త్రిపురనేని రామస్వామి
కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించాడు.
బాల్యము మరియు తొలి నాళ్లు
రామస్వామి రైతు కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరము ఆయన పల్నాటి యుద్ధము ఆధారముగా కారెంపూడి కదనం, మహాభారత యుద్ధము ఆధారముగా కురుక్షేత్ర సంగ్రామము అను రెండు నాటికలు రచించాడు. 1911 లో ఇంటర్మీడియట్ చదవడానికి బందరు లోని నోబుల్ కాలేజీలో చేరాడు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు.రాజకీయ జీవితం, సంఘ సంస్కరణ
1898 లో పున్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. 1910లో వారికి ఒక కొడుకు జన్మించాడు. ఆయనే ప్రఖ్యాత రచయిత, త్రిపురనేని గోపీచందు. 1914 లో న్యాయ శాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లాడు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము మరియు ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా చదివాడు. డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే అనీ బీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమంకు మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేసస్తూ కృష్ణా పత్రిక లో అనేక రచనలు చేశాడు. రామస్వామి స్వాంతంత్ర్యోద్యము రోజులలో ప్రజలకు స్పూర్తినిచ్చి ఉత్తేజపరచే అనేక దేశభక్తి గీతాలు రచించాడు.1917 లో భారత దేశానికి తిరిగివచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి నిర్వహించాడు. కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే. స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించాడు. 1922 లో గుంటూరు జిల్లా, తెనాలి లో స్థిరపడ్డాడు. 1925 లో తెనాలి పురపాలక సంఘ చైర్మనుగా ఎన్నికయ్యాడు. తెనాలి మున్సిపాలిటీ చైర్మెన్ గా ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించాడు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మను పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి చైర్మను అయ్యాడు. జంతుబలులు మాత్రం సాగలేదు. 1938 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు.
1920 లో మొదటి భార్య చనిపోగా, చంద్రమతిని పెళ్ళి చేసుకున్నాడు. 1932 లో ఆమె చనిపోగా, అన్నపూర్ణమ్మ ను పెళ్ళి చేసుకున్నాడు. సూతాశ్రమం అనిపేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది.
సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, అచ్చ తెలుగులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేసాడు. ఈయన స్వయంగా అనేక పెళ్లిళ్లకు పౌరోహిత్యము వహించి జరిపించాడు. ఆంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. మనసా, వాచా, కర్మణా రామస్వామి ఓ సంస్కర్త. 1943 జనవరి 16 న త్రిపురనేని రామస్వామి మరణించాడు.
సాహితీ ప్రస్థానము
ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాథనముగా త్రిపురనేని ఎంచుకున్నాడు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించాడు. ఈయన చేసిన ముఖ్య రచనలు:- సూతపురాణము
- శంబుకవధ
కృతికర్త : త్రిపురనేని రామస్వామి
మొదటి ప్రచురణ : 1922
ఈ గ్రంధం కోసం ఈక్రింద క్లిక్ చేయండి.....
- shabhukavadha023090mbp
- సూతాశ్రమ గీతాలు
- ధూర్త మానవ శతకము
- ఖూనీ
- భగవద్గీత
- రాణా ప్రతాప్
- కొండవీటి పతనము
- కుప్పుస్వామి శతకం
- గోపాలరాయ శతకం
- పల్నాటి పౌరుషం
- వివాహవిధి
ఆయన ప్రసిద్ధ గేయంలోని ఒక భాగం:
- వీరగంధము తెచ్చినారము
- వీరుడెవ్వడొ తెల్పుడీ
- పూసిపోదుము మెడను వైతుము
- పూలదండలు భక్తితో
- మలమల మాడు పొట్ట , తెగమాసిన బట్ట ,కలంతపెట్టగా
- విలవిల యేడ్చుచున్న నిఱుపేదకు జాలిని జూపకుండ, ను
- త్తలపడిపోయి, జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్
- పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చెదన్.
మా మతం గొప్పదంటే కాదు మా మతం గొప్పదని వాదులాడే మతోన్మాదులను ఈసడిస్తూ ....
- ఒకరుడు 'వేదమే' భగవ దుక్తమటంచు నుపన్యసించు నిం
- కొకరుడు 'బైబిలే' భగవదుక్తమటంచును వక్కణించు, వే
- రొంకరుడు మా ' ఖొరాన్ ' భగవదుక్తమటంచును వాదులాడు, నీ
- తికమక లేల పెట్టెదవు? తెల్పగరాదె నిజంబు నీశ్వరా.
సంతానము
- రామస్వామి పెద్దకుమారుడు త్రిపురనేని గోపీచందు తెలుగులో ప్రప్రధమ మనస్తత్వ నవల అసమర్థుని జీవయాత్ర రాసి తెలుగు సాహిత్యముపై చెరగని ముద్ర వేశాడు.
- పెద్దకుమార్తె సరోజిని దేవి భారతీయ పాలనా యంత్రాంగపు అధికారి అయిన కానుమిల్లి సుబ్బారావు ను వివాహమాడినది.
- త్రిపురనేని గోకులచందు కూడా తెలుగు సాహితీ రంగమునకు తనదైన రీతిలో తోడ్పడ్డాడు. ఈయన రచనలలో, 1950లలో వచ్చిన బెంగాల్ కరువుకు దర్పణము పట్టిన నాటకము విశిష్టమైనది.
- రామస్వామి చిన్న కుమార్తె చౌదరాణి స్వాతంత్ర్యోద్యమ సమయములో భారతీయ నావికా దళములో తిరుగుబాటుదారైన అట్లూరి పిచ్చేశ్వరరావుని పెళ్లి చేసుకొన్నది. ఈమె తమిళనాడులో తొలి తెలుగు బుక్‌స్టోర్ ప్రారంభించిన తొలి మహిళ. ఈమె 1996లో చనిపోయినది.
విశేషాలు
- చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి వద్ద శిష్యరికం చేసి అవధాన కళలో మెలకువలు నేర్చుకున్నారు. 1911లో తొలిసారిగా ఆయన అష్టావధానం చేశారు. ఆ తర్వాత 1912 నాటికే శతావధానం చేశారు.
- రాణా ప్రతాప్ నాటకం అచ్చులో ఉండగానే ప్రభుత్వనిషేధానికి గురైంది.
- 1913లో బొంబాయి వెళ్ళి న్యాయశాస్త్రం అధ్యయనం చేశారు. 1914లో డబ్లిన్ లో బారిష్టర్ డిగ్రీ పొందారు .అక్కడే 'శంబూక వధ'. నాటకం రాశారు.
