని తీవ్ర ప్రచారం- ఆధునిక రాజకీయ సారస్వత పఠనం, హిందూ, ముస్లిం, క్రైస్తవ మతగ్రంధాల పఠనం, గ్రామ ఆర్ధిక సమస్యలపై మక్కువ- భూమి సర్వెప్లానుల తయారీలొ తర్ఫీదుపొంది, కరణాల అక్రమ లెక్కలను గురించి కలెక్టరుతో వ్యవహారం నడిపి రైతులకు తోడ్పడుట.
1920                ‘స్కూల్ ఫైనల్’ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. వివాహం, గుంటూరు ఎ.సి కాలేజిలో ఇంటర్ క్లాసులో చేరారు. “రైతు” వారపత్రిక స్థాపన. ఉన్నతవిద్యకు ఇంగ్లండుకు ప్రయాణం, ఆక్సుఫర్డులో వెలగపూడి రామకృష్ణ. కార్ లైల్, బ్రెయల్సుఫర్డు, హాబ్సన్, ఆర్నాల్డు, లాస్కీలతో చెలిమి.
1922                 ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మున్నగు యూరపు దేశాల పర్యటన. ఆక్సుఫర్డులో ‘ఇంటర్నేషనల్ లేబర్ గ్రూప్" కార్యదర్శిగా ఎన్నిక.
1923                   స్వదేశాగమనం, ‘రైతాంగ ఎన్నికల ప్రణాళిక’ రచన. ప్రప్రధమంగా అప్పికట్లలో జిల్లా రైతు మహాసభ నిర్వహణ, నిడుబ్రోలులో ‘ప్రప్రధమ వ్యవసాయ కూలీ మహాసభ’. మొదటసారిగా మహాత్ముని సందర్శనం.
1925                 యుక్త వయస్కులందరికి వోటుహక్కు ఉండాలన్న రంగాగారి వాదనకు గాంధీజీ ఆమోదం. చేనేత సమస్యల పరిశీలన, చేనేత సంఘాల  స్థాపన.
1926    ``Economic organisation of Indian villages; vol.1 

గ్రంధరచన.                                                                                                                
1927                  పచ్చయప్ప కళాశాల (మద్రాసు) లో నెలకు 5౦౦రూపాయల వేతనంతో ప్రధానాచార్యులుగా నియామకం. ‘విద్యార్ధుల గ్రామ పునర్నిర్మాణ సంఘ’ స్థాపన; ఆంధ్ర రాష్ట్ర, అఖిలభారత విద్యార్ధి మహాసభలకు ఆహ్వానసంఘాధ్యక్షత.
1923-27              మూడుసార్లు యూరపు పర్యటన ( భారతీదేవి గారితో కలసి), రైతుకూలీ సంఘాల నిర్మాణం, ఆర్ధిక పరిశోధనలు, వ్యాసరచన.
1926-27             ఒంగోలు తాలూక కరువు నివారణ కృషి.
1928                  ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం, జమీందారీ రైతు సంఘాల స్థాపన, ‘రాష్ట్ర అటవీ పంచాయతీ సంఘ’ నిర్మాణం, రైతులలో పోటీ భావం పెంచేందుకు ‘పశువ్యవసాయక వస్తు ప్రదర్శన శాలల’ ఏర్పాటును ప్రోత్సహించుట.  ``The Economic organisation of Indian villages; vol-2,` The Tribes  of Nilagiries''   
రచనలు.                                                                           1929    ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో ఆర్ధిక పరిశోధనలు.
1927-29              మద్రాసుప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా సేవలు.
1930                   “రౌండుటేబిల్ సభ” సమయంలో ఇంగ్లాండు వెళ్ళి, బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేశారు. కేంద్ర శాసనసభ (ఢిల్లీ) కు ఎన్నిక - పచ్చయప్ప కళాశాలలో ‘ఆచార్య’ పదవికి రాజీనామా. `The Hand-Loom Weaving Industry''    అను గ్రంధ రచన.
1931                     వెంకటగిరి ఎస్టేటులో ‘అటవీ సత్యాగ్రహ’ నిర్వహణ, రైతు రక్షణ సంఘ స్థాపన, రీ సెటిల్మెంటు ఆందోళన, అరెస్టు. ఏడాది జైలు శిక్ష. జైలులో “ఆధునిక రాజ్యాంగములు” గ్రంధరచన. జమీన్ దారీలు రద్దుకావాలని, భూమిశిస్తు పూర్తిగా రద్దయి ఆదాయపు పన్నులు రావాలని ఆందోళన, రైతాంగ సేవకుల శిక్షణ శిబిరాల స్థాపన, లండన్ నుంచి “ప్రపంచ పతిత ప్రజలారా ఏకము కండు” అను నినాదం.
1932                    ‘‘మాలపల్లి” నవలపై వ్యాఖ్యానం, హరిజన నాయకుడు అను సాంఘిక నవలా రచన.
1933                      ఆంధ్ర జమీందారీ మహాసభాధ్యక్షత.  ``Economic conditions of Zamindari Ryots''    అను గ్రంధ రచన. రైతాంగ గ్రంధమాల స్థాపన. ``Andhra Economic Review''               ప్రచురణ ప్రారంభం. ప్రధమ పశుప్యవసాయ వస్తు ప్రదర్శన శాల (గోవాడ) కు ప్రారంభోత్సవం, ఆంధ్ర మహాసభ అద్యక్షులు(ఏలూరు) ‘రామానీడు విద్యాలయ’ స్థాపన ( నిడుబ్రోలు)- గాంధీ మహాత్మునిచే ప్రారంభోత్సవం. దర్శి తాలూకాలో అగ్నిప్రమాదానికి గురైన పేదలకు సహాయ కార్యక్రమాల నిర్వహణ.
