Monday, April 4, 2011

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

మిక్కిలినేని గా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెం లో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా 1982లో గౌరవ డాక్టరేట్ 'కళాప్రపూర్ణ' అందుకున్నారు.

మరణం

ఫిబ్రవరి 22, 2011 తేదీన తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని విజయవాడలో తన 95వ ఏట మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు.

రచనలు

  • నటరత్నాలు (1980)
  • ఆంధ్ర నాటకరంగ చరిత్ర
  • తెలుగువారి జానపద కళారూపాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1992.
  • ప్రజా పోరాటాల రంగస్థలం
  • ఆంధ్రుల నృత్య కళావికాసం
  • తెలుగువారి చలన చిత్ర కళ

నటించిన సినిమాలు





Mikkilineni Radha Krishna Murthy




Mikkilineni Radha Krishna Murthy is no more Special Corresponden, The Hindu VIJAYAWADA: Veteran actor and founder of Praja Natya Mandali, Mikkilineni Radha Krishna Murthy, passed away after suffering from urinary tract here on Tuesday morning.
He was 96.
Born in Kolavennu village on July 7, 1914, Murthy acted in near 150 films with N.T. Rama Rao and in almost all the Vitalacharaya movies.
Starting with the freedom movement, Murthy played a lead role in the Congress, Leftist, Library, progressive writers and Atheist movements of Andhra Pradesh.
Beginning his film career in Telugu film, Deeksha, directed by K.S. Prakash Rao in 1949, the Balakrishna-starrer Bhairava Dweepam was his last film.
‘Kalaprapoorna'
Having woven every conceivable award of the film and theatre fields the Andhra University conferred upon him the Kalaprapoorna title.
Murthy has one son and two daughters. Before entering into a career in theatre and cinema, he did diploma in veterinary science.
His son also studied veterinary science and has settled down in Krishna district as a doctor.
Date of Death
23 February 2011, Vijayawada, Andhra Pradesh, India
Birth Name
Radha Krishna Murthy Mikkilineni
Spouse
Seetaratnam
Was arrested and sent to jail 5 times by the British Government for participating in various freedom movements like Quit India Movement, Telangana Revolution etc. Was a drama artist before joining films. Wife is also a drama artist. Was associated with Praja Natya Mandali. His literary work "Nata Ratnalu" was serialised in the weekly Andra Prabha and later published as a book. Held various positions in different cultural organizations like Andhra Nataka Kala Parishad, Sangeeta Nataka Academy, Praja Natya Mandali etc. Was awarded the title "Kala Prapoorna" by Andhra University.



ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం తెలుగువారి జానపదకళారూపాలు
పుస్తకం అంటే ఒకప్పుడున్న అర్థానికి, ఇప్పుడున్న అర్థానికీ చాలా తేడా ఉంది. భారతం, భాగవతం, రామాయణం... ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు... ఇవే పుస్తకాలు... ఒకప్పడు. ఇప్పుడు ఏదైనా పుస్తకమే. ఎవరి అభిరుచిననుసరించి ఆయా రంగాలకు సంబంధించిన పుస్తకాలు సేకరిస్తుంటారు. అయితే ఒక జాతి చైతన్యాన్ని సాంస్కృతిక నేపథ్యాన్ని తెలిపేవి, పట్టిచ్చేవి కూడా సామాన్య పాఠకులు చదవదగినవే అవుతాయి. ఆ దృష్టితో చూసినపుడు కళా ప్రపూర్ణ డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఎంతో శ్రమకోర్చి రూపొందించిన 'తెలుగువారి జానపద కళారూపాలు' చదవదగినది మాత్రమే కాదు ప్రతి ఇంట్లోనూ ఉండదగిన పుస్తకం అనడంలో సందేహం లేదు.
మిక్కిలినేని పేరువినగానే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఊహించుకుంటారు. ఆయన నాటకరంగంలో మహామహుల్ని నటరత్నాలుగా పరిచయం చేశారు. నాటకరంగం పుట్టుపూర్వోత్తరాలను విపులంగా గ్రంథస్తం చేశారు. సినిమా నటులు ఆచార్య సి.నారాయణరెడ్డి మాటల్లో చెప్పాలంటే - ''నలభై ఏళ్లకు పైగా జానపదకళా రంగంలో మిక్కిలినేనిగారు చేసిన సాధన, పరిశోధన నిజానికి 8000 పుటల్లో ఇమిడేది కాదు. అయితే కొన్ని అంశాలను క్లుప్తంగా వివరిస్తూ అన్ని కోణాలను ఉల్లేకిస్తూ ఈ బృహత్‌ గ్రంథాన్ని రచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల కళారూపాలకు సంబంధించిన విశ్లేషణ ఇందులో ఇమిడి వుండటం విశేషం.''
ఈ గ్రంథాన్ని నేనెందుకు రాయాలి? అనే ప్రశ్న వేసుకొని, దానికి సమాధానంగా మిక్కిలినేని రాసిన ముందు మాటలో - ''నాటకం, సినిమా రేడియో, టీవీ, వీడియో, ఆడియో లేని నా చిన్ననాడు, పల్లె ప్రజలను అలరించి, ఆనందపర్చి, ఆనందడోలికలలో ఊగులాడించి, ఈనాడు కాలగర్భంలో కలిసిపోతున్న నాటి జానపద కళారూపాలు నన్ను ఉత్తేజపర్చాయి. ప్రభావితుణ్ణి చేశాయి'' - అన్నట్లే - ఎవరి మూలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయో వారందర్నీ ఏదో ఒక దశలో, ఏదో ఒక కళారూపం తప్పక ఆనందపరచే ఉంటుంది.
అప్పట్లో... అంటే అరవైల వరకు కూడా వేసవిలో రాత్రి తెల్లవార్లూ ఏదో ఒక ప్రదర్శన జరిగేది. పగటి వేళల్లోనూ ఎవరెవరో కళాకారులు ఇంటింటికీ వచ్చి తమ కళారూపాలు ప్రదర్శించేవారు. పిల్లలు ఆ కళారూపాల కోసం ఎదురుచూసే రోజులవి. ఇప్పుడు వాటిల్లో కొన్నిటిని బుల్లితెరమీద చూసి సంతోషించే వారు కొందరైతే... ఇవెందుకు? అంటూ ఛానెల్‌ మార్చేవారు చాలామంది. జానపద కళారూపాలు మన జాతి వైభవానికి చిహ్నాలు. ఈరోజు మనం చూస్తోన్న అనేక కళారూపాలకు అవి మాతృకలు. జానపదగేయాలు, నృత్యాలు, సంగీతం, వీథి నాటకాలు, తోలు బొమ్మలు, బుర్రకథలు, యక్షగానాలు, జముకుల కథలు, పిచ్చుకుంట్ల కథలు, పగటి వేషాలు ఇలా కొన్ని వందల కళారూపాలు మన పూర్వీకులను అలరించాయి. వారికి వినోదం అందించాయి. విజ్ఞానాన్నందించాయి. ఆ కళారూపాల్లో అనేకం కాలగర్భంలో కలిసిపోయాయి. ఆదరణ లేక కొన్ని కళలు, ఆసక్తి లేక కొన్ని, నగరాల వ్యాప్తిలో కొన్ని ముందువచ్చిన చెవులకన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు - తదనంతర కాలాల్లో వచ్చిన రూపాల వెల్లువకు కొన్ని బలైపోయాయి. జానపద కళారూపాలు అశాస్త్రీయాలని అంటారు. కానీ వాటికీ సంగీత నేపథ్యముంటుంది. తాళం, లయం, నృత్యం, అభినయం, ఆహార్యం, వాయిద్యం, లయబద్ధమైన కలయిక క్రమశిక్షణ ఉంటాయి.