- 1930లో ఆయన రాసిన వివాహవిధి లో మంత్రాలు, వేద పండితులు ప్రమేయం లేకుండానే అచ్చమైన తెలుగు భాషలో వధూవరులిద్దరూ ప్రమాణాలు చేయడంతో వివాహం పూర్తవుతుంది.
- ఆయన రచనల్లో అంపకం, స్వర్గం, నరకం తదితర గ్రంథాలు లభ్యం కావడం లేదు
- కురుక్షేత్రం నాటకంలో పాండవులకు రాజ్యాధికారం లేదంటాడు.
- ఆయన బ్రిటన్‌లో చదువుకునే రోజుల్లో తలపాగా ధరించి, పంచె కట్టుకొనేవారు. ఒక బ్రిటిష్ మహిళ ఆయన్ని నిలదీసి ఏ దేశంలో ఉంటే ఆ దేశ తరహాలోనే దుస్తులు ధరించాలని తెలియదా? అని ప్రశ్నించింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం. మీరు మా దేశానికొస్తే చీర కట్టుకుంటారా? అని ఎదురు ప్రశ్నించాడు
- కొండవీటి వెంకటకవి, ఎన్టీ రామారావు తదితరులు ఆయన భావజాలాన్ని విస్తృతం చేశారు
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి చెప్పిన సంగతులు
- భగవద్గీతను అలా సెటైర్ చెయ్యడం, పల్నాటి చరిత్రను జోడించి, తెనుగుదనం తేవడం, ఆరెంటి సామ్యాలనూ హత్తించడం, ఆ పద్యాలు, ఆ భాష, అవన్నీ అపూర్వాలు.
- మాటను ప్రాణ ప్రతిష్ఠ చేసి వాడటంలో మన తెలుగులో ముగ్గురు మహానుభావులు-చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, త్రిపురనేని రామస్వామి చౌదరి, మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రిగార్లు.
- మల్లెపూల మీదా, కోయిల మీదా, వడగాలి మీదీ, ఇంద్ర ధనస్సు మీదా, పద్యాలు రాయలేకనేనా- ఈ బాధ అంతా ఆయన పడ్డది? గుడ్డెద్దు చేనపడ్డ విధంగా నమ్ము తూ, కాదనుకోబోతే-కళ్లోతాయేమో అనే వాటిని తఱి చి తఱిచి చెప్పారు.
- రామస్వామి గారు పరశురాముడిలాగా సాహిత్యరంగంలో అవతరించారు. విశ్వనాథ సత్యనారాయణ వేనరాజు రాశారు. కవిరాజు 'ఖూనీ'అని రాశారు.
- రామస్వామి గారూ, పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారూ నాకు వీళ్లిద్దరి విషయంలోచాలా గౌరవం. వారి వారి వాదాలలో అభిప్రాయాలలో మన మనస్సుకు నొప్పికలిగే అంశాలు కొన్ని ఉండవచ్చు. కాని- సెంటిమెంట్‌ను చంపి, నిజం ఆలోచిస్తే-వారి వాదాలు ఎంత సమంజసాలో బోధపడుతుంది.
- వికీపీడియా నుండి...
-
Tripuraneni Ramaswamy
From Wikipedia, the free encyclopediaTripuraneni Ramaswamy (Telugu: త్రిపురనేని రామస్వామి) (January 15, 1887–1943) was a lawyer, playwright and reformer active among the Telugu-speaking people. He was part of a growing movement in India to reassess the culture of India. This movement included such people as Ram Mohan Roy, Eswara Chandra Vidya Sagar, Ranade, Dayanand Saraswathi, Kandukuri Veeresalingam and Gurazada Appa Rao.Childhood and early years
Tripuraneni Ramaswamy was born in the village of Angaluru in the Krishna District (present day Andhra Pradesh) into a family of farmers. At the age of 23, he passed his Matriculation Examination. In the same year he wrote two plays: "Karempudi Kadanam" based on the Palanadu battle and "Kurukshetra Sangramam" based on the Mahabharata war. In 1911, he joined the Noble College at Bandar to study for the Intermediate Course. In those years he displayed his literary skills and prodigious memory in his Avadhanam.
In 1914, he went to the Britain and studied law as well as English Literature and modern European culture in Dublin. During this time, he wrote to Krishna Patrika, a Telugu weekly appealing to Indians to support the Home Rule movement started by Annie Besant. He pleaded for India's independence. Ramaswamy wrote many patriotic songs during the independence movement.
After returning to India, he practiced law for some years, mostly in Tenali town. However, his main activity was directed towards social reforms. He launched a full-scale attack on casteism and the social injustices resulting from it.Literary career and public life
Ramaswamy chose literary writing as the vehicle for expressing his rationalist thoughts. His famous work 'Sutaparanam' in four cantos was a fierce attack on the ancient Puranas. His poetic work "Kuppuswamy Satakam" reveals the theme of social revolution and talks about social evils, blind faith and indignity to man. He was against Congress and its fight against independence. He advocated British Rule is more suitable for India .
In his other works such as "Sambhukavadha", "Suthashrama geethaalu', 'Dhoortha maanava', 'Khooni', 'Bhagavadgita', 'Rana Pratap' and 'Kondaveeti pathanam', he made a rational analysis of dogmas prescribed by ancient classics and the injustice these dogmas did to people belonging to the lower social orders. Moreover, he attacked discriminatory practices and fought against the idea of untouchability.
Sambhuka Vadha created lot of controversy . Sambhuka was a character , who did tapassu to go heaven with live body before death. That was considered as adharma and was killed by Lord Rama. This story was interpreted that Brahmins do not like doing tapassu by non - brahmins , that is why Sabhuka was killed.
He was against the traditional Hindu marriage ceremony which resulted in burdensome expenditure, especially among the poor. He prepared a simple procedure in Telugu called Vivaha Vidhi. He officiated at many marriages. When he was the Chairman of Tenali Municipality, he did not permit animal sacrifice to appease Devatas.
Ramaswamy was a patriot even when he was a student. He wrote a patriotic play "Rana Pratap", which was proscribed by the British government. He was an ardent lover of the Telugu language and culture and was proud of their history. He was an educationist and was a member of the senate of the Andhra University for three terms. He was awarded many honors and was popularly known as 'Kaviraju', a title conferred on him.