1934                     “రైతాంగ విద్యాలయం (నిడుబ్రోలు) స్థాపన. “రైతు రాజ్య” నినాదం, పూనాలో కాంగ్రెసు సోషలిస్టుపార్టీ నిర్మాణం. ``Labour in South India'', ``AgriculturalIndebtedness''  రచన. “రైతు భజనావళి” ప్రచురణ. “జమీన్ రైతుల కనీస కోర్కెల ప్రణాళిక” ప్రకటన.
1926-34           పెదవడ్లపూడి-అప్పాపురం, పాతూరు ప్రాజెక్టుల నిర్మాణాందోళన. ప్రణాళికాపద్దతిలో నిర్మాణ కార్యక్రమాలకు పూనుకొనునట్లు  రైతులకు ప్రోత్సాహం.
1935                ఇండియా నలుమూలలా పర్యటన.భారత్ కిసాన్ సభ నిర్మాణం. కేంద్ర శాసన సభలో ‘కర్షక బృంద’ నిర్మాణం. రాయలసీమ క్షామనివారణ కృషి. కేంద్ర శాసనసభలో రైతు సంఘాల బిల్లు ప్రతిపాదన. ‘దక్షిన భారత వ్యవసాయ కూలీ సంఘ’ నిర్మాణం. ‘రైతు భజనావళి’ ఇంగ్లీషులో ప్రచురణ. రైతు , కూలీ రాజ్య నినాదం. అఖిల భారత రైతు సేవకుల సభకు (మద్రాసు) అద్యక్షత.
1936                ఫైజుపూర్ కిసాన్ సభాద్యక్షత. ``Modern Indian Peasant''  రచన. ‘వాహిని’ పత్రిక స్థాపన. లక్నో అఖిల భారత రైతు సమ్మేళనాధ్యక్షత. ఆంధ్ర వయోజన విద్యా సంఘ స్థాపన. ఆంధ్ర రాష్ట్ర చేనేతమహాసభ ఉపాద్యక్షత. ‘రజక సంఘాల’ నిర్మాణ ప్రోత్సాహం.
1937     ``Kisan Speaks''  రచన. రైతు రక్షణ యాత్రకు ( ఇచ్చాపురమ్ మొదలు మద్రాసు వరకు) ప్రారంభోత్సవం. అఖిల భారత వయోజన విద్యాసభ నిర్వహణ. రాయలసీమ రైతాంగ విద్యాలయం( గిద్దలూరు) అఖిల భారత చేనేత సేవకుల సభ (కలకత్తా) నిర్వహణ. `Peasants and Congress''  రచన. ఆంధ్ర దేశ ఫారెస్టు రైతుల సభాధ్యక్షత(కంభం).
1938                కర్షక కవుల సన్మానం, రైతు రాజ్య ప్రచారం, స్వదేశీ సంస్థాన రైతు సమస్యల పరిశీలన,  ``Economics of Indian villages''    రచన.  ``Indian Adult Education''  రచన. వీర సంస్మరణ మందిర(కొవ్వురు) ప్రారంభం. 
  గ్రంధ రచన. ఆంధ్ర విద్యార్ధి మహాసభాద్యక్షులు(విజయవాడ). దక్షిణ భారత గ్రామ సేవకుల సభ (కోయంబత్తూరు) అద్యక్షత.
1939                రంగూన్ లో బర్మా కూలీ మహాసభకు అధ్యక్షత, బర్మా పర్యటన. రైతాంగ విద్యాలయం(హైదరాబాద్) ఆంధ్ర విద్యార్ధి మహాసభాధ్యక్షులు(గుంటూరు), తమిళనాడు రాష్ట్ర విద్యార్ధి మహాసభాద్యక్షులు. ``History of the Kisan Movement''  రచన. ``Kisan Hand Book''  రచన.
1940                మందసా కాల్పులు. మద్రాసు వదలి పోవాలన్న ప్రభుత్వ ఆదేశాన్నిధిక్కరించి అరెస్టు చేయబడి, ఏడది జైలు శిక్ష అనుభవం.
1941              ‘రైతు కూలీ ప్రజా రాజ్య ’ నినాదం. రైతు కూలీ ప్రజా పార్టీ నిర్మాణానికి ధీసిస్ రూపొందించుట.
1942                ‘కలోనియల్ అండ్ కలర్డ్ పీపుల్స్ ఫ్రీడం ఫ్రంట్’ నిర్మాణం. ‘క్విట్ ఇండియా ఉద్యమం, అరెస్టు, జైలులో ‘పాకిస్థాన్’ గ్రంధ రచన.
1942-44 ``Kisans & the Communists'' ``World role of the National Revoltions; outlines of National Revolutionary path, ``Revolutionary Peasants, Colonial & Coloured people's Freedom  Front'',                                                                    రచన(జైల్లొ)
1944             ‘ప్రజాస్వామిక రైతు కూలీ ప్రజారజ్య’ నినాదం.