ఈ గ్రంథంలో శాతవాహనుల కాలంనుంచి ప్రజానాట్యమండలి రూపొందించిన జానపద కళారూపాల వరకు కొన్నివందల కళారూపాల ప్రస్తావన వివరణ కనిపిస్తాయి. ప్రతికళారూపానికి సంబంధించి ఆహార్యం తదితర వివరాలు, దాని పుట్టుపూర్వోత్తరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జానపద కళారూపంలో ప్రధానంగా ఉన్న సాన్నిహిత్యాన్ని మిక్కిలినేని సేకరించడం విశేషం. కళలకు సంబంధించిన ఊహాచిత్రాలు, కొన్ని రూపాలకు సంబంధించిన ఫొటోల్ని కూడా ఇందులో చేర్చారు. ఉదాహరణకి పేరిణి తాండవ నృత్యం తీసుకుంటే దాని సంక్షిప్త చరిత్ర, రామప్పగుడి ప్రస్తావన, జాయపసేనని నృత్యానికి చేసిన సేవ, ఆయన రాసిన నృత్తరత్నావళి గ్రంథం పేరిణి ప్రశంస, పేరిణి వర్ణన, తాండవ నృత్యం, రామప్ప ప్రజ్ఞ, రామకృష్ణ ఉవాచ. వీరశైవం, వీరవైష్ణవం రోజుల్లో ఎదురైన సమస్యలు, శైవమత విజృంభణలో కళారూపంలో వచ్చిన మార్పులు ఇలా సమస్త సమాచారంతో ఎనిమిది పేజీలున్నాయి. ప్రతికళారూపానికి సంబంధించి మిక్కిలినేని సంబంధితులనుంచి అనేక గ్రంథాలనుంచి సమాచారం సేకరించి క్రోడీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జానపద కళారూపాల విజ్ఞాన సర్వస్వం ఈ గ్రంథం. అదీ, ఇదీ అనికాక అన్ని ప్రాంతాలకు సంబంధించిన అన్ని కళారూపాల వివరాలు ఈ బృహద్గ్రంథంలో లభిస్తాయి. జానపద కళలకు సంబంధించి విశేషంగా కృషిచేసిన కొందరు మహామహుల ఫొటోలు కూడా జతచేశారు. నేదునూరి గంగాధరం, తూమాటి దొణప్ప, బిరుదురాజు రామరాజు, శ్రీనివాసచక్రవర్తి, యస్వీజోగారావు, షేక్‌నాజర్‌, గంగప్ప, నాయని కృష్ణకుమారి, నటరాజ రామకృష్ణ, ఎల్లోరా, ఆర్వీ ఎస్‌ సుందరం, తంగిరాల వెంకటసుబ్బారావు, కోగంటి గోపాలకృష్ణయ్య, వై.సంపత్‌కుమార్‌, కె.ఇ. హనుమంతరావు, కొసరాజు, చుక్క సత్తెయ్య, డి.వి.నారాయణ వంటి పరిశోధకులు కళాకారుల ఫొటోలు గ్రంథానికి అలంకారంగా నిలిచాయి. ఈ గ్రంథానికి చేర్చిన అనుబంధంలో ఇతర రాష్ట్రాల కళారూపాల్ని కూడా ప్రస్తావించారు. ఎనిమిది వందల పేజీల్లో తెలుగువారి జానపద కళారూపాలకు సంబంధించిన విశేషాలన్నీ తెలుస్తాయి. భాషనీ, సంస్కృతినీ, సంప్రదాయాల్నీ అర్థం చేసుకోవడానికీ, ఈ గ్రంథం ఎంతో దోహదపడుతుంది. ప్రతి ఇంట్లో ఒక నిఘంటువు, విజ్ఞాన సర్వస్వం ఎలా తప్పక ఉండాలో అలాగే ఈ గ్రంథం కూడా. జానపద కళారూపాలకు ఆయా కావ్యాల్లో పత్రికల్లో కనిపించే ఆధారాలతోపాటు, విన్నవీ, కన్నవీ చేర్చి డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి సమగ్రత, సాధికారత కల్పించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దీన్ని ప్రచురించడం అభినందనీయం.
(తెలుగువారి జానపద కళారూపాలు; డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రచురణ
ప్రొ. శ్రీ తెలుగు విశ్వవిద్యాలయం; తొలిముద్రణ: 1992; పుటలు: 800; వెల: 130 రూపాయలు)
- చీకోలు సుందరయ్య


No comments:

Post a Comment