Ramaswamy died in 1943, but left his imprint on the development of the Telugu-speaking people. The Indian government honored his legacy by issuing a commemorative postage stamp with his picture in 1987, his centenary year.His children
His son Tripuraneni Gopichand has left his own mark on the Telugu literature. His younger brother Gokulchand's most famous and outstanding work is a drama about the drought of Bengal in the 1950s. Ramaswamy's eldest child was the daughter Sarojini Devi. She married Subba Rao Kanumilli, an officer of the Indian Administration Services, who is known for his high ethical standards. Pitcheswara Rao Atluri, a Royal Indian Navy mutineer during the Indian freedom movement, married Ramaswamy's youngest daughter Choudarani. She is the first woman to run an exclusively Telugu language bookstore in Tamilnadu, the land of Tamils in the Indian peninsular. - ‘ఈనాడు’
- 'సూతపురాణం' సృష్టికర్త త్రిపురనేని రామస్వామి చౌదరి
దేశభక్తి, హేతువాదం, సాంఘిక సంస్కరణ, అంధ విశ్వాసాల నిర్మూలన... ఇలా ఏక కాలంలో పలు రంగాలలో అనితర సాధ్యమైన కృషి చేసినవారు త్రిపురనేని రామస్వామి. ఉబుసుపోకకో, రచయితగా కీర్తి కండూతితోనో ఆయన రచనలు చేయలేదు. ఆయన ప్రతి రచనకూ ఒక సామాజిక లక్ష్యం ఉంది. ఒక ప్రయోజనం ఉంది. ఆ లక్ష్యం, ఆప్రయోజనం ఆశించే ఆయన రచనలు చేశారు. ఆయన పద్యం హేతువాద భావాలతో తళతళా ఎలా మెరిసి పోతుందో, కరుణతోనూ కరిగిస్తుంది. ఆయన భావాలు ఎంత తీక్షణంగా ఉంటాయో, చెప్పే పద్ధతి అంత ఆసక్తికరంగా సాగుతుంది. గాంధీజీ మరణించినప్పుడు త్రిపురనేని రాసిన అనేక పద్యాల్లో మచ్చుకి ఒకటి. పూవుల తెప్పపై గదలిపోయితివా యమునా తరంగిణీ పావన రాజఘట్టమున భౌతికదేహము గాల్చుకొంటివా నీ వపురస్థి చందనవనీ శకలమ్ముల బూదియయ్యెనా బావురుమంచు నీదు చితి పజ్జల శోకము పొంగెనా ప్రభూ సమాజ అభ్యుదయం మనసారా కాంక్షించిన త్రిపురనేని రామస్వామి చౌదరి కృష్ణాజిల్లా అంగలూరులో 1887 ఆగస్టు ఒకటో తేదీ జన్మించారు. మాధ్యమిక విద్యార్థి దశలోనే ఆయనలో కులమత వ్యతిరేక ధోరణి ప్రారంభమైంది. 1910లో మెట్రిక్యులేషన్ పరీక్షలో కృతార్థులయ్యారు. అప్పటికే ఆయన కవిగా గుర్తింపు పొందారు. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి వద్ద శిష్యరికం చేసి అవధాన కళలో మెలకువలు నేర్చుకున్నారు. 1911లో తొలిసారిగా ఆయన అష్టావధానం చేశారు. ఆ తర్వాత 1912 నాటికే శతావధానం చేసి గురువును మించిన శిష్యుడయ్యారు. బాగా చిన్నతనంలోనే ఆయన ''కారెంపూడి కదనం'', ''కొండవీటి పతనం'', ''రాణా ప్రతాప్'' వంటి దృశ్య నాటకాలు రాశారు. విశేషమేమిటంటే ''రాణా ప్రతాప్'' నాటకం అచ్చులో ఉండగానే ప్రభుత్వనిషేధానికి గురైంది. 1911లో బందరు నోబుల్ కళాశాలలో చదివే రోజుల్లోనే ఆయన ''కురుక్షేత్ర సంగ్రామం'' అనే సంచలనాత్మక రూపకం రాశారు. 1913లో బొంబాయి వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం అధ్యయనం చేశారు. 1914లో డబ్లిన్వెళ్ళి బారిష్టర్ డిగ్రీ పొంది 1917లో స్వదేశానికి తిరిగొచ్చారు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు రాసిన నాటకం 'శంబూక వధ'. - 1918తో ఆయన తొలిసారిగా బందరులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. తర్వాత తన కార్యక్షత్రాన్ని 1920లో విజయవాడకు మార్చారు. అక్కడ రెండు సంవత్సరాలు మాత్రమే న్యాయవాద వృత్తి సాగించి 1922లో తెనాలి చేరుకున్నారు. ఇక అప్పట్నించీ ఆయన తెనాలిలోనే న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా, సాంఘిక విప్లవకారుడిగా, రచయితగా తన బహుముఖ ప్రజ్ఞ చాటారు. త్రిపురనేని రామస్వామి రచనల్లో ఎంతో పేరు పొందినది ''సూత పురాణం''. ఈ బృహత్కావ్యానికి ఆయన్ని ఆంధ్ర మహాసభ ''కవి రాజు'' బిరుదుతో సత్కరించింది. 1930లో ఆయన రాసిన ''వివాహవిధి'' ఒక సంచలనాత్మక ప్రయోగమనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ 'వివాహవిధి'లో మంత్రాలు, వేద పండితులు ప్రమేయం లేకుండానే అచ్చమైన తెలుగు భాషలో వధూవరులిద్దరూ ప్రమాణాలు చేయడంతో వివాహం పూర్తయింది. 1935లో ఆయన రాసిన గ్రంథం ''ఖూనీ'' నాస్తికుడిగా ఆయన విశ్వరూపానికి నిదర్శనమనే చెప్పాలి. 