1945             ఆంధ్ర విద్యార్ధి కాంగ్రెసు మహాసభల (బందరు) ప్రారంభం. కేంద్ర శాసన సభకు పోటీ లేకుండా ఎన్నిక. Gandhian plan  రచన. “అఖిల భారత గ్రామీణ ప్రజాసంస్థ” స్థాపన. అఖిల భారత చేనేత సంఘ స్థాపన. గాంధీజీని సందర్శించి రైతు కూలీ  ప్రజా రాజ్య సిద్ధాంతానికి ఆశీస్సులు పొందుట. రైతాంగ విద్యాలయం (నిడుబ్రోలు) పౌరసత్వ కళాశాల (యడ్లపల్లి) ప్రధానాచార్యులు. అఖిల భారత చేనేత కాంగ్రెసు మహాసభాద్యక్షత (నాగపూర్), విశాఖ కరవు నివారణ కృషి, మద్రాసు నగర విద్యార్ధి సభాధ్యక్షత, మైసూరు నగర విద్యార్ధి కాంగ్రెసు మహాసభాద్యక్షత(బెంగుళూరు) పౌరసత్వ కళాశాల(బొంబాయి) గాంధీజీ తో భేటీ.
1944-45       రాయలసీమ క్షామ నివారణ కృషి.
1946            కేంద్ర శాసన సభ కార్యదర్శి, ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షులుగా ఎన్నిక, అంతర్జాతీయ వ్యవసాయోత్పత్తిదారుల సభకు (కోపెన్ హాగన్ ) ఇండియా ప్రతినిధి. చెన్న రాష్ట్ర చేనేత సహకార సభాద్యక్షత,(మద్రాసు) బర్మా కాందిశీకుల సభ (బారువ), ద్వితీయ బెంగాలు విద్యార్ధి కాంగ్రెసు మహాసభాద్యక్షత(కలకత్త). లండను ప్రయాణం. యూరపు పర్యటన. భారత కిసాన్ సమ్మేళనసహ అద్యక్షత(ఢిల్లీ). ఆఫ్రికా ప్రతినిధుల సభకు (మాంచెష్టరు) హాజరు.
1947          అఖిల భారత చేనేత సభాద్యక్షత(బొంబాయి), అఖిల ఆసియా రైతు యువజన ప్రతినిధుల సభ(ఢిల్లీ)
1948         ఆంధ్ర కాంగ్రెసు అద్యక్షులుగా తిరిగి ఎన్నిక. అంతర్జాతీయ కార్మిక సంఘ సమావేశాలకు (శాన్ ఫ్రాన్సిస్కో) హాజరు- అమెరికా పర్యటన. ఉత్తరప్రదేశ్ యువజన సంఘాద్యక్షత(షికోవాబాద్)
1949         గ్రామాలలో సేవాదళాల నిర్మాణం, కంట్రోళ్ళ వ్యతిరేకోద్యమం.
1950         ఆలిండియా ఎకనామిక్ కాన్ఫరెన్స్ (వాల్తేరు) ప్రారంభోపన్యాసం.
1951         కాంగెసు నుంచి బయటకు వచ్చారు. భారత కృషికార్ లోక్ పార్టీ నిర్మాణం. నందికొండ ప్రాజెక్టుకు ఆందోళన.
1952       రాజ్య సభకు ఎన్నిక, అగ్రికల్చరల్ ఫైనాన్స్ కార్పొరెషన్ ఏర్పాటు చేయాలని ఆందోళన, రైతాంగ విద్యాలయం(చల్లపల్లి). ప్రపంచ పార్లమెంటు సభ (అట్టావా) కు ఇండియా ప్రతినిధి వర్గంతో వెళ్ళడం, కెనడా, ఇంగ్లండు దేశాల పర్యటన.
1954         అంతర్జాతీయ రైతు మహాసభ (న్యూయార్కు) లో ప్రత్యోకోపన్యాసం. అంతర్జాతీయ బియ్యం ఉత్పత్తిదారుల సమావేశానికి(టోకియో) హాజరు. ఆసియా పార్లమెంటుసభకు (టోకియో) హాజరు. అమెరిక, ఇంగ్లండు, జపాన్ దేశాల పర్యటన.
1955        ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో నియంతృత్వ శక్తులను ప్రతిఘటించుటకు, ప్రజాస్వామ్యానికి శాశ్వత రక్షణ కల్పించుటకు ఐక్యకాంగ్రెసు నిర్మాణం, ఎన్నికల ప్రచార కార్యక్రమం. 48 రోజుల పర్యంతం ఐక్యకాంగ్రెసు విజయానికి ఆంధ్ర దేశామంతటా పర్యటన.
ఐక్య కాంగ్రెసు అఖండ విజయానంతరం ప్రజల తీర్పును  మన్నించి, జాతీయ ప్రజా స్వామ్య శక్తుల సమైక్యత దృష్ట్యాభారత కృషీకార్ లోక్ పార్టీని జాతీయ కాంగ్రెసులో సంలీనం చేయుట.
  ``Towards World Peace''  గ్రంధ ప్రచురణ.
భారత పార్లమెంటరీ రాయబార వర్గ సభ్యులుగా సోవియట్ రష్యా, యుగొస్లోవియా మొదలగు ఐరోపా దేశాల పర్యటన.
రష్యా, యుగొస్లోవియా దేశాల పర్యటన అనుభవాలను గురించి భారత పార్లమెంటుకు తమ నివేదిక సమర్పణ.