1940లో ఆయన కలం నుంచి వచ్చిన మరో వెలుగు ''భగవద్గీత''. ఇందులో ఆయన సనాత భగవద్గీత స్థానంలో మానవతా వాదాన్ని ప్రవేశపెట్టారు. తదనంతర కాలంలో ''కుప్పు స్వామి శతకం'', ''ధూర్తమానవా'', ''గీతాలు'', ''కవిరాజు పీఠికలు'' మొదలైన గ్రంథాలు ప్రచురితమయ్యాయి. ఆయన రచనల్లో ''అంపకం'', స్వర్గం, నరకం'' తదితర గ్రంథాలు లభ్యం కావడం లేదని ఆయన అభిమానులు స్పష్టం చేశారు. 1922లో త్రిపురనేని రామస్వామి ''రైతు'' అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. 1925 నుంచి ఎనిమిది సంవత్సరాల కాలం తెనాలి మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేశారు. తెనాలిలోనే ఆయన ''సూతాశ్రమం'' నెలకొల్పారు. సూతాశ్రమం పండితులకు సాహితీ వేత్తలకు సమాలోచన వేదికగా ఉండేదన్నది చారిత్రక సత్యం. అప్పట్లో ఎంతో మంది విద్వాంసులు, స్వాతంత్య్ర యోధులు సూత్రాశ్రమం సందర్శించేవారు. ఆ కాలంలో త్రిపురనేని రామస్వామి చౌదరి వీర విప్లవవాదిగా పేరు తెచ్చుకున్నారు. తన ''కురుక్షేత్రం'' నాటకంలో పాండవులకు రాజ్యాధికారం లేదన్న విషయానికి ఆయన ప్రాధాన్యమిచ్చారు. లండన్‌లో చదువుకొనే రోజుల్లో మహాత్మాగాంధీజీతో ఆయనకు పరిచయం కలిగింది. గాంధీజీ ప్రభావానికి త్రిపురనేని లోనయ్యారు. ఫలితంగానే ఆయన లండన్‌లో ఉన్న కాలంలో మాంసాహారం ముట్టలేదు. ఆయనవాగ్ధాటిని, విశ్లేషణా సామర్థ్యాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు సబ్ జడ్జి పదవి ఆశ చూపింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. ఆయన జీవితాదర్శానికి సంబంధించి ఎన్నో సంఘటనలున్నాయి. ఆయన బ్రిటన్‌లో చదువుకునే రోజుల్లో తలపాగా ధరించి, పంచె కట్టుకొనేవారు. ఒక బ్రిటిష్ మహిళ ఆయన్ని నిలదీసి ''ఏ దేశంలో ఉంటే ఆ దేశ తరహాలోనే దుస్తులు ధరించాలని'' తెలియదా? అని ప్రశ్నించింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం. ''మీరు మా దేశానికొస్తే చీర కట్టుకుంటారా?'' అన్న ఎదురు ప్రశ్న. దానితో ఆమె బిత్తరపోయింది. సమాజంలో మూఢ విశ్వాసాలను, అరాచకాలను, కుళ్లును పారదోలేందుకు కొందరు సాహిత్యాన్ని ఉపయోగించారు. అయితే పునాదులను ప్రక్షాళనం చేయడానికి సాహిత్యాన్ని ఉపయోగించిన వారు చాలా కొద్ది మందే. అలాంటి కోవలోకే వస్తారు త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన పునాదుల ప్రక్షాళనకు పూనుకున్నారు. ''వేద సంస్కృతి పేరుతో వేదాలను గర్హిస్తోన్న కుటిలాచారాలను ప్రోత్సహిస్తోన్న ఈ సంస్కృతి మానవాభ్యుదయానికి సరైంది కాదని ఆయన ఖండించారు'' అని ఆయన సమకాలికుల్లో ఉన్న విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. సాహిత్యంలో ప్రస్తుతం కనిపిస్తోన్న అనేక ఉద్యమాలకు త్రిపురనేని అప్పుడే తన ఆలోచనలను అందించారు. 1942 ఏప్రిల్ ఇరవై అయిదో తేదీ గుడివాడలో కవిరాజు త్రిపురనేనికి ఘన సన్మానం జరిగింది. గజారోహణం చేయించి అభిమానులు ఎంతో సందడి చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే అంటే 1943 జనవరి పదహారో తేదీ సంక్రాంతి పర్వదినాల్లో ఆయన కన్ను మూశారు. మహాభారత ఘట్టాల్లో ఆయన కొత్త దృక్కోణం అందించారు. ఆయన తర్వాత కాలంలో అది చాలా ఆదరణ పొందింది. కొండవీటి వెంకటకవి, ఎన్టీ రామారావు తదితరులు ఆయన భావజాలాన్ని విస్తృతం చేశారు. తన వారసుడిగా ఆయన గోపీచంద్‌ని అందించారు. తెలుగు సాహితీ లోకంలో తండ్రీ కొడుకులిద్దరూ సమ ఉజ్జీలైన రచయితలుగా తమ కాలంలోనే కాక తదనంతరం కూడా నీరాజనాలు అందుకోవడం అరుదనే చెప్పాలి. ఆ గౌరవాన్ని దక్కించుకొన్న వారు ''త్రిపురనేని''.
చీకోలు సుందరయ్య
(ఈనాడు-సాహితి సంపద,మహామహులు నుంచి...)
త్రిపురనేని రామస్వామి భావపరిణామం by AGK
(ఆవుల గోపాల కృష్ణమూర్తి)
త్రిపురనేని రామస్వామి భావపరిణామం
కవిరాజదర్శనం నుండి
కవులనేకులుగా వున్నారు. అద్దంకి శాసన కాలం నుంచి కవులున్నారు. తెలుగు కవులలో నాటినుండి నేటి వరకు స్వంత కావ్యాలను వ్రాసినవారు అరుదు. అనువాదములనో, ఆశ్ఛాదనములనో, కథలపుణికి పుచ్చి కల్పనలను అల్లుటతోనో కవుల ప్రతిభావ్యుత్పత్పులు పరిఢవిల్లుతీ వచ్చినవి.
రామాయణ భావుకులు, భారత భావుకులు, భాగవత భావుకులు, కాళిదాస భారతేత్యాది భావుకులతో తెలుగు సాహిత్యం నిండి కూర్చుంది. ఈ పెద్ద కృతులు పోగా, వుపాఖ్యాన పెంపరిక కృతులు జాస్తి కావొచ్చినవి.
మొత్తముమీద అనుకరణకు, అనువాదాలకు వున్న విలువ స్వంత కృతులకు లేదు. స్వంత కృతులు లేని కారణం చేత అట్లు జరిగినది.
ముక్తక కవులలో భావుకత కలదు కాని, అది పరిణతి చెందిన రీతి కాదు. శతక కవిత ముక్తకవిత. శతక కవులలో సాంఘిక భావుకులు కలరు. శతకాలను కావ్యాలనుగా యెంచకపోయిరి.
వర్తమానాంధ్రలో చారిత్రక పురుషుల గాథల చుట్టూ కావ్యాలు జాస్తిగా వచ్చినవి. ఇది జీవిత కథల సాహిత్యం. యివి పోతే సమాజాన్ని వుత్తేజపరచగలిగి, ఘూర్ణంపగలిగి, పూర్వాపరాల సమన్వయాభావం కలిగి, నూతన భావ పరిధుల్ని కల్పన జేయగల సాహిత్యం కొరవడింది. సాహిత్యంలో అవ్యవస్థ మేర్పడింది. కవితా ప్రతిభ గల్గి, విషయ గర్భితమై, వుత్పన్నతాశక్తి కల్గిన సాహిత్యం చాలా తక్కువ.
ఆ తక్కువగావున్న వున్నత కోవలోని సాహిత్యాన్ని యెక్కువగా సృష్టించినవాడు త్రిపురనేని రామస్వామి. అందులకే అతడు కవిరాజు.
కవిరాజు కవితలు భావప్రధానాలు. కవితకు నిలయాలు. రచనలో ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఆద్యంతాలు భావముమించు శైలితో, శైలినిమించు భావంతో నిండారి, పింపిసలాడుతూ వుంటవి. ఈ మాదిరి సాహిత్య మల్లినవారు లేరు. అందుకేవారు భావవిప్లవ కవులు.
వీరి రచనలకు పౌరాణిక, చారిత్రక, నైతికరంగాల్లో భావుకతలు కలవు. అది కురుక్షేత్రంగాని, శంబుక వధగాని, సూతపురాణములుగాని, ఖూనీగానీ, భగవద్గీతగానీ, కుప్పుస్వామి, ధూర్త మానవాశతకాలంగాని, నరకంగానీ, అంపకం గానీ – మరేదైనా సరే – పై నాలుగు భావరీతులు, యేకంగా గానీ, కలగాపులగంగాగానీ త్రిపురనేనిలో తాండవిస్తవి.
పురాణకథల్లో – కురుపాండవులు, రాముడు, ప్రహ్లాదుడు, కృష్ణుడు, ఏకలవ్యుడు మొదలైనవాటిల్లో పాతపురాణాల్లో కనబడే పక్షంగాక, అందులో తక్కువగా, నీచంగా చూడబడే పక్షంవైపు కవి బూగ్గి, పురాణాల్లో మెచ్చుకోబడే వారిలోకన్నా, వారిలోనే మకచి హెచ్చుగా వున్నదని, రెండోవైపు కథను చూపుతారు. విలువ ప్రధానాశ్రయంగా తీసుకొన్నారు.
చరిత్రాంశంగా పురాణాలు నిలవవు. రామాయణ, భారత గాథల కాల నిర్ణయాలు చేయటంలో రామస్వామిగారు నాటిక దొరికిన చారిత్రక పరిశోధనా వరవడిలోనే పయనించారు. కావ్యగత అంశాల్నీ గ్రహించారు. అంతేకాక, రామాయణగాథ యావత్తూ ఆర్య ద్రావిడ (లేక, వైష్ణవ, శైవ) ఘర్షణగా గ్రహించారు. భారత, భాగవత కృష్ణుని ద్రావిడత్వాన్ని వుగ్గడించారు. వైష్ణవ, శైవ పోరాటాలే పలనాటి చరిత్రకూ మూలకందంగా చూపారు. ఉత్తరాది కథలకు ప్రతిగా స్వీయదేశ కథను లేవదీసి, సామాన్యులను చిత్రించి, చరిత్రకు కవితావేశాన్ని కల్పించి, సాంఘికతలను వెలార్చారు.
కవిరాజులో సాంఘిక భావుకత అన్ని కావ్యాల్లో కనబడుతుంది. అది ఆయన రచనలోని విశిష్టత. ఆ సాంఘికతలో విలువలు కట్టగల గుణంకోసం, కార్యకారణ సంబంధంకోసం దేవులాడతాడు. నైతికతలు హేతుభావంతో చూడగలిగాడు. పాతపురాణ వైరం, వేదాలమీద మొదట్లో ఆధారపడి రానురాను వాటినీ కాదనటం, మామూలు దేవుళ్ళను, ఈసడించినా ఆదిలో కనబడే పరతత్వమహత్వాన్ని చూచిన భావం పూర్తి నాస్తికంలోకి పరిణతి వారటఁ ప్రాయికమైన హేతువాద వివేశనలు, తెలుగు నుడికారంతో కమ్మని కవిత్వాన్ని విమర్శలో అల్లగలగటం అనేవి కవిరాజులో ముఖ్యంగా గమనించదగ్గ ఐదు గుణాలు. యివి వారి భావాలు. కవిరాజు ప్రభావాలు, పరిణామశైలిలో పరిణతి నొందినవి.
పారపురాణ వైరం, పురాణ స్మృతి యితిహాసాల బండారాన్ని ఆంధ్రలో తరచి, తెరచి చూపినవాడు కవిరాజు. రూపాయికి రెండు ప్రక్కలున్నవని నిరూపించి, రెండవప్రక్క చూపించి, యధార్థాన్ని గ్రహించమని ఆవేదనలను లోకానికి నివేదించినాడు రామస్వామి. ఈయన భావుకతలో యిది అగ్రగణ్యమైనది.
వేద ప్రమాణం, మొదట్లో స్మృతి పురాణేతిహాసాలను కాదన్న రోజుల్లో (కురుక్షేత్రం, శంబుకవథ, సూతపురాణం) వైదిక ప్రామాణ్యతను అంగీకరించే భావాలు కలవు. వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తే సభకు వస్తానంటాడు శంబుకర్షి. కాని, భగవద్గీతలో పాత భగవద్గీత డుల్లిపుచ్చబడింది, వేదాలసారం వుపనిషత్తులు, ఉపనిషత్తుల సారం గీతగా యెంచబడు లోకభావనను కాదని త్రోసివేసినాడు. గీతను గిరాటు వేసి కొట్టిపారేశాడు. ఖూనీలో వేనుడు “ఆ వైదిక కర్మమన్న పొరపాటున నేనియు” మెచ్చని స్థితికి వచ్చాడు. వేనుడు కవిరాజు. వేనుని వాదన కవిరాజు భావాలు, కవిరాజు భావపరిణామాన్ని పొందినవైనం వేదపరంగా చూడవచ్చు.
దేవుడు – కవిరాజు ఆదిలో నాస్తికుడు కాదు. అనేకులైన దేవుళ్ళు లేకున్నా ములకారణమైన మహత్తర తత్వమేదో కలదన్న భావం సూతపురాణంలో కలదు. అది కవిరాజుకు దైవవాదిగా చేయకపోయినా, నాస్తికుడు కాదు. ప్రకృతివాది కావచ్చు. కాని ఖూనీలో వేనుని పాత్ర ద్వారానూ, పీఠికలోనూ సంపూర్ణమైన, స్పష్టమైన రీతిని వారి నాస్తికతను వెలార్చాడు. ఖూనీ నాటికి కవిరాజు పరిణతి చెందిన నాస్తికుడు.