1956        గ్రామీణ- పట్టణాల మధ్య సమదృష్టికై ప్లానింగ్ కమిషన్ కు సూచన- రైతాంగంపై అధిక పన్నులకు నిరసన- పదవ అఖిల భారత చేనేత కాంగ్రెసు సభాద్యక్షత- చేనేతవారి యిబ్బందులపై ప్రెసిడెంటు, ప్రధాని నెహ్రూ వద్దకు రాయబారం. ఉయ్యూరులో నీరా ప్లాంటుకు ప్రారంభోత్సవం, దివి తాలూకా రాజకీయ సభాద్యక్షత, Plan & Peasant   రచన. నాగార్జున సాగర్ రైతు మహాసభకు ప్రారంభకులు(వినుకొండ), నెల్లూరు జిల్లా కిసాన్ సమ్మేళన్ సభాద్యక్షత, అంతర్జాతీయ రైతు మహాసభలో (పారిస్) పాల్గొనుట, పాలస్తీనా, పశ్చిమ జర్మని, ఇంగ్లండు, స్కాట్లండు  పర్యటన,Credo of world peasantry  (రైతాంగ మూలసిద్ధాంతం) రచన.
1957          తెనాలి నియోజకవర్గంనుండి పార్లమెంటుకు కాంగ్రెసు అభ్యర్ధిగా పోటీ, ఇరవై ఎనిమిది వేల మెజార్టీతో ఎన్నిక, గొల్లపూడి, జడదీవి భారత్ సేవక్ సమాజ్ శిబిరాల ప్రారంభం.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా ఎన్నిక.
విజయవాడలో కాంస్య విగ్రహ ప్రతిష్టాపన. జార్జి డిమిట్రోతో ఆంధ్రలో పర్యటన, ‘చిత్రజీవితం’ ‘ఆచార్య రంగా’ గ్రంధాల కృతి స్వీకరణ. ‘యువకర్షక’ వార్షికోత్సవ అధ్యక్షత, గ్రామీణ ప్రజాసంఘాల సమాఖ్యకు అధ్యక్షులుగా ఎన్నిక. నెల్లూరు జిల్లా కిసాన్ సమ్మేళన సభలకు అధ్యక్షత.
1958      నాగపూర్ కాంగ్రెసు సహకార వ్యవసాయ ధోరణికి ప్రతిఘటన, పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మెన్. ఢిల్లీలో అఖిలభారత కిసాన్ సమ్మేళన మహాసభాధ్యక్షత.
1959       స్వతంత్ర వృత్తుల ప్రజల గోష్టి, నిడుబ్రోలులో- ఆంధ్రప్రదేశ్ సహకార యూనియన్ సభ్లో పాల్గొనుట, రైతుల ఆదాయాలకు మాత్రమే పరిమితి కూడదని 108 మంది పార్లమెంటుసభ్యుల తరఫున ప్రధానికి నివేదిక, రాయబారం, పంజాబు రైతు మహాసభాపీఠంనుండి కాంగెస్ రైతాంగవిధానాల ప్రతిఘటన, Self-Employed sector   రచన, వ్యవసాయ సమస్యలపై నెహ్రూతో చర్చ- పార్లమెంటరీ పార్టీ కార్యదర్శికత్వానికి రాజీనామా- కాంగ్రెసుసభ్యత్వానికి రాజీనామా. Why Ranga Risigns, Sterm bursts over peasantry    రచన. సహకార- సమిష్టి వ్యవసాయానికి వ్యతిరేకాందోళనోద్యమం- వేమూరులో సభ, నూతన రాజకీయ పక్ష్నిర్మాణాలోచనలు.-మద్రాసులో రాజాజీ పిలుపుపై ప్రముఖుల సమావేశం నిర్ణయం- మేదరమిట్లలో రైతాంగ విద్యాలయాచార్యత్వం, నూతన పార్టీ నిర్మాణానికి దేశమంతటా హర్షం- ఆంధ్ర స్వతంత్రపార్టీ నిర్మాణ సమావేశం నిడుబ్రోలులో- బొంబాయిలో అఖిలభారత స్వతంత్ర పార్టీ అవతరణ. అధ్యక్షులుగా ఏకగ్రీవ ఎన్నిక.
1960        మధ్యప్రదేశ్ కిసాన్ సంఘ సభలలో(భోపాల్) ప్రారంభోపన్యాసం, బెంగుళూరులో కేంద్రపార్టీ సమావేశాలలో పాల్గొనుట, ఆంధ్రలో రాజాజీతోపాటు పర్యటన- పార్టీ నిర్మాణ కృషి, గంజాంజిల్లా పార్టి సభలో(బరహంపూర్) ఉపన్యాసం, కలకత్తాలో బహిరంగసభ, పాట్నాలో అఖిలభారత స్వతంత్రపార్టీ మహాసభల అధ్యక్షత- గాంధీయిజం- నెహ్రూయిజం మధ్య తేల్చుకోవాలని ప్రజలకు హెచ్చరిక, రాజాజీతోపాటు ఉత్తర భారతంలో దర్భాంగ, చోప్రా, భాటియా, వారణాసి, అలహాబాదు, కాన్పూరు, లక్నోపర్యటన. పామర్రు బహిరంగ సభ, తెలంగాణాలో పర్యటన, భూమిపై హక్కు రైతుకు ఉండాలని వెంటప్రగడ సభలో ఉద్ఘాటన, నెల్లూరు జిల్లా, గుంటూరుజిల్లాల్లో పార్టీ కార్యక్రమ ప్రచారం, స్వతంత్ర పార్టీ వార్షికోత్సవం(మద్రాసు) లో ప్రసంగం, బాపట్ల తాలూకా పర్యటన, స్వతంత్రపార్టీ  వార్షిక సమావేశాలలో (బొంబాయి) పాల్గొనుట.
పార్టీ జనరల్ కౌన్సిల్లో కాంగ్రెసు విధానాల నిరసన, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణానికై, రైళ్ళ రాకపోకల విషయమై ప్రభుత్వానికి విజ్ణప్తి, పంచాయతీలు రాజకీయాతీతం కావాలని, తృతీయ ప్రణాళికను దేశం తిరస్కరించాలని పార్లమెంటులో ఉద్ఘాటన, సవరణ ప్రతిపాదన, ఆంధ్రలోని కరువు పరిస్థితులపై తక్షణ సహాయానికి అభ్యర్ధన, ఢిల్లీ ఆంధ్ర సంఘ రజతోత్సవాలకు అధ్యక్షులు. నవంబరు ఏడవ తేదిన షష్టిపూర్తి.


(ఆచార్య రంగా షష్టిపూర్తి, వాహిని రజతోత్సవాల ప్రత్యేక సంచిక- నవంబరు 1960 నుండి)

జాతీయ రైతాంగ ఉద్యమం - ఆవిర్భావ వికాసాలు

By ఎన్, రంగా

1918లో మా ఊరు నిడుబ్రోలులో కమ్మవారి దక్షిణ భారత మహాసభ జరిగింది. వారంతా పట్టాలున్న రైతులు. వారిలో చాలామంది నిరక్షరాస్యులు. తుమ్మల సీతారామమూర్తి ఆ సభలోనే తొలి ప్రసంగం చేశారు. ఒక రాష్ట్రస్థాయి రైతుల మహాసభలో నేను ప్రధాన ప్రసంగం చేయటం అదే మొదటిసారి. ఈ మహాసభ అనంతరం మిగిలిన నిధులతో ఒక తెలుగు వారపత్రిక పెట్టాలని నిర్ణయించారు. దానికి 'రైతు పత్రిక' అని పేరు పెట్టాలన్న నా సూచన అందరి ఆమోదాన్ని పొందింది. బీహారులోని చంపారణ్ రైతులు, గుజరాతులోని కైరా, బొర్సాద్ రైతుల హక్కుల సాధనకు మహాత్మాగాంధీ సాగించిన పోరాట రీతి నన్ను ప్రత్యేకించి ప్రభావితం చేసింది.
ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రాల్లో అత్యంత ఉన్నత స్థాయిలో ప్రవీణుడనై 1923లో నేను అక్స్ ఫర్డ్ నుంచి తిరిగి వచ్చాను. అక్కడ బ్రిటీష్ కమ్యూనిస్టులతో, సోషలిస్టులతో ముఖ్యంగా గిల్డ్ సోషలిస్టులతో సాహచర్యం ఉండేది. యూరప్ లో రైతు సహకార సంస్థల గురించి అధ్యయనం చేశాను. అయితే నేను వచ్చేనాటికే రైతుల పన్నుల నిరాకరణోద్యమం తగ్గుముకం పట్టినట్టు గమనించాను. నేను ఇంగ్లండ్ నుంచి రాగానే ఎందరో కాంగ్రెసు వాదులు నా చుట్టూ చేరారు. రైతు పత్రికలో ప్రచురితమైన నా వ్యాసాలు వారినెంతో ప్రోత్సాహపరిచాయి. ఒక కిసాన్ రాజకీయ వేదికను ఆరంభించి కాంగ్రెసు రాజకీయ ధ్యేయాలు, ఖాదీ, కుటీర పరిశ్రమలు వంటి గాంధీవాద నిర్మాణ కార్యక్రమం, రైతుల ఇతర డిమాండ్లు ప్రాతిపదికగా రానున్న ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టవలసిందిగా నా మిత్రులందరూ నన్ను కోరారు. సి.ఆర్.దాస్, మోతీలాల్ కమిటీ శాసన సభల ప్రవేశానికి అనుకూలించినప్పటికీ, ఆంధ్ర కాంగ్రెసు నాయకులు మాత్రం ''కౌన్సిళ్ళ బోయ్ కాట్'' ఛాందస వైఖరులను విడనాడటానికి తిరస్కరించారు. 1923 డిసెంబర్లో కాకినాడ కాంగ్రెస్ మహాసభ ఆహ్వాన సంఘ సభ్యులలో ఒకడిగా నన్ను ఎన్నుకొన్నారు.