హేతువాదం – కవిరాజు పురాణ వైరాన్ని పాటించినప్పుడు నైహిలిస్టుగా, ఐకనోక్లాస్ట.దా వున్నాడు. పాత దానిమీద అనుమానాన్ని పుట్టించి, పాత మానసిక పౌరాణిక చిత్రాలను ప్రజల్లో పగులగొట్టివేశారు. సూత పురాణాల నుండి గీతకు, ఖూనీకి వచ్చేసరికి, కవిరాజులో హేతువాదం ప్రకటితమై వెన్ను ముదిరినది. ఖూనీ పీఠికలు, గీతా భూమికలు దీనికి ప్రత్యక్షర నిదర్శనాలు. హేతువాదిగా మారే నాటికి నాస్తికుడుగా మారినారు.
సాంఘిక విమర్శ కవితలు – సాంఘిక దౌష్ట్యాలమీది దాడి, లోపాలనెత్తి చూపుట, విమర్శించి మరో మార్గాన్ని చూపుటలో కవిత్వస్థాయి కందుట కవిరాజు యేకైక విశిష్టత.
ఈ తీరు తెన్నులు పరిశీలిస్తే కవిరాజు త్రిపురనేని భావ పరిణామచ్ఛాయల్ని స్థూలరూపంలో గ్రహించవచ్చు.
త్రిపురనేని భావాలకు పట్టం కట్టాలి
తెనాలిలో కవిరాజు 125వ జయంతి సభలో వక్తలు
తెనాలి(మారీసుపేట), న్యూస్‌టుడే: సమాజంలో వ్రేళ్ళూనుకున్న అజ్ఞాన, అంధకారులను పారదోలటానికి, ప్రజలను హేతుబద్ధంగా మార్చటానికి సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న బావవిప్లవ వైతాళికుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి భావాలకు నేటితరం పట్టం కట్టాలని తమిళనాడుకు చెందిన ద్రవిడ కజగం నాయకులు ఎస్.అరివుక్కరసు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి త్రిపురనేని 125వ జయంతి సందర్భంగా స్థానిక కవిరాజు పార్కులో ఆయన విగ్రహాన్ని అరివుక్కరసు ఆవిష్కరించారు. అనంతరం కవిరాజు త్రిపునేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభకు సంస్థ గౌరవ అధ్యక్షులు, రాజ్యసభ మాజీసభ్యులు యడ్లపాటి వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరివుక్కరసు మాట్లాడుతూ పురాణ, రామాయణ మహాభారతాలను విమర్శించి ప్రజలకు ఆలోచించే శక్తిని కల్గించిన త్రిపురనేని ముందు తరాలకు మార్గదర్శి అన్నారు. తమిళనాడులో పెరియార్ రామస్వామి, ఆంధ్రప్రదేశ్‌లో త్రిపురనేని రామస్వామిలు ఇద్దరూ జస్టిస్ పార్టీలో కొనసాగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. బ్రాహ్మణేతరుల కోసం ఇద్దరు రామస్వాములు తమ జీవితాలను త్యాగం చేశారని శ్లాఘించారు. వివాహ విధి ద్వారా 'స్వయంగౌరవ' ఉద్యమాన్ని నడిపిన త్రిపురనేని 'సప్తపదిని' మాత్రం విడిచిపెట్టలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు గుమ్మా వీరయ్య మాట్లాడుతూ హేతువాద ఉద్యమకారులు త్రిపురనేని, ఎం.ఎన్.రాయ్‌ల 125వ జయంతి ఒకేసారి రావటం ద్వారా బలమైన ప్రచారం జరుగుతుందన్నారు. సాహిత్యంలో ఎవ్వరూ చేయలేని సాహసాలు కవిరాజు చేశారన్నారు. మతాన్ని, కులాన్ని, పురాణాన్ని హేతుబద్ధంగా విమర్శించిన ఆధునిక యుగవైతాళికుడు వేమనయితే, రామస్వామి భావవిప్లవ వైతాళికుడన్నారు. మతపరమైన ఆలోచనల నుంచి ప్రజలు బయటకు రాకుండా సమాజంలో ప్రగతి కన్పించదన్నారు. ప్రపంచంలో ఆర్థిక దారిద్య్రం కంటే తాత్విక దారిద్య్రం భయంకరమైందన్నారు. త్రిపురనేని రాసిన పద్యాలు చమత్కారంగా, వ్యంగ్యంగా ఉంటూ నాస్తికులనే కాకుండా ఆస్తికులను కూడా ఆకర్షించేవన్నారు. యడ్లపాటి వెంకట్రావు మాట్లాడుతూ వ్యవస్థలోని లోపాలను సాహిత్యం ద్వారా ప్రజలకు తెలియపరచి ప్రజలు మర్చిపోలేని ఎన్నో పనులు చేసిన త్రిపురనేని చిరస్మరణీయుడన్నారు. కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ సాంఘిక వారసత్వాన్ని, విప్లవాత్మక భావాలను హేతువాదాన్ని ఊపిరిగా చేసుకుని కడవరకూ నడిపిన వ్యక్తి త్రిపురనేని అన్నారు. ప్రజలకు ప్రశ్నించే గుణాన్ని, ఆలోచించే తత్వాన్ని నేర్పిన రామస్వామి భావాలకు అందరూ వారసులు కావాలన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సి.ఎల్.ఎన్.గాంధీ త్రిపురనేని బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిన విధానాన్ని వివరించారు. పొన్నూరు పి.బి.ఎన్. కళాశాల ప్రిన్సిపాల్ కొత్త పద్మావతి, అన్నపనేని గాంధీ, చలసాని ప్రసాద్, ఆచార్య అంజయ్య, డాక్టర్ దక్షిణామూర్తి, గురజాల సీతారామయ్య, మండలి సుబ్రహ్మణ్యం, అల్లూరు అనీల్, జెట్టి సాంబశివరావులు మాట్లాడారు. మేడూరి సత్యనారాయణ అరివుక్కరసు ఉపన్యాసాన్ని తెలుగులో అనువాదం చేశారు. త్రిపురనేని రచించిన 'సూతపురాణం' రచన సాహిత్య పుస్తకాలు రెండు భాగాలుగా పద్మావతి, అనీల్ ఆవిష్కరించారు. సభా పరిచయం జె.ఎస్.ఆర్.కృష్ణయ్య చేయగా నాగళ్ళ వెంకటదుర్గాప్రసాద్ వందన సమర్పణ చేశారు.(ఈనాడు)
The statue of Tripuraneni Ramaswamy unveiled
The statue of Tripuraneni Ramaswamy unveiled
A public meeting was organized by Kaviraju Tripuraneni Foundation, Tenali, Guntur District, A.P. to unveil the statue of Tripuraneni Ramaswamy by Sri S. Arivukkarasu, General Secretary of Dravida Kajagam, Tamil Nadu on 17th April 2011 at 5.30 PM in Kaviraju Park, Gandhinagar, Tenali.
J.S.R.Krishna invited all the speakers to the dais and introduced them. Sri Y.Venkata Rao, Honorary President of the Foundation presided over the meeting.
After unveiling the statue, Arivukkarasu delivered a lecture remembering the services rendered by T. Ramaswamy. He compared the services of T. Ramaswamy with Periyar E.V. Ramaswamy of Tamil Nadu. He explained that both Ramaswamis fought against the social evils including caste, untouchability, inequality, God, religion and innumerable blind beliefs and worked for non-brahmin movements in their respective areas. Meduri Satyanarayana, General Secretary, Rationalist Association of India translated the speech of Arivukkarasu into Telugu language.
Gumma Veeranna, President, Rationalist Association of Andhra Pradesh in his speech remembered that this year is the 125th birth year of T. Ramaswamy and also M.N. Roy, who dedicated their lives to bring philosophical revolution in our country. He said that Rationalist Association of India, under the leadership of Sri Ravipudi Venkatadri, a disciple of T. Ramaswamy, is working to achieve the goals set by Ramaswamy 75 years ago.
In the history of Telugu literature, Ramaswamy is the first poet who criticized all the puranas including Ramayana and Mahabharata etc. through his literature. He introduced Rationalist and Humanist attitude in his literature.
Sri Venkata Krishna, Commissioner, Tenali Municipality, praised the services of Ramaswamy as the Chairman of Tenali Municipality for 9 years. Ramaswamy was elected as the Chairman of Tenali Municipality for two times in the year 1925 and 1934. He died in the year 1943 at the age of 56 years. Govt. of India released a stamp in recognition of his services long back.
C.L.N. Gandhi, Additional Commissioner, Transport Department, Govt. of Andhra Pradesh, Kotha Padmavathi, Principal of PBN College, Ponnur, A. Gandhi, Publisher of Peacock Classics, Chalasani Prasad, Professor Anjaiah, Dr.Dakshinamurthy, G. Seetaramaiah, M. Subramanyam (Advocate), Atluri Anil (Grandson of Ramaswamy), J. Sambasiva Rao and others spoke on the occasion.
Kaviraju's book Suthapuranam is released in two parts on this occassion.
“Sutapuranam” a great poetry book written by Tripuraneni Ramaswamy was translated into prose by B. Ramakrishna in two parts. The first and the second part were released by K. Padmavati and A. Anil respectively in this occasion.
Gathering of admirers of late Kaviraju Tripuraneni Ramaswamy, at the meeting.
N.V. Durga Prasad conveyed vote of thanks. Nearly 200 people attended the meeting.
Report by G. Veeranna
President – Rationalist Association of A.P.
నవసమాజ మార్గదర్శకులు పెరియార్, త్రిపురనేని
April 18th, 2011
తెనాలి, ఏప్రిల్ 17: దక్షిణ పథంలో తమిళనాట పెరియారు రామస్వామి ఆంధ్రాలో ప్రధానంగా తెనాలి ప్రాంతంలో త్రిపురనేని రామస్వామిచౌదరి హేతువాదం ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ తమ భావాలను సామాజిక చైతన్యం కోసం వినియోగించారని, వీరిరువురు సమకాలికులు కావడంతోపాటు వారి అభిప్రాయాలు కూడా దగ్గరగానే ఉన్నాయని, ద్రవిడ కజగం నాయకులు ఎస్.అరివుక్కరుసు పేర్కొన్నారు. స్థానిక కవిరాజా పార్కులో ఆదివారం సాయంత్రం కవిరాజు త్రిపురనేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో భావ విప్లవోద్యమ వైతాళికులు శతావధాని, కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరి 125వ జయంతోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత తమిళనాడుకు చెందిన ద్రవిడ కజగం నాయకులు ఎస్.అరివుక్కరుసు, త్రిపురనేని రామస్వామి చౌదరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిగా పాల్గొన్న అరివుక్కరుసు మాట్లాడుతూ పెరియార్ రామస్వామి తమిళనాట, త్రిపురనేని రామస్వామిచౌదరి తెలుగునాట, సామాజిక చైతన్యం కోసం తమ భావాలను, విధానాలను ఏ విధంగా వినియోగించుకున్నది. తద్వారా ప్రజా చైతన్యానికి పాటుపడ్డ విధానాన్ని వివరించారు. తమిళనాట ఈ రోడ్డులో పెరియార్ రామస్వామి మున్సిపల్ ఛైర్మన్‌గాను, తెనాలిలో త్రిపురనేని రామస్వామి ఛైర్మన్‌గాను అందించిన సేవలను ప్రస్తుతించారు. వివాహ వ్యవస్థలోని ఆనాటి సాంప్రదాయాలను, భారత, రామాయణ, భాగవతాల్లోని అంశాలను ప్రశ్నిస్తూ సూత పురణాన్ని త్రిపురనేని రామస్వామిచౌదరి రచించిన తీరును వివరించారు. అదే విధంగా పెరియార్ రామస్వామి తమిళనాడు, శ్రీలంకల మధ్య రామసేతు విషయంలో వ్యవహరించిన తీరు కొంతమంది మత ఛాందస్సులు వాటిని అడ్డుకున్న విధానాన్ని వివరించారు. ఇదే సభలో మున్సిపల్ కమీషనర్ ఎస్.వెంకటకృష్ణ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మా వీరన్న, ప్రొఫెసర్ కొత్త పద్మావతి, రాష్ట్ర హేతువాత సంఘ నాయకులు మేడూరి సత్యనారాయణ, పార్టీ అడిషనల్ కమీషనర్ సిఎల్ఎన్.గాంధీ, మండల సుబ్రహ్మణ్యం, తదితర వక్తలు తమ ప్రసంగాల్లో త్రిపురనేని రామస్వామిచౌదరి సమాజానికి అందించిన సేవలను హేతువాదిగా, మూఢనమ్మకాలపై ఆయన అనుసరించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ నివాళి అర్పించారు. జెఎస్ఆర్.కృష్ణయ్య సభకు స్వాగతం పలుకగా, నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ వందన సమర్పణ చేశారు. ఇదే సభలో త్రిపురనేని రచనలను అతిధులు ఆవిష్కరించారు. కవిరాజు త్రిపురనేని ఫౌండేషన్ అధ్యక్షులు జెట్టి సాంబశివరావు, కొలసాని శ్రీనివాసరావు, పిజె.వర్థనరావు, నన్నపనేని మేఘనాధ్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పలువురు సాహితీవేత్తలు, త్రిపురనేని అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. (ఆంధ్రభూమి)
* అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌లలో నిర్వహణ
షికాగోలో యడ్లపాటి యుగంధర్, బోస్టన్‌లో శశికాంత్ వల్లేపల్లి,, వాషింగ్టన్లో డా. యడ్ల హేమప్రసాద్, డెలివరేలో శ్యాంబాబు, డెట్రాయిట్లో సాయిరమేష్, టొరంటోలో సూరపనేని లక్ష్మీనారాయణ, డల్లాస్‌లో తోటకూరప్రసాద్, న్యూయార్క్‌లో త్రిపురనేని తిరుమలరావు, సెయింట్‌లూయిస్‌లో దండమూరి రాజేంద్రప్రసాద్, చదలవాడ సుబ్బారావు సారథ్యంలో ఇంగ్లాండ్‌లో, లండన్ నగరంలో దాసోజు రాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు
......................... ............................... ..................