శాసన సభల కాంగ్రెస్ ప్రవేశంపై నిషేధాన్ని ఈ మహాసభలో కొనసాగించలేదు. ప్రముఖ గాంధేయవాది సీతారమాశాస్త్రి ఆశీస్సులతో రైతు రాజకీయ వేదిక తరపున అభ్యర్థుల్ని నిలబెట్టాలని మేం నిర్ణయించాం. మద్రాసు కౌన్సిల్ కు ముగ్గురిని, కేంద్ర శాసన సభకు ఒకరిని పోటీలో నిలబెట్టాం. గుంటూరు జిల్లా నుంచి రాష్ట్ర శాసన సభకు ఇద్దరు, కేంద్ర శాసన సభకు ఒకరు ఎన్నికయ్యారు. మౌంట్ - ఫోర్డ్ రాజ్యాంగ సంస్కరణల వల్ల పెరిగిన ఓటర్లలో అత్యధికులు రైతులే. వారంతా కాంగ్రెసు పక్షాన నిలిచారని ఈ ఎన్నికలు నిరూపించాయి. గాంధీజీ, కాంగ్రెసులోని ఇతర ముఖ్య నాయకులు ఇంకా జైళ్ళలోనే ఉన్నప్పటికీ ఈ ఫలితాలు లభించాయి. కాంగ్రెసు నాయకులు జైళ్ళలో ఉండటం వల్ల ఏర్పడిన ఖాళీని రైతు వేదిక ప్రతినిధులు భర్తీ చేయడం ఇక్కడ గమనార్హం. మా జిల్లాలో నాలుగు స్థానాలలో బ్రిటీష్ అనుకూల జస్టిస్ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే పొందగలిగింది. భూమిశిస్తు తగ్గింపు, కుటీర పరిశ్రమల అభివృద్ధి కుల ప్రాతిపదిక కాకుండా వర్గ ప్రాతిపదికపై గిల్డు తరహా సహకార నిర్మాణం, అస్పృశ్యతా నివారణ, హరిజనులకు ( అప్పుడు వారిని పంచములు, లేదా ఆది ఆంధ్రులు అనేవారు) ఇళ్ళ స్థలాలు, భూములు పంచడం, జాతీయ భావాలనుకూల విద్య మొదలైనవి మా రైతు వేదిక ప్రధాన ఆశయాలు.
మా ఆర్థిక సామాజిక వైఖరులు మహాత్మాగాంధీ, వీరేశలింగం, ఉన్నవల వైఖరులే. భిన్న కులాలవారు ఆర్థిక వృత్తుల ఆధారంగా సహకార సంస్థలుగా ఏర్పడి, తమ సామాజిక ఆర్థిక మెరుగుదలకు గిల్డు సోషలిజం ప్రాతిపదికగా సమైక్యంగా కృషి చేసేటట్టు ప్రజల్ని ఒప్పించాలన్న నా ప్రతిపాదనలను మా జిల్లాలోని కాంగ్రెసు నాయకులు అంగీకరించారు. రైతులకు కనీస ధరలు, కార్మికులకు కనీస వేతనాలు సాధించేందుకు పార్టీ పనిచేయాలి. ఈ విధమైన కార్యక్రమాన్ని రూపొందించి ఒక వేదికను ఆవిష్కరించేందుకు రైతుల మహాసభ ఒక దానిని, స్కూలులో నా సహ విద్యార్థి ఆచంట నాగయ్య తోడ్పాటుతో, అప్పికట్లలో మేం నిర్వహించాం. భారతదేశం మొత్తంమీద ఇలాంటి మహాసభ జరగటం ఇదే ప్రథమం.
ఎన్నికలలో గెలుపు సాధించిన వెంటనే మా స్వగ్రామం నిడుబ్రోలులో వ్యవసాయ కార్మికుల మొదటి మహాసభను మేం నిర్వహించాం. రాజకీయంగా చైతన్యవంతులు అవుతూ, ఒక శక్తిగా ఆవిర్భవిస్తున్న ఆది ఆంధ్రులనూ, తదితర కార్మికులనూ కాంగ్రెసు వెనుక సమీకరించే దృష్టితో ఈ సభను నిర్వహించాం. అయితే ఆది ఆంధ్రులలోని చదువుకున్న వారిలో అత్యధికులు క్రిష్టియన్ మిషనరీల బలమైన ప్రభావాల కింద ఉండటంవల్ల ఈ సమావేశానికి హాజరైన కార్మికులలో చీలికలు సృష్టించారు.
గ్రామీణ కార్మికులలో ట్రేడ్ యూనియన్ భావాలు అభివృద్ధి పరచాలన్న నా ఆశ ఆ విధంగా భగ్నమైంది. అయితే ఇళ్ళ స్థలాలు, గ్రామీణ కార్మికులకు ఇళ్ళ నిర్మానానికి సహాయం డిమాండ్ చేయాలన్న నా ప్రతిపాదనను అందరూ హర్షించారు. అయితే స్వరాజ్యం ఇవ్వాలనే డిమాండ్కూ, జాతీయ కాంగ్రెసుకి తోడ్పాటు విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. మా జిల్లాలోని వ్యవసాయ కార్మికులలో అత్యల్ప సంఖ్యాకుల తోడ్పాటు కూడా ఈ మహాసభ పొందలేకపోయింది. వ్యవసాయ కార్మికులు తమ మానసిక హైన్యతా భావం నుంచి బైట పడటానికి సిద్ధంగా లేరని, అగ్రకుల రైతుల దాడులు ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతున్నారి, స్వశక్తీ ఆర్గనైజేషన్ల కృషి ఆవశ్యకతను వారు ఇంకా గుర్తించలేదని బ్రిటీష్ అనుకూల విధేయులైన క్రిష్టియన్లతో పాటు ఈ విధమైన ఆలోచనలు కూడా ఉన్నాయని నేను గమనించాను.
ఇంలాటి కార్మికులలో యూనియనిజం అభివృద్ధి పరచడంలో మేము విఫలమైన ఈ దశలో అస్పృశ్యతకు వ్యతిరేకంగా గాంధేయవాద ఉద్యమం మీద తెలివిగా కాంగ్రెస్ నాయకులు కేంద్రీకరించారు. వ్యవసాయ కార్మికులలో అత్యధికంగా ఉన్న హరిజనులను దేవాలయాలలోకి ప్రవేశింపనీయటం, ఊరి చెరువులు, బావులు వంటి వాటిని ఉపయోగించుకో నివ్వడం మొదలైన వాటిని సమర్ధించేటట్టు అగ్రకులాల వారిలో చైతన్యం కలిగించేందుకు కృషి సాగింది.
ఆర్ధికంగా స్వావలంబన, సామాజికంగా అభివృద్ధి చెందిన రైతులలోకి మేము చొచ్చుకుపో గలిగాం. ఆ విధంగా 1928లో ' అఖిల ఆంధ్ర రైతు సంఘం' లేదా ' కిసాన్ కాంగ్రెస్' నిర్మించగలిగాం. అలాగే తమిళ ప్రాంతాల్లో 1931లో, మలబారు ప్రాంతంలో 1933లో రైతు ఉద్యమాలు నిర్మించాం. స్థానిక రైతుల ఇబ్బందులను తొలగించేందుకు, సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి వరకు సైతం అనేక రాష్ట్రాలలో 1920-31 దశాబ్ధంలో కాంగ్రెసు వారు రైతులను సంఘటితం చేస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర స్థాయిలో ఒక సమన్వయ కృషి 1928లో ఆంధ్రాలోనే మొదలైందని చెప్పాలి. గుంటూరులో ప్రప్రథమ రాష్ట్ర స్థాయి రైతు మహాసభ నిర్వహణలో కాలిఫోర్నియాలో చదువుకొన్న ఎం. బాపినీడు, శాసనమండలి సభ్యులు డి. నారాయణ రాజు, బి.వి. రత్నం నాకెంతగానో తోడ్పడ్డారు. రైతులకు ఒక వర్గ సంస్థ ఏర్పరచాలన్న నా నినాదానికి ఆ విధంగా ప్రముఖ కాంగ్రెసువాదుల ఆమోద ముద్ర లభించింది. కాంగ్రేసతర రైతు రాజకీయ వేత్తలు ఒక పోటీ రైతు సంస్థను ప్రముఖ కాంగ్రెసు వాది, ఆనాటి శాసన మండలి సభ్యులు బి. రామదాసు అధ్యక్షతన ఏర్పరిచారు. రైతుల సమస్యలు తీర్చడానికే ఈ రెండు సంస్థలు కృషి చేశాయి. భూ శిస్తు భారం, చక్రవడ్డీ రేట్లు మొదలైన సమస్యలపై కేంద్రీకరించాయి.
ఈలోగా గాంధీజీ ఆశీస్సులతో పటేలు నాయకత్వాన గుజరాతు రైతులు సత్యాగ్రహంలో విజయం సాధించారు. ఇది దేశం అంతటా రైతులను ఉత్తేజపరిచింది. యు.పి. వంటి చోట్ల కూడా రైతులను సంఘటిత పరచటం కాంగ్రెసువారు సాగించారు.
1930లో ఉప్పు సత్యాగ్రహంతో దేశమంతా ఉవ్వెత్తున లేచింది. గ్రామీణ ప్రజలు ఉద్యమాల్లో చేరారు. రైతులే కాదు, వ్యవసాయ కార్మికులు కూడా ముందుకొచ్చారు. ఇది అత్యంత ప్రజాస్వామ్యయుత, సమభావాన్విత, విశాల ప్రజాస్థాయి, హింసారహిత, జాతీయ విప్లవంగా రుజువైంది. డొమినియన్ ప్రతిపత్తా లేక స్వాతంత్ర్యమా అన్న విషయం మీద చర్చిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించే కృషిలో 1927 నుంచి కాంగ్రెసు నిమగ్నమైంది.
వైస్రాయి కారన్ వాలిస్ కి, జమీందార్లకి మధ్య కుదిరిన శాశ్వత సెటిల్మెంట్ అనే బానిసత్వం కింద కౌలుదారులు మగ్గుతూ ఉండగా మరోపక్క జమీదార్లు, భూస్వాములు మరింత సంపద పంచుకొంటూ సాగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, కౌలురేట్ల పెంపకం వంటి బాధలకు గురౌతున్న కోట్లాది రైతులను జాగృతపరిచేందుకు మేము కృషి చేస్తూ వచ్చాం. వారి సమస్యలపై కాంగ్రెసు పోరాడాలని మేం కోరాం. అయితే జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రగతిశీల నాయకులు అప్పుడప్పుడు కలగ చేసుకోవడంతో కొద్ది చోట్ల తప్ప కౌలుదార్ల బాధలను పట్టించుకోడానికి జాతీయ స్థాయి నాయకులద్వారా సమన్వయీ కృత కృషి ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కడా సాగినట్టులేదు.
1931 కరాచి కాంగ్రెసులో గాంధీ, నెహ్రూ, పటేలను మేం కలుసుకొని అప్పుడు కాంగ్రెస్ రూపొందిస్తున్న హక్కుల పత్రంలో జమీందారీ ప్రాంతాలలోని కోట్లాది కౌలుదార్లకు ఏదో విధమైన రక్షణ కల్పించాలని కోరాం. కౌళ్ళు తగ్గించి, జమీందార్ల చట్ట వ్యతిరేక చర్యలు తొలగించి, రుణ భారాన్ని, వడ్డీ రేట్లను తగ్గించేందుకు కృషి చేస్తామని కాంగ్రెసు తరపున వారు హామీ ఇచ్చారు. అది మా రైతు ఉద్యమానికి కొత్త శక్తి నిచ్చింది. జమీందారీ ప్రాంతాలలోని రైతులలో దేశమంతటా, ముఖ్యంగా ఆంధ్రలో మా ఉద్యమం అతి వేగంగా పెరిగింది. శ్రీ ఎన్.వి. రామానాయుడు, కటికనేని సోదరులు నా మార్గదర్శకత్వాన వెంకటగిరి సత్యాగ్రహం సాగించేందుకు ఇది వీలు కల్పించింది.