కవిరాజు రచనలు అనువాదం కావాలి | |||
| |||
| |||
| |||
| |||
| |||
|
VISAKHAPATNAM, April 17, 2011
Remembering ‘Kaviraju'
Noted Telugu poet and social reformer ‘Kaviraju' Tripuraneni Ramaswamy Choudary's 125th birth anniversary will be celebrated throughout the year all over the State and outside, including in the US and the UK.
Announcing this at a media conference here on Saturday, former Rajya Sabha member, Hindi professor in Andhra University and chairman of Jan Sikshan Sansthan Yarlagadda Lakshmi Prasad said that a statue of the poet would be unveiled in Tenali on Sunday. “I along with film actor Saichand, who is the grandson of Kaviraju and son of noted novelist Gopichand, will be touring the USA and the UK to attend various meetings being organised there as part of Kaviraju's birth anniversary. In the State, many meetings will be held, and at Visakhapatnam, we plan to release some volumes of his works,” he said. The former MP said the duo would be attending meetings in New York, Washington, Detroit, St. Lewis, and Chicago in the US and in London and Birmingham in the UK.
“Kaviraju was born in an agricultural family, went abroad to study Bar-at-Law and returned to the country. Instead of taking up the lucrative profession of a lawyer, he dedicated his life to serve the society and literature,” he said.
A disciple of Venkata Sastry of the Tirupati Venkata Kavulu duo, he earned the title of ‘Kaviraju', recommended by ‘Viswadata' ‘Desoddharaka' Kasinadhuni Nageswara Rao Pantulu during the Andhra Mahasabha conference held in Vijayawada in 1929, Prof. Lakshmi Prasad said. Among his patriotic songs, “Veeragandham Techchinaramu Veerudevvado Telpudee, Poosipodumu Medanu Vaithumu Pooladandalu Bhakthito..,” is very popular.
కవిరాజు జీవిత స్మృతులు
కవిరాజు జన్మము : 15-1-1887
తల్లిదండ్రులు : శ్రీరామమ్మ - చలమయ్య
‘ ప్రాణపంచకమ్ము నంతరాత్మయుగూడ
నాత్మ జాత్మజాత లైనభాతి
బుత్త్ర పంచకమ్ము పుత్రిక యొక్కర్తు
కాన్పుపంట యనగ గల్గి రందు’
అమ్మ కడగొట్టు బిడ్డడు ..... కవిరాజు
విద్యాభ్యాసము ..... 15-7-1895
ఆంగ్ల విద్యా ప్రవేశము ...... 15-1-1900
హైస్కూలులో ....... 15-1-1905
బొంబాయిలో ‘లా’ చదువు .. 15-1-1913
‘డబ్లిన్’ ప్రయాణము ........ 1-11-1914
బందరులో బారిష్టరు ప్రాక్టీసు .. 1-11-1917
తెనాలి ప్రాక్టీసు ప్రారంభము .. 15-6-1922
కురుక్షేత్ర సంగ్రామము
ఎఫ్.ఏ పాఠ్యగ్రంధ నిర్ణయము..... 1922-23సం.
‘కవిరాజ’ బిరుదము ...... 1929
గుడివాడ గజారోహణ సన్మానము .... 25-4-1942
నిర్యాణము ..... 16-1-1943
‘కవిరాజు’ గ్రంధ ప్రచురణము.. 30-11-1965
“అచ్చముగా ద్రావిడయోధుని జ్ణప్తి కెలయించు నిగనిగలాడు మేనివన్నె. విశాలహృదయమును నిశితమైన మేధస్సును మిన్నగా జూపనేర్చిన నెన్నుదురు. వంపులు తీరి సొంపులు నింపు గుబురైన మీసకట్టు. నిబ్బరము సుబ్బెడి సుందరమైన కందోయి. కందోయి కుద్దియై ఒద్దికగా తీర్చినట్టున్న చక్కని ముక్కు. తలపులలోని మెలపులకు సూచికయై అందమై కానవచ్చు ముందల. దాంతిని శాంతిని దర్పమును దండిగా దాచుకొన్న ముఖవైఖరి. వ్యూఢోరస్సు వృషస్కంధము. అతడే శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆపైని కవిరాజు; శతావధాని; బారిష్టరు. ఆతడా ‘కోవను’ వెలయించుటకే జన్మింపలేదు. కమ్మ కొలమునకే ‘మీదు’ కట్టలేదు. కృష్ణా గుంటూరులకే అంటిపెట్టుకొని యుండలేదు. తెలుగునేల నోచిన నోములపంటగా తెలుగువారికెల్లరకు దక్కిన మహాఫలము-ఆతడు..........
(కొత్త సత్యనారాయన చౌదరి రచించిన ‘కవిరాజు’ గ్రంధము నుండి....)
Click here to view/Download ‘కవిరాజు’ book :
No comments:
Post a Comment