1937-39 మధ్య కాలంలో అటు యునైటెడ్ పరగణాల నుంచి అస్సాం వరకూ, మహారష్ట్ర నుంచి మద్రాస వరకూ ఏడు రాష్ట్రాలలో కాంగ్రెసు అధికారాన్ని సాగించిన కాలంలో రైతుల సమస్యల పరిస్కారానికి కృషి చేసేందుకు రైతు ఉద్యమానికి అవకాశం లభించింది. 1931 నుంచి పెంచిన శిస్తులు, అప్పులు, వాటిపై వడ్డీలు మొదలైన వసూళ్ళపై మారటోరియం విధించాలని రైతులు కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్య సంక్షోభంతో భూములు, ఫలసాయాల ధరలు పడిపోయాయి. ఆ దృష్ట్యా రైతుల కోర్కెలను కాంగ్రెసు ప్రభుత్వాలు అంగీకరించాయి. అసలు అప్పునకు నూరుశాతం గరిష్ట పరిమితిగా రాజాజీ విధించారు. అదనంగా ఉన్న రుణ భారాన్ని రద్దు చేశారు. గరిష్ట వడ్డీ రేటును ఆరు శాతంగా నిర్ణయించారు. మద్రాసు ఆదర్శాన్ని కాంగ్రెసు మంత్రి వర్గాలన్నీ అనుసరించాయి. తమ భూములు షావుకార్లకు తాకట్టు అయిపోకుండా ఈ చర్య రైతులను రక్షించింది.
మే ఇది లభించింది. వందలాది మంది రైతులు జైళ్ళకి వెళ్ళారు. పోలీసు కాల్పుల్లోనూ, జమీందార్ల కిరాయి గూండాల దాడుల్లోను ఎందరో రైతులు తమ ప్రాణాలను బలిపెట్టారు. ఈ రోజుల్లోనే 'దండా' అనే చేతి కర్రను పట్టుకొని తమ స్త్రీల మానాల్ని, తమ ఆస్తుల్ని కాపాడుకొనేందుకు జమీందార్ల సాయుధ గూండాలను ఎదిరించి రైతులు పోరాడవలసి వచ్చింది.
తమ 'దండం' తమ కవచంగా చేతపట్టి నిలపటం రైతుల హక్కు అని స్వామీజీ చెప్పడంతో గాంధీజీకి, స్వామీజీకి మధ్య దురదృష్టవశాత్తు త్రీవ అభిప్రాయభేదం ఏర్పడింది. ఆ సందర్భంలో నేను జోక్యం కల్పించుకోవలసి వచ్చింది. రైతు కార్యకర్తలకు, కాంగ్రెసు నాయకులకు మధ్య వివాదం మరింత పెరగకుండా నిరోధించగలిగాను. అసలు జమీందార్లే దాడులు సాగిస్తున్నారనీ రైతులు కేవలం ఆత్మ రక్షణ చేసుకోవడానికి మాత్రమే సంప్రదాయకమైన తమ 'దండం' ఉపయోగించవలసి వస్తుందని నేను నచ్చచెప్పాను. ఆ సమయానికి రాజ్యాంగం తుది రూపు తీసుకొంది. ఆ రాజ్యాంగం ప్రకరాం వయోజన ఓటింగు ప్రాతిపదికగా జరిగే ఎన్నికలలో పాల్గొనటానికి సోషలిస్టులు, కమ్యూనిస్టులు సంసిద్ధతను ప్రకటించారు.
ఆనాటి పరిశ్రమల మంతి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యాన జరిగిన జాతీయ మహాసభలో రూపొందిన జాతీయ ఏకాభిప్రాయంతో ఆయా పార్టీల పార్లమెంటు సభ్యులు కూడా పాలుపంచుకొన్నారు. మా ఆర్ధిక కార్యక్రమం ప్రణాళికా కమిటి సమర్పించిన నివేదిక ఆధారంగానే ఆ మహాసభ నిర్ణయాలు చేసింది. మిశ్రమ ఆర్ధిక వైఖరిగా అంగీకరంచడం మా నివేదిక ఫలితమే. కాంగ్రెసువాదం, పీడనేతర సామాజిక ఆర్ధిక వ్యవస్థ ప్రాతిపదికగా సహకార వాదం స్వయం ఉపాధి అనేవి జాతీయ వైఖరిగా రూపొందంటం ఆ విధంగా జరిగింది.
భారతదేశ ప్రజాస్వామ్యం తాలూకు రాజకీయ సామాజిక మూర్తి మన దేశ భక్తుల త్యాగాల వారసత్వంగా మనకు లభించింది. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి మహా నాయకుల ఆశీస్సులతో దృఢోపేతమైన కాంగ్రెసు వాదం ప్రజస్వామిక రాజకీయ రంగాలలో అనేక విజయాలు సాధించింది. ప్రపంచ శాంతిని పెంపొందించేందుకు నవ విముక్త రాజ్యాలయిన అలీన దేశాల స్వాతంత్య్రాలను పరిరక్షించేందుకు తన కృషిని ఈ కాంగ్రెసు వాదం కొనసాగిస్తూ, మహాత్మాగాంధీ మార్గం పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటించుకొంటోంది.
( apa నుండి)




No comments:

Post a